జీశాట్-7 లేదా ఇన్సాట్-4ఎఫ్ అనునది బహు బ్యాండులు కలిగిన సమాచార ఉపగ్రహం.ఇది ఇండియన్ స్పేస్ రిసర్చ్ అర్గనైజేసన్ (ఇస్రో) వారు తయారు చేసిన ఉపగ్రహం.ఇస్రోవారు తయారు చేసిన ఏడు INSAT-4 ఉపగ్రహ శ్రేణిలో, జీశాట్-7 అరవ ఉపగ్రహం.ఈ ఉపగ్రహం రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం అంతయు భారతదేశపు అంతరిక్ష సంస్థ చేసింది.స్వదేశీయంగా నిర్మించిన బహు బ్యాండుల ఈ ఉపగ్రహాన్ని భారతీయ నావికాదళ సైన్యం ఉపయోగార్ధం నిర్మించి ప్రయోగించారు.సెప్టెంబరు 2013 నుండి ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తున్నది.భారతీయ రక్షణశాఖ నిపుణుల సమాచారం మేరకు, ఈ ఉపగ్రహం వలన భారతీయ నౌక దళం ఇకపై సమాచార సేకరణకై, సముద్రజల పర్యవేక్షన కై Inmarsat వంటి విదేశ ఉపగ్రహల పై ఆధార పడకుండా స్వయం సమాచార వ్యవస్థను పొందినది.

జీశాట్-7
మిషన్ రకంCommunication
ఆపరేటర్ISRO
COSPAR ID2013-044B Edit this at Wikidata
SATCAT no.39234
మిషన్ వ్యవధి7 years planned
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-2K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి2,650 kilograms (5,840 lb)
శక్తి3 kilowatts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ29 August 2013, 20:30 (2013-08-29UTC20:30Z) UTC
రాకెట్Ariane 5ECA
లాంచ్ సైట్Kourou ELA-3
కాంట్రాక్టర్Arianespace
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం74° East
Perigee altitude35,779 kilometres (22,232 mi)
Apogee altitude35,806 kilometres (22,249 mi)
వాలు0.06 degrees
వ్యవధి23.93 hours
ఎపోచ్7 November 2013, 23:12:49 UTC[1]
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్UHF
C-band
Ku-band
 

ఉపగ్రహం మార్చు

జీశాట్-7 లేదా ఇన్సాట్-4ఎఫ్ అనునది బహుబ్యాండులు కలిగిన సమాచార ఉపగ్రహం.ఈ ఉపగ్రహానికి రుక్మిణి అని నామకరణం చేసారు.ఈ ఉపగ్రహం కలిగి ఉన్న పెలోడులు: UHF, C-band, Ku band. భారతీయరక్షణ దళాలకు, ముఖ్యంగా నావికాదళానికి అవసరమైన సాంకేతిక సమాచారానని అందించుటకై ఇస్రో సంస్థ వారు రూపొందించిన మొదటి ఉపగ్రహం జీశాట్-7 /ఇన్సాట్-4ఎఫ్.ఈ ఉపగ్రహం బరువు 2,650 కిలో గ్రాములు. ఈ ఉపగ్రహాన్ని విదేశంనుండి ప్రయోగించుటకు అయిన ప్రయోగఖర్చు రూ.480 కోట్లు. జీశాట్-7 ఉపగ్రహాన్ని తయారుచెయ్యుటకు అయ్యిన ఖర్చు రూ.185 కోట్లు.ఈ ఉపగ్రహాన్ని నావికాదళం యొక్కయుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, భూనియంత్రణ కేంద్రాలకు సమాచారాన్ని చేరవేయుటకు ఎంతో ఉపయుక్తమైనది.జీశాట్-7 వలన సముద్రజలాలపర్యవేక్షణ ఎంతో బలోపేతమైనది.హిందూమహాసముద్రం యొక్క తూర్పు, పశ్చిమ తీరాల రక్షణ, పర్యవేక్షణ ఎంతో సులభమైనది.

ఉపగ్రహ ప్రయోగవివరాలు మార్చు

జీశాట్-7 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానా లోని కౌరౌ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుండి, ఏరియన్-5 ECA అను ఉపగ్రహ వాహకనౌక సహాయాన 2013 ఆగస్టు 30 న అంతరిక్షము లోకి పంపబడింది.ఉపగ్రహ వాహక నౌక ప్రయోగకేంద్రం నుండి బయలు దేరిన 34నిమిషాల తరువాత జీశాట్-7 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్సఫర్ ఆర్బిట్ (GTO ) లో,249 కిలోమీటర్ల పెరిజీలో, 35,929 కిలోమీటర్ల అపోజీలో భూమధ్య రేఖకు 3.5 డిగ్రీల వాలుగా ఉపగ్రహన్ని ఉంచారు.ఉపగ్రహాన్ని ప్రయోగించిన 5 రోజుల తరువాత కర్నాటక రాష్ట్రం లోని హాసన్లో ఉన్న ఇస్రోవారి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ కేంద్రంద్వారా మూడుసార్లు చేసిన కక్ష్య పెంపు చర్యలద్వారా ఉపగ్రహాన్నిఅంతిమ నిర్దేశిత కక్ష్యలో స్థిరపరచారు.2.5 టన్నుల బరువైనఉపగ్రహం యొక్క ఎంటెన్నానుమరియు అధిక ఫౌన పున్యమున్న హేలిక్సు ఎంటెన్నాను వియవవంతంగా తెరచారు. ఉపగ్రహంలోని అన్ని ట్రాన్స్‌పాండరులను 2013 సెప్టెంబరు 18న విజవంతంగా ప్రారంభించారు.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Peat, Chris (7 November 2013). "GSAT 7 - Orbit". Heavens Above. Archived from the original on 9 నవంబరు 2013. Retrieved 9 November 2013.