జూలూరు గౌరీశంకర్

తెలుగు రచయిత

జూలూరు గౌరీశంకర్ తెలుగు రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు. ఈయన సృజనాత్మక సాహిత్యంలో ప్రసిద్ధుడు. 2013 సంవత్సరానికిగాను తెలుగు విశ్వవిద్యాలయం నుండి 'సృజనాత్మక సాహిత్యం'లో "కీర్తి పురస్కారాన్ని" అందుకున్నాడు.[1]

జూలూరు గౌరీశంకర్
జూలూరు గౌరీశంకర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 - ప్రస్తుతం
ముందు నందిని సిధారెడ్డి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016 - 2019

వ్యక్తిగత వివరాలు

జననం 1960, జనవరి 4
కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
నివాసం హైదరాబాద్
వృత్తి రచయిత, వక్త, విమర్శకుడు

జూలూరు గౌరీశంకర్ ను 2016 అక్టోబరు 22న తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యునిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు.[2]ఆయన 17 డిసెంబర్ 2021న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితుడై,[3][4] 2021 డిసెంబరు 22న భాద్యతలు చేపట్టాడు.[5][6][7]

జననం, విద్యాభాస్యం సవరించు

జూలూరు గౌరీశంకర్ 1960, జనవరి 4న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నడిగూడెంలో జన్మించాడు. ఆయన 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నడిగూడెంలో, 10వ తరగతి అనంతగిరిలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన కోదాడలోని కేఆర్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశాడు. గౌరీశంకర్ కోదాడలో లెక్చరర్‌గా పనిచేస్తూనే వివిధ పత్రికల్లో పదేళ్ల పాటు జర్నలిస్టుగా పని చేశాడు.[8]

 
జూలూరు గౌరీశంకర్

జీవిత విశేషాలు సవరించు

సిధారెడ్డి ఆధ్వర్యంలో ఆయనే అధ్యక్షుడుగా తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. ఆ వేదికకు 2007లో జూకంటి జగన్నాధం, జూలూరి గౌరీశంకర్‌ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికై ఈ సంస్థ మరెన్నో కార్యక్రమాలు తీసుకుంది.[9][10]

సాహితీ సేవలు సవరించు

దళిత కవిత్వంలోను, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదం కవిత్వంలోను, బీసివాద కవిత్వంలోను తనదైన ముద్ర వేసుకున్న బలమైన గొంతు జూలూరి గౌరీశంకర్ ది. తన తొలి దీర్ఘకవిత రాసిన ఎలియాస్ 2001 నుంచి 2007లో వచ్చిన తెలంగాణ మోదుగుల పొదుగు చెకుముకి రాయి వరకు మొత్తం 14 దీర్ఘకవితల్తో ఏ తెలుగు కవి ఇప్పటి వరకు చేయని, చెరిగిపోని దీర్ఘ సంతకం చేసింది గౌరీశంకరొక్కడే. తను 2005లో రాసిన నాలుగో కన్ను బిసి దీర్ఘకవిత ఒక రోజు, ఒకే సమయానికి దాదాపు 22 కేంద్రాల్లో ఆవిష్కరింపబడటం విశేషం.[11]

రచనలు సవరించు

 • పాదముద్ర
 • ఎలియాస్పొ
 • లికట్టె, వూరుచావు
 • నా తెలంగాణ
 • కాటు
 • సిలబస్‌లో లేని పాఠం
 • ఓ నమఃశవాయ
 • మూడవ గుణపాఠం
 • మాలకాకి
 • ముండ్లకర్ర (1995నుండి 2002 దాకా రాసిన కవితల సమాహారం) [12]
 • నా తెలంగాణ” అనే దీర్ఘకవిత
 • పొక్కిలి తెలంగాణ కవుల కవితా సంకలనం[13]
 • ఆధునిక కవిత్వం
 • ఒక్కగానొక్కడు [14]
 • ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం [15]
 • మట్టి చిగురు [16]
 • పచ్చా ప‌చ్చ‌ని ప‌ల్లె [17]

పురస్కారాలు సవరించు

మూలాలు సవరించు

 1. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
 2. నమస్తే తెలంగాణ (22 October 2016). "బీసీ కమీషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు". Archived from the original on 23 October 2016. Retrieved 22 October 2016.
 3. Namasthe Telangana (17 December 2021). "పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
 4. Eenadu (17 December 2021). "పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఖరారు చేసిన కేసీఆర్‌". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
 5. Eenadu (22 December 2021). "ముగ్గురు చైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
 6. Namasthe Telangana (22 December 2021). "జూలూరి గౌరీ శంకర్‌ను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, వినోద్‌ కుమార్‌". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
 7. Mana Telangana (22 December 2021). "జూలూరి గౌరీశంకర్‌ను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్,". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
 8. Andhrajyothy (18 December 2021). "ఉమ్మడి జిల్లాకు 2 పదవులు". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
 9. కవిత్వమై గెలిచిన తెలంగాణ[permanent dead link]
 10. Telangana poets, writers for ‘Yuddha Bheri’
 11. బిసీల నాలుగో కన్ను[permanent dead link]
 12. "జూలురు లోకతప్త కవిత్వం 'ముండ్లకర్ర'". Archived from the original on 2015-09-20. Retrieved 2015-06-28.
 13. నవతెలంగాణ, దీపిక (8 October 2015). "ఉద్యమ నేపథ్యంలో వెల్లువెత్తిన కవిత్వం". కె.పి.అశోక్‌కుమార్‌. Archived from the original on 24 April 2017. Retrieved 17 July 2019.
 14. Sakshi (14 February 2021). "'ఒక్కగానొక్కడు' సీఎం కేసీఆర్‌". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch (help)
 15. Namasthe Telangana (23 October 2021). "'ఆత్మబంధువు - దళిత సంక్షేమ బంధం' పుస్తకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch (help)
 16. NTV (17 September 2021). ""మట్టి చిగురు" పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.
 17. Andhrajyothy (11 January 2022). "తెలంగాణ వచ్చాక పల్లెల రూపురేఖలు మారిపోయాయి". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
 18. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.

ఇతర లింకులు సవరించు