జూలూరు గౌరీశంకర్ తెలుగు రచయిత. ఈయన సృజనాత్మక సాహిత్యంలో ప్రసిద్ధుడు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'సృజనాత్మక సాహిత్యం' లో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[1]

జూలూరు గౌరీశంకర్ ను 2016 అక్టోబరు 22న తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యునిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు.[2]

జీవిత విశేషాలుసవరించు

సిధారెడ్డి ఆధ్వర్యంలో ఆయనే అధ్యక్షుడుగా తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. ఆ వేదికకు 2007లో జూకంటి జగన్నాధం, జూలూరి గౌరీశంకర్‌ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికై ఈ సంస్థ మరెన్నో కార్యక్రమాలు తీసుకుంది.[3][4]

సాహితీ సేవలుసవరించు

దళిత కవిత్వంలోను, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదం కవిత్వంలోను, బీసివాద కవిత్వంలోను తనదైన ముద్ర వేసుకున్న బలమైన గొంతు జూలూరి గౌరీశంకర్ ది. తన తొలి దీర్ఘకవిత రాసిన ఎలియాస్ 2001 నుంచి 2007లో వచ్చిన తెలంగాణ మోదుగుల పొదుగు చెకుముకి రాయి వరకు మొత్తం 14 దీర్ఘకవితల్తో ఏ తెలుగు కవి ఇప్పటి వరకు చేయని, చెరిగిపోని దీర్ఘ సంతకం చేసింది గౌరీశంకరొక్కడే. తను 2005లో రాసిన నాలుగో కన్ను బిసి దీర్ఘకవిత ఒక రోజు, ఒకే సమయానికి దాదాపు 22 కేంద్రాల్లో ఆవిష్కరింపబడటం విశేషం.[5]

రచనలు[6]సవరించు

  • పాదముద్ర
  • ఎలియాస్పొ
  • లికట్టె, వూరుచావు
  • నా తెలంగాణ
  • కాటు
  • సిలబస్‌లో లేని పాఠం
  • ఓ నమఃశవాయ
  • మూడవ గుణపాఠం
  • మాలకాకి
  • ముండ్లకర్ర (1995నుండి 2002 దాకా రాసిన కవితల సమాహారం)
  • నా తెలంగాణ” అనే దీర్ఘకవిత
  • పొక్కిలి తెలంగాణ కవుల కవితా సంకలనం[7]
  • ఆధునిక కవిత్వం

మూలాలుసవరించు

  1. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ (OCTOBER 22, 2016). "బీసీ కమీషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు". Retrieved 22 October 2016. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
  3. కవిత్వమై గెలిచిన తెలంగాణ[permanent dead link]
  4. Telangana poets, writers for ‘Yuddha Bheri’
  5. బిసీల నాలుగో కన్ను
  6. జూలురు లోకతప్త కవిత్వం ‘ముండ్లకర్ర’
  7. నవతెలంగాణ, దీపిక (8 October 2015). "ఉద్యమ నేపథ్యంలో వెల్లువెత్తిన కవిత్వం". కె.పి.అశోక్‌కుమార్‌. మూలం నుండి 24 April 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 17 July 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులుసవరించు