జై శ్రీనివాస్

భారతీయ నేపథ్య గాయకుడు (మరణం : 2021)

జై శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినీ గాయకుడు. ఆయన సినిమా, దేశభక్తి, జానపద, భక్తి పాటలు పాడారు.[1]

జై శ్రీనివాస్‌
జననంనేరడికొమ్మ శ్రీనివాస్‌
మందమర్రి, మంచిర్యాల జిల్లా, తెలంగాణ
మరణం21 మే 2021
హైదరాబాద్
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లునేరడికొమ్మ శ్రీనివాస్‌
ప్రసిద్ధిసినీ గాయకులు
భార్య / భర్తస్వాతి
పిల్లలుఇద్దరు కూతుళ్లు - అభిష్ణు, జైత్ర
తండ్రినేరేడుకొమ్మ రామాచారి
తల్లినేరేడుకొమ్మ సీతామణి

జననం, విద్యాభాస్యం

మార్చు

నేరడికొమ్మ శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్రం , మంచిర్యాల జిల్లా , మందమర్రి లో నేరేడుకొమ్మ రామాచారి, సీతామణి దంపతులకు జన్మించాడు. ఆయన మందమర్రిలోని సింగరేణి హైస్కూల్‌లో 1993లో పదో తరగతి పూర్తి చేశాడు.

పాడిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాట పేరు సంగీత దర్శకుడు
2002 మీ కోసం ఓ లాలీ ఓ లాలీ మహతి
2004 జై దేశం మనదే.. తేజం మనదే అనూప్ రూబెన్స్
2005 అలజడి చేప కళ్ల పాపా చంద్రగిరిమహారాజా
2006 వీధి నా చిట్టి తల్లి అనూప్ రూబెన్స్
2008 గుండె ఝల్లుమంది పావడ కాస్త ఎం.ఎం. కీరవాణి
కుర్కురే వారెవ్వా వారెవ్వా రాజేశ్వరి
ఎక్కడున్నావమ్మా ఓ ప్రేమిక నా గుండె మీద, ఎక్కడున్నావమ్మా ఎస్.రాజ్ కిరణ్
2009 నా స్టైల్ వేరు కొట్టు కొట్టు అనూప్ రూబెన్స్
2010 కామెడీ ఎక్స్‌ప్రెస్ కా కా కా కామెడీ, నువ్వుంటే నిత్య , అమ్మ నాన్న సామ్ డి. కాస్టో
ప్రేమిస్తావా పొంగే గోదారివో మను రమేష్
అందరి బంధువయ (సినిమా) సూర్యుడు ఎవరయ్యా అనూప్ రూబెన్స్
చేత వెన్న ముద్దా నిజమే తెలిసి, ఎటి ఒడ్డున, అందలాపూదోట రవిశ్వరూపం
2011 నిత్య పెళ్లి కొడుకు నాకు డౌటు ఘంటాడి కృష్ణ
సంక్రాంతి అల్లుడు బొంబాయి ..ఢిల్లీ కే . మోహన్ దాస్
పాపి చిరుజల్లు కురవంగా, నా చిన్నోడా ఎల్.ఎం. ప్రేమ్
ఇష్టపడితే కొమ్మ మీద , ఎటి ఒడ్డున, వసంతం వచ్చిందో ఎస్.రాజ్ కిరణ్
వనకన్య వండర్ వీరుడు ఎక్కడ ఉన్న ఎస్.రాజ్ కిరణ్
2012 నరసింహ రాజు ఈ చల్ల గాలికి ఎస్.రాజ్ కిరణ్
నా తెలంగాణ పెద్దమనిషివైతివి .. డి. బాలాజీ
కూల్ బాయ్స్ హాట్ గర్ల్స్ ప్రేమంటే ఎంతో నందన్ రాజ్
భిక్కు రాథోడ్ వయా వయ్యారి వయా ,గెలిచేటట్టు ఆడరా బొంబాయి భోలే
యమహో యమా నూరు మూసుకొని మహతి
హాస్టల్ డేస్ నిన్న ఎవరో మోహిని రాజ్
2013 రైటర్ నీ అందెల సందడిలో రుంకి గోస్వామి
మనసున మనసై ఎదురంటూ ఘంటాడి కృష్ణ
ఒంగోలు గిత్త మామ మారాజు జి. వి. ప్రకాష్
ఒకే ఒక ఛాన్స్ కన్నవాళ్ళనొదిలేశాము రమణ కానూరి
క్రేజీ ఎందుకీ మారం ఎస్.ఎస్. తమన్
ఎన్.హెచ్ 4 ఓరకన్నులతో జి. వి. ప్రకాష్
XYZ జూమ్ జూమ్ జికె
ప్రణయ వీధుల్లో ఘల్లు ఘల్లు ఓరుగల్లు జోశ్యభట్ల రాజశేఖర్ శర్మ
2014 నాన్ స్టాప్ ఆనందాలే మన ఆస్తులు , టాటా బై బై బొంబాయి భోలే
ఇంద్రుడు ఆడు భయ్యా ఆడు జి. వి. ప్రకాష్
బ్రోకర్ 2 జన గణ మన విజయ్ బాలాజీ
రాజా రాణి హే బేబీ జి. వి. ప్రకాష్
నా లవ్ స్టోరీ మొదలైంది ఎల్లిపోవే ఏలు అనిరుద్ రవిచందర్
కొత్త ప్రేమ ప్రియతమా రాజా
నా కర్మ కాలిపోయింది కండబలం ఘణ శ్యామ్
నాని బుజ్జి బంగారం నీలి మేఘం ఆదేశ్ రవి
2015 బందూక్ ఇది చరిత్ర కార్తీక్ కొడకండ్ల
శని దేవుడు గురువు గారి మాట అనిల్ నండూరి
టాప్ ర్యాంకర్స్ రంకులా రణరంగమా, పద పద పద జయసూర్య బొంపెమ్
జెండాపై కపిరాజు డోంట్ వర్రీ బీ హ్యాపీ జి. వి. ప్రకాష్
త్రిష లేదా నయనతార కంతిరీ పిల్ల జి. వి. ప్రకాష్
2018 సహచరుడు అన్ని పాటలు సై శ్రీనివాస్
దేశంలో దొంగలు పడ్డారు దారి మరి వచ్చారు శాండీ
2019 డేంజర్ లవ్ స్టోరీ చలో చలో భాను ప్రసాద్ జె.
4 ఇడియట్స్ ఆదివారం, ఉంగరాలు జయసూర్య బొంపెమ్
2020 పిజ్జా 2 తగువే తగువే సామ్ సీఎస్
2021 మా ఊరి ప్రేమ కథ జన్మంతా నిను జయసూర్య బొంపెమ్

జై శ్రీనివాస్ కరోనా సోకడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ 21 మే 2021న మరణించాడు.[2][3][4][5]

మూలాలు

మార్చు
  1. Sakshi (9 May 2021). "ప్రాణాపాయ స్థితిలో గాయకుడు జై శ్రీనివాస్‌". Sakshi. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  2. Sakshi (22 May 2021). "ప్రముఖ సింగర్‌ మృతి.. సీఎం కేసీఆర్‌ సంతాపం". Sakshi. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  3. EENADU (22 May 2021). "జై శ్రీనివాస్‌ కన్నుమూత". EENADU. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  4. Andhrajyothy (22 May 2021). "గాయకుడు 'జై' శ్రీనివాస్‌ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  5. The New Indian Express (22 May 2021). "Tollywood singer Jai Srinivas dies of Covid-19". The New Indian Express. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.