జునెబోటొ

నాగాలాండ్ రాష్ట్రంలోని జునెబోటొ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

జునెబోటొ నాగాలాండ్ రాష్ట్రంలోని జునెబోటొ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ పట్టణంలో సామి నాగులు నివసిస్తున్నారు. ఇక్కడ సుమి బాప్టిస్ట్ చర్చి ఉంది, ఇది ఆసియాలోనే అతిపెద్ద బాప్టిస్ట్ చర్చి.[2]

జునెబోటొ
View of Zünheboto Town
జునెబోటొ పట్టణ దృశ్యం
ముద్దుపేరు(ర్లు): 
ల్యాండ్ ఆఫ్ వారియర్స్
జునెబోటొ is located in Nagaland
జునెబోటొ
జునెబోటొ
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నిర్దేశాంకాలు: 25°58′00″N 94°31′00″E / 25.96667°N 94.51667°E / 25.96667; 94.51667Coordinates: 25°58′00″N 94°31′00″E / 25.96667°N 94.51667°E / 25.96667; 94.51667
రాష్ట్రంనాగాలాండ్
జిల్లాపెరెన్
సముద్రమట్టం నుండి ఎత్తు
1,852 మీ (6,076 అ.)
జనాభా
(2011)[1]
 • మొత్తం22,809
 • సాంద్రత331/కి.మీ2 (860/చ. మై.)
భాషలు
 • అధికారికఇంగ్లీష్
సుమి
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
798620
వాహనాల నమోదు కోడ్ఎన్ఎల్ - 06

రోలింగ్ కొండల పైభాగంలో నిర్మించబడిన ఈ పట్టణంలో జున్‌హెబో మొక్క ఎక్కువగా పెరుగుతుంది. అందుకే ఈ పట్టణానికి జున్‌హెబోటో అని పేరు వచ్చింది. జున్‌హెబోటో అంటే జున్‌హెబో పువ్వుల కొండ పైభాగం అని అర్థం.

భౌగోళికంసవరించు

ఈ పట్టణం 1,255 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1,852 మీటర్ల (6,076 అడుగుల) ఎత్తులో ఉంది. దీనికి ఉత్తరం వైపు మొకొక్‌ఛుంగ్ జిల్లా, తుఏన్‌సాంగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణం వైపు కోహిమా జిల్లా, ఫెక్ జిల్లా, పశ్చిమం వైపు వోఖా జిల్లా, కిఫిరె జిల్లా, తుఏన్‌సాంగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ జిల్లాలో డోయాంగ్, టిజు, డిఖు (నంగా), హోర్కి, లాంగ్కి నదులు ప్రవహిస్తున్నాయి.

జనాభాసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] ఈ పట్టణంలో 22,809 జనాభా ఉంది. ఇందులో 51.7% మంది పురుషులు, 48.23% మంది స్త్రీలు ఉన్నారు.

వాతావరణంసవరించు

డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో ఇక్కడ చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతం అధిక ఎత్తులో ఉండడంవల్ల హిమపాతం (మంచు) కురుస్తుంది. జూన్ నుండి ఆగస్టు వరకు వేసవికాలంలో ఉష్ణోగ్రత సగటున 80–90 °F (27–32 °C) ఉంటుంది. వేసవిలో భారీ వర్షాలు కూడా కురుస్తాయి.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "DISTRICT CENSUS HANDBOOK" (PDF). DIRECTORATE OF CENSUS OPERATIONS NAGALAND. p. 24.
  2. "Asia's largest church built in Nagaland; new church building set for dedication". International Business Times. Retrieved 4 January 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=జునెబోటొ&oldid=3091416" నుండి వెలికితీశారు