జే.పంగులూరు

ఆంధ్ర ప్రదేశ్, బాపట్ల జిల్లా లోని గ్రామం, మండలకేంద్రం


జే.పంగులూరు (జనకవరం పంగులూరు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాకు చెందిన గ్రామం, మండల కేంద్రం[2].ఇది సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 38 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1829 ఇళ్లతో, 6087 జనాభాతో 1942 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3005, ఆడవారి సంఖ్య 3082. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1762 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 206. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590751[3].

జే.పంగులూరు
పటం
జే.పంగులూరు is located in ఆంధ్రప్రదేశ్
జే.పంగులూరు
జే.పంగులూరు
అక్షాంశ రేఖాంశాలు: 15°47′N 80°7′E / 15.783°N 80.117°E / 15.783; 80.117
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంజే.పంగులూరు
విస్తీర్ణం19.42 కి.మీ2 (7.50 చ. మై)
జనాభా
 (2011)[1]
6,087
 • జనసాంద్రత310/కి.మీ2 (810/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,005
 • స్త్రీలు3,082
 • లింగ నిష్పత్తి1,026
 • నివాసాలు1,829
ప్రాంతపు కోడ్+91 ( 08593 Edit this on Wikidata )
పిన్‌కోడ్523214
2011 జనగణన కోడ్590751

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,228. ఇందులో పురుషుల సంఖ్య 3,086, మహిళల సంఖ్య 3,142, గ్రామంలో నివాస గృహాలు 1,661 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కోటపాడులోను, ఇంజనీరింగ్ కళాశాల చిలకలూరిపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ అద్దంకిలోను, మేనేజిమెంటు కళాశాల ఇంకొల్లులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఇంకొల్లులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఒంగోలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

జనకవరం పంగులూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

జనకవరం పంగులూరులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

జనకవరం పంగులూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 250 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 84 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 4 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 74 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 177 హెక్టార్లు
  • బంజరు భూమి: 281 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1068 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1214 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 313 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

జనకవరం పంగులూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 308 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 4 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

జనకవరం పంగులూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, శనగ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

ఎం.ఎస్.ఆర్.బి.ఎన్.ఎం జూనియర్ కళాశాల.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

మార్చు

1965 కి ముందు ఈ గ్రామములో ఉన్నత పాఠశాల లేదు. ఉన్నత విద్యకొరకు, ఈ గ్రామ విద్యార్థులు, సమీప గ్రామాలయిన గంగవరం, పావులూరు, రావినూతల, తిమ్మసముద్రం గ్రామాలకు వెళ్ళవలసివచ్చేది. అందువలన ఈ గ్రామస్థులు గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటుకు నడుం బిగించారు. గ్రామానికి చెందిన దాతలు శ్రీ వసంత సుబ్బయ్య, బాపనయ్య, నారాయణ పాఠశాల భవన నిర్మానానికి అవసరమైన మూడు ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. వీరిలో దాత వసంత నారాయణ, భూమితోపాటు, ఆ రోజులలోనే, నాలుగువేల రూపాల నగదు గూడా అందజేసినారు. గ్రామస్థులంతా ఎవరికి తోచినవిధంగా వారు, విరాళాలనందించడంతో పాఠశాల నిర్మాణం పూర్తి అయినది. తొలి ప్రధానోపాధ్యాయులుగా శ్రీ చెన్నుపాటి నాగేశ్వరరావు పనిచేసారు. పాఠశాల ఏర్పడిన తరువాత రెండు సంవత్సరాలపాటు బోధన, బోధనేతర సిబ్బందికి జీతభత్యాలను గ్రామస్థులే సమకూర్చటం విశేషం. ఇప్పటి వరకు మొత్తం 4,100 మంది ఈ పాఠశాలలో విద్యనభ్యసించి వివిధ రంగాలలో రాణించుచున్నారు. వీరిలో కొంతమది దేశ, విదేశాలలో స్థిరపడినారు. ఈ పాఠశాల పూర్వవిద్యార్థులు, 2000 అక్టోబరు 17 లో ఒక సంఘంగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు. వీరి కృషితో పాఠశాలలో సకల సౌకర్యాలు సమకూరినవి. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయుచున్నారు. 50 సంవత్సరాల క్రితం ఒక చిన్న పూరిపాకలో ప్రారంభమయిన ఈ పాఠశాల, 2015, జూన్-6వ తేదీ శనివారం నాడు, 7వ తేదీ ఆదివారం నాడు స్వర్ణోత్సవాలు జరుపుకున్నది.

2016-17 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో పదవ తరగతి చదివిన పాలపర్తి పవన్‌తేజ అను విద్యార్థి, 9.8 జి.పి.యే సాధించడమేగాక, నూజివీడులోని ఐ.ఐ.ఐ.టిలో ప్రవేశానికి అర్హత సాధించాడు.

గ్రంథాలయo

మార్చు

ఈ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్ధం, దాతల సహకారంతో, ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ నిర్మాణానికి 2015, నవంబరు-2వ తేదీనాడు, దాతలు, గ్రామ పెద్దలు శంకుస్థాపన నిర్వహించారు. ఈ గ్రంథాలయాన్ని, 2016, జనవరి-16న ప్రారంభించారు. చిన్నతనంలో మృతిచెందిన తమ కుమారుడు చి.గౌతం శాయిరాం ఙాపకార్ధం, చింతపల్లి శేషయ్య, రాధిక దంపతులు దీనిని నిర్మించారు.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

మార్చు

ఈ గ్రామములోని అంబేద్కర్ కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల 13, జనవరి-2014 నాటికి 60 వ వసంతంలోనికి అడుగిడనున్నది.[4]

మౌలిక సదుపాయాలు

మార్చు
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
  • స్త్రీశక్తి భవనం:-25 లక్షల రూపాయల ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.నిధులతో చేపట్టిన ఈ భవన నిర్మాణానికి 2013 మధ్య కాలంలో శంకుస్థాపన నిర్వహించారు. ఆ తరువాత నిధులు సరిపోక, 2015 మధ్యకాలం వరకు గూడా పూర్తి కాకపోవడంతో, మరియొక ఏడు లక్షల రూపాయలు మంజూరవడంతో ఇప్పుడు ఈ భవనం నిర్మాణం పూర్తి చేసారు. జనవరిలో ఈ భవనం ప్రారంభోత్సవం నిర్వహించగానే, ఇంతవరకు అద్దె భవనంలో కొనసగుచున్న వెలుగు కార్యాలయాన్ని ఈ భవనంలోనికి తరలించెదరు.
  • అన్నగారి సంత:- పంగులూరు గ్రామములోని వ్యవసాయ మర్కెట్ కమిటీ ఆవరణలో ఈ సంతను, 2015, అక్టోబరు-9వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ సంతను ప్రతి శుక్రవారం నిర్వహిస్తారు.
  • బ్యాంకులు:- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
  • త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ సాయినాధ శుద్ధజల కేంద్రాన్ని, 2016, ఫిబ్రవరి-10న ప్రారంభించారు. ఈ కేంద్రంలో 20 లీటర్ల శుద్ధిచేసిన త్రాగునీటిన నాలుగు రూపాయలకే అందజేసారు.
  • తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపం:- గ్రామములోని ఈ భవన నిర్మానానికి గ్రామస్థులు రెండు ఎకరాల స్థలాన్ని అందించారు. దాతలు అందించిన పది లక్షల రూపాయలను గ్రామస్థుల భాగస్వామ్యపు సొమ్ముగా, తి.తి.దేవస్థానికి అందించారు. దేవస్థానం వారు ఒక కోటి రూపాయల నిధులను విడుదల చేసారు. 2013లో, చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయ సమీపంలో, భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. నిర్మాణం ప్రారంభమైనది. 2017 జనవరి నాటికి పూర్తి కాగలదని ఆశించుచున్నారు.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

వెంకటాయకుంట:- 12.96ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట, పంగులూరు గ్రామ దక్షిణ ప్రాంత రైతుల కల్పతరువు. ఈ కుంటలో ఇటీవల నీరు-చెట్టు పథకం ద్వారా పూడిక తీత పనులు నిర్వహించారు.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దాచిన నీరజ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె 25-11-2013న మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు.[5]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ తేనె అంకమ్మ తల్లి ఆలయo

మార్చు

పంగులూరి గ్రామ దేవత శ్రీ తేనె అంకమ్మ తల్లి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని, 2013 నవంబరు 27 బుధవారం నాడు, వేదపండితులు, 11 మందిఋత్విక్కులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. విగ్రహ దాత శ్రీ గన్నవరపు హనుమంతరావు ఆధ్వర్యంలో, భక్తులకు అన్నసంతర్పణ జరిగింది.[6]

గ్రామదేవత శ్రీ సీతలాంబ వారి ఆలయం

మార్చు

పంగులూరు గ్రామదేవత సీతలాంబ అమ్మవారి పీఠం వార్షికోత్సవాలను 2017, జూన్-14వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ఊరేగింపుగా ఆలయానికి వచ్చి, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకపూజలు చేసి, అమ్మవారికి, పసుపు, కుంకుమలు, పూలు, గాజులు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి విచ్చేసి, అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [28]

శ్రీ గంగా భాగీరథీ సమేత శ్రీ భీమలింగేశ్వరస్వామి వారి ఆలయo

మార్చు

పంగులూరు గ్రామములోని శ్రీ భీమలింగేశ్వరస్వామి వారి ఆలయ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక కళ్యాణమంటపం నిర్మించుచున్నారు. గ్రామస్థులు రు.10 లక్షలు చెల్లించారు. దేవస్థానంవారు రు. 81 లక్షలు విడుదల చేశారు. 2014, ఫిబ్రవరికి నిర్మాణం పూర్తి అగును.[7] ఈ గ్రామములోని భీమలింగేశ్వరస్వామి ఆలయానికి 52.25 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఆదాయం=రు.1.5 లక్షలు., ఈ ఆలయ ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదు. పురాతన రథం శిథిలమైనది. రథశాల గతంలో కూలిపోయింది. ఈ పరిస్థితికి స్పందించిన దాతలు, ఆలయప్రాంగణంలో రు. 20 లక్షల వ్యయంతో, నూతనంగా భోజనశాల మరియూ వాహనశాల నిర్మించి ఆలయ కమిటీవారికి అప్పగించారు.

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. శుక్ల త్రయోదశి నాడు ఈ ఉత్సవాలు ప్రారంభమగును. చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. పౌర్ణమి నాడు మద్యాహ్నం అన్నసంతర్పణతో ఉత్సవాలు సమాప్తమవుతవి. ఈ ఆలయంలో 2014, మే-12, సోమవారం నాడు దాతలు సమకూర్చిన నాగేంద్రస్వామివారి విగ్రహం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహం, ధ్యానపరమేశ్వరమూర్తి విగ్రహాలను ఆవిష్కరించారు.

ఈ ఆలయంలో 2016, మే నెల (వైశాఖమాసం) లో, ఈ ఆలయ 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుచున్నారు.

ఈ ఆలయప్రాంగణంలో 2015, నవంబరు-28వ తేదీ శనివారం ఉదయం 9-50 గంటలకు, శ్రీ అభయంజనేయస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని దాతలు శ్రీ వల్లభనేని రవికుమార్, మాధవీలత దంపతులు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 27వతేదీ శుక్రవారంనాడు, నిత్యపూజ, వాస్తుపూజ, హోమపూజ, పర్యగ్నీకరణం, నవగ్రహ మండపారధన తదితర పూజధికాలను, శైవాగమ పండితుల పర్యవేక్షణలో నిర్వహించారు.

స్థానిక అవధూత భక్తమండలివారు, ప్రతి పౌర్ణమికి, స్వామివారి ఆలయంలో ఉభయదాతల సహకారంతో, ప్రారంభం నుండి ఇంతవరకు, 381 శివనామ ఏకోహాలు నిర్వహించారు. 382వ ఏకాహాన్ని, 2017, మార్చి-12వతేదీ ఆదివారం, ఫాల్గుణ పౌర్ణమి, హోలీపండుగనాడు, నగరసంకీర్తనతో ప్రారంభించారు. 13వతేదీ సోమవారంనాడు పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణతో ఈ కార్యక్రమం ముగియును.

శ్రీ రుక్మిణీ సత్యభా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం

మార్చు

ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. ధ్వజస్తంభం ఒరిగిపోయింది. పునర్నిర్మాణం అవసరం. ఈ పరిస్థితికి స్పందించిన దాతలు, ప్రధానాలయంపైన ఉన్న, శిథిలమైన పురాణకకథలకు సంబంధించిన, 24 బొమ్మలకు, రు. రెండు లక్షల వ్యయంతో మరమ్మత్తు చేయించి, రంగులద్దించారు.[8]

ఈ ఆలయంలో జీవధ్వజ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, జూన్-4వ తేదీ గురువారం నుండి ప్రారంభమైనవి. ఈ సందర్భంగా ఉదయం, ఆలయంలో భగవత్ ప్రార్థన, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ద్వాదశసూక్త పారాయణం, వాస్తుహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అంకురారోపణ, నవగ్రహ ఆరధన, అగ్నిప్రతిష్ఠపన నిర్వహించారు. 5వ తేదీ శుక్రవారంనాడు, హోమాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆరవ తేదీ శనివారంనాడు, నూతన జీవ ధ్వజస్తంభం, గ్రామంలో ప్రతిష్ఠించనున్న సీతలాంబ అమ్మవారి ప్రతిరూపం, ఆంజనేయ, గరుడ మూర్తులకు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ప్రతిష్ఠా మూర్తులకు మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించగా, గ్రామస్థులు అడుగడుగునా నీరాజనాలు పట్టినారు. ఈ వేడుకల నేపథ్యంలో పంగులూరు గ్రామములో పండుగ వాతావరణం నెలకొన్నది. బంధుమిత్రుల రాకతో, గ్రామస్థుల ఇళ్ళలో సందడి నెలకొన్నది. 7వ తేదీ ఆదివారంనాడు, ఈ ఆలయంలో జీవధ్వజస్తంభం, సీతలాంబా అమ్మవారిప్రతిష్ఠా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అంధకళాకారుల సంగీత విభావరి, ఆహుతులను ఆకట్టుకున్నది. ఈ ప్రతిష్ఠోత్సవాల సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.

శ్రీ రామాలయం

మార్చు

పంగులూరు గ్రామంలోని బ్రాహ్మణ వీధిలోని రామాలయంలోనూ మరియూ ఎస్.సి.కాలనీలోని రామాలయం వద్ద, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు.

శ్రీ రేణుకమ్మ తల్లి ఆలయం

మార్చు

పంగులూరు గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక కొలువులు, 2014, ఆగస్టు-20, బుధవారంతో ముగిసినవి. రాష్ట్రం నలుమూలల నుండి 'బాచిన" వంశస్థులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మద్యాహ్నం ఆలయంలో భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ పోలెరమ్మ దేవస్థానం

మార్చు

ముఖ్యంగా చెప్పాలంటె పడమటి బజారున వున్న పోలెరమ్మ దేవస్థానము యెంతో ప్రాముఖ్యం చెందినంది. ఇక్కడ అమ్మవారికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది, అమ్మవారికి ప్రతి ఆదివారం పూజలు భజనలు చేస్తూవుంటారు. గ్రామ ప్రజలు తమ తమ మొక్కులును వివిధ రూపాలలో చెల్లిస్తూవుంటారు. ఫ్రతి సంవత్సరం జాతరలు చేస్తారు.

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం

మార్చు

ఈ ఆలయ దశమ వార్షికోత్సవం, 2017, మార్-6వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటంతో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు.

ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

మార్చు

మేకల సీతారామిరెడ్డి

మార్చు

ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వీరు, చిన్నప్పటినుండి ఖో-ఖో క్రీడపై మక్కువతో నిరంతరం శ్రమించి, ఈ క్రీడలో ప్రావీణ్యం సంపాదించి, పలు పోటీలలో పతకాలు సాధించారు.

1992లో పంగులూరులోని ఎం.ఎస్.ఆర్.బి.ఎన్.ఎం జూనియర్ కళాశాలలో వ్యాయామోపాధ్యాయులుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. వీరు స్వయంగా రాష్ట్రంలోనే తొలిసారిగా, దాతల సహకారంతో, స్వయంగా, ఖో-ఖో క్రీడా అకాడమీని స్థాపించి, క్రీడాకారులకు సంవత్సరం పొడవునా శిక్షణనిచ్చుచూ, ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు, క్రీడా దుస్తులు అందజేయుచున్నారు. ఇంత వరకు 1210 మండి క్రీడాకారులకు శిక్షణనిచ్చారు. వీరి శిక్షణలో క్రీడాకారులు రాటుదేలినారు. వారిలో ఇద్దరు అంతర్జాతీయస్థాయి పోటీలలో పతకాలు సాధించినారి. వారిలో భవనం కాశీ విశ్వనాథరెడ్డి, 1998లో శ్రీలంకలోనూ, పాలకీర్తి శ్రీను 2016లో గౌహతిలోనూ అంతర్జాతీయస్థాయి పోటీలలో పాల్గొని స్వర్ణ పతకాలు సాధించారు. మండవ సౌజన్య అను మరియొక మహిళా క్రీడాకారిణి 2002 లో హైదరాబాదులో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నది. వీరి వద్ద శిక్షణ పొందిన 100 మందికి పైగా క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి విజయం బాట పట్టినారు.

2017, ఆగస్టు-8న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రపూర్ పట్టణంలో నిర్వహించిన ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సర్వసభ్య సమావేశంలో, భారతదేశస్థాయిలో వీరిని ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామ విశేషాలు

మార్చు

పంగులూరు గ్రామంలోని మేకల సీతారామిరెడ్డి క్రీడా అకాడమీలో 9 సంవత్సరాలుగా శిక్షణ పొందుచున్న క్రీడాకారుడు పాలపర్తి శ్రీను , 2016, ఫిబ్రవరిలో అసోం రాష్ట్రంలో నిర్వహించు అంతర్జాతీయ ఖో-ఖో పోటీలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనాడు. ఇతడు 2015, నవంబరు-21 నుండి 27 వరకు మహారాష్ట్రలోని షోలాపూర్ లో నిర్వహించిన సీనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన అనన్య సామన్యమైన ప్రతిభ ప్రదర్శింనాడు. ఇతడు 2005-2006 నుండి జిల్లాస్థాయిలో 30సార్లు, రాష్ట్రస్థాయిలో 15 సార్లు, జాతీయస్థాయిలో 15 సార్లు పాల్గొని బహుమతులు అందుకున్నాడు.

మూలములు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ఈనాడు ప్రకాశం/అద్దంకి; జనవరి-7,2014; 2వ పేజీ.
  5. ఈనాడు ప్రకాశం/అద్దంకి, 26 నవంబరు,2013. 1వ పేజీ.
  6. ఈనాడు ప్రకాశం/అద్దంకి,28-11-2013,3వ పేజీ.
  7. ఈనాడు,ప్రకాశం/అద్దంకి,డిసెంబరు-21,2013.3వ పేజీ.
  8. ఈనాడు ప్రకాశం/అద్దంకి; జనవరి-4,2014;1వపేజీ.

వెలుపలి లంకెలు

మార్చు