ప్రధాన మెనూను తెరువు

జాన్ జోసఫ్ "జాక్ " నికల్సన్ (జననం: 1937 ఏప్రిల్ 22) అమెరికాకు చెందిన నటుడు, చిత్ర దర్శకుడు మరియు నిర్మాత. ఆయన మానసిక దుస్థితి కలిగిన పాత్రలను చిత్రీకరించి వాని చుట్టూ అల్లుకున్న చిత్రాలను తీయటంలో దిట్ట.

జ్యాక్ నికల్సన్
Jack Nicholson.0920.jpg
Nicholson in 2008
జన్మ నామంJohn Joseph Nicholson
జననం (1937-04-22) 1937 ఏప్రిల్ 22 (వయస్సు: 82  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1958–present
భార్య/భర్త Sandra Knight (1962–1968); 1 child

అకాడమీ పురస్కారాలకు నికల్సన్ పన్నెండు సార్లు ప్రతిపాదించబడ్డారు. అయన, వన్ ఫ్లూ ఓవర్ ద కుకూస్ నెస్ట్ మరియు యాస్ గుడ్ యాస్ ఇట్ గెట్స్ అనే చిత్రాలకు ఉత్తమ నటుడుగా అకాడమీ పురస్కారం రెండు సార్లు గెలుచుకున్నారు. 1983 నాటి చిత్రమైన టెర్మ్స్ ఆఫ్ ఎండియర్మేంట్ అనే చిత్రానికి అయన ఉత్తమ సహాయ నటుడుగా అకాడమీ పురస్కారం గెలుచుకున్నారు. అయన ఎక్కువ సార్లు (మూడు) నటనకు పురస్కారాలు అందుకున్న నటుడుగా వాల్టర్ బ్రేన్నన్ కు సరిసమానత్వం పొందారు. మొత్తం నటనా పురస్కారాలలో అయన నాలుగు సార్లు పురస్కరాలూ గెలుచుకొని కాథరిన్ హెప్ బర్న్ తరువాత రెండవ స్థానంలో ఉన్నారు. 1960ల నుండి ప్రతి దశాబ్దంలో నటనలో (ప్రధాన పాత్రలో గాని సహాయ పాత్రలో గాని) అకాడమీ పురస్కారానికి ప్రతిపాదించబడుతూ ఉన్న ఇద్దరిలో నికల్సన్ ఒకరు. మరొకరు మైకేల్ కైన్. అయన ఏడు సార్లు గోల్డన్ గ్లోబ్ పురస్కారం గెలుచుకున్నారు. 2001లో కేనేడి సెంటర్ ఆనర్ కూడా ఆయనకి లభించింది. 1994లో, అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ వారి జీవిత కాల సాధన పురస్కారం గెలుచుకుని అతిచిన్న వయసులోనే ఈ పురస్కారం గెలుచుకున్న వారిలో ఒకరయ్యారు.

అయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు (సంవత్సరాల వారిగా), ఈసీ రైడర్, ఫైవ్ ఈసీ పీసస్, చైనాటౌన్, వన్ ఫ్లూ ఓవర్ ద కుకూస్ నెస్ట్, ది షైనింగ్, రెడ్స్, టెర్మ్స్ అఫ్ ఎన్డియర్మెంట్, బాట్ మాన్, ఎ ఫ్యు గుడ్ మెన్, యాస్ గుడ్ యాస్ ఇట్ గేట్స్, అబౌట్ స్కిమిడ్ట్, సంథింగ్స్ గాట్ట గివ్, యాంగర్ మేనేజ్మెంట్, ద డిపార్తేడ్, మరియు ద బకెట్ లిస్ట్ .

ప్రారంభ జీవితంసవరించు

నికల్సన్, న్యు యార్క్ మహానగరంలో లోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో జూన్ ఫ్రాన్సస్ నికల్సన్ (రంగస్థల పేరు: జూన్ నిల్సన్) అనే ప్రదర్శనలలో వేషాలు వేసే ఒక ఆమెకు జన్మించారు.[1][2] జూన్ ఇటలీకి చెందిన ప్రదర్శనాకారుడైన డోనాల్డ్ ఫర్సిలో (రంగస్థల పేరు: డోనాల్డ్ రోస్) ని ఆరు నెలల క్రిందట 1936న అక్టోబరు 16న మేరిల్యాండ్ లోని ఎల్క్టన్లో వివాహం చేసుకున్నారు.[3] ఎల్క్టన్ "తొందరపాటు" పెళ్లులకు ప్రసిద్ధి చెందిన నగరం. ఫర్సిలో కు అంతకు ముందే పెళ్ళి అయింది. అయన బిడ్డని తాను చూసుకుంటానని చెప్పినా, జూన్ యొక్క తల్లి ఎథెల్ తనే బిడ్డని పెంచుతాని పట్టు పట్టింది. జూన్ తన నృత్య వృత్తిని కొనసాగించవచ్చనేది దీని యొక్క కారణాలలో ఒకటి. డోనాల్డ్ ఫర్సిలో, తానే నికల్సన్ తండ్రి అని పేర్కొని తాను జూన్ ని పెళ్ళి చేసుకోవడంతో రెండు వివాహాలు చేసుకున్నట్లు ఒప్పుకున్నా, పాట్రిక్ మాక్ గిల్లిగన్ అనే జీవితచరిత్ర రచయిత జాక్స్ లైఫ్ అనే పుస్తకములో లాట్వియాలో జన్మించిన ఎడ్డీ కింగ్ {అసలు పేరు: ఎడ్గర్ ఏ. కిర్ష్ ఫెల్డ్}[4] అనే జూన్ యొక్క మేనేజర్, జాక్ తండ్రి కావచ్చని వ్రాశారు. ఎవరు నిజమైన తండ్రి అనే విషయం జూన్ నికల్సన్ కే సరిగ్గా తెలియదు అని ఇతరలు చెపుతారు[1]. నికల్సన్ తల్లి ఐరిష్, ఇంగ్లీష్ మరియు డచ్ వంశావళికి చెందినవారు[5]. అయితే అయన మరియు ఆయన యొక్క కుటుంబం తమని ఐరిష్ గా చెప్పుకున్నారు.[6][7]

నికల్సన్ చిన్నతనంలో అతని తాత, అమ్మమ్మలైన జాన్ జోసఫ్ నికల్సన్ (మనస్క్వాన్, న్యు జెర్సీ లోని ఒక పెద్ద దుకాణంలో పని చేసేవారు) మరియు ఇథెల్ మే రోడ్స్ (మనస్క్వాన్ కు చెందిన ఒక హెర్ డ్రస్సర్, బ్యుటిషియన్ మరియు అపరిపక్వ కళాకారిణి) పెంచారు. వీళ్లే తన నిజమైన తల్లి తండ్రులని నికల్సన్ నమ్మేవారు. నికల్సన్ "తల్లిదండ్రులు" అని తాను భావించినవారు నిజముగా తన తాత అమ్మమ్మలని మరియు తాను అక్క అనుకుంటున్న వ్యక్తే తన తల్లి అని 1974లో టైం పత్రికకు చెందిన ఒక విలేఖరి చెప్పినప్పుడే తెలుసుకున్నారు.[8] అప్పటికి, ఆయన తల్లి మరియు అమ్మమ్మ ఇద్దరూ చనిపోయారు (1963 మరియు 1970 సంవత్సరాలలో వరుసగా). తన తండ్రి ఎవరో తనకు తెలియదని నికల్సన్ చెపుతూ, "ఇథెల్ మరియు జూన్ ఇద్దరికీ మాత్రమే ఆ విషయం తెలుసు కాని వాళ్లు ఎవరికీ చెప్పలేదు"[8] అని చెప్పారు. ఈ విషయం గురించి తరువాత అయన ఏ ప్రయత్నం చేయలేదు. DNA పరీక్ష కూడా చేసుకోలేదు.

నికల్సన్ న్యు జెర్సీ లోని నెప్ట్యూన్ నగరములో పెరిగారు[4]. ఆయన అతని తల్లి యొక్క రోమన్ కాథలిక్ మతానుసారం పెంచబడ్డారు.[5]

అతన్ని పాఠశాల మిత్రులు నిక్ అని పిలిచేవాళ్లు. అతను మనస్క్వాన్ హై స్కూల్లో చదివాడు. ఆ పాఠశాలలో 1954 తరగతి వాళ్లు అతన్ని "తరగతి విదూషకుడు" గా ఎన్నుకున్నారు. అ పాఠశాలలో ఒక నటనావేదిక మరియు ఒక నాటక పురస్కారము ఆయన పేరు మీద పెట్టబడ్డాయి.[9] 2004లో, నికల్సన్ తన అత్త లోరైన్ తో పాటు తన పాఠశాల యొక్క 50 సంవత్సరాల పునస్పంధానం సభకు వెళ్ళారు.[4]

నటనా వృత్తి యొక్క ఆరంభ దశసవరించు

 
ది లిటిల్ షాప్ అఫ్ హారర్స్ లో విల్బర్ ఫోర్స్ లాగ నికల్సన్ (1960)

హాలివుడ్ కు వచ్చిన మొదట్లో, నికల్సన్ యానిమేషన్ రంగంలో నిష్టాతులైన విల్లియం హన్నా మరియు జోసఫ్ బార్బరా లకు ఒక గోఫర్ లాగ MGM కార్టూన్ స్టూడియోలో పనిచేశారు. అతని నటనా ప్రతిభ చూసి వాళ్లు నికల్సన్ కు ఒక ప్రారంభ స్థాయి యానిమేషన్ కళాకారుడుగా ఆవకాశం ఇచ్చారు. అయితే తాను ఒక నటుడు కావాలనే కోరికనను తెలిపి ఆయన ఆ అవకాశాన్ని నిరాకరించారు.[10]

ఆయన తన నటనా జీవితాన్ని 1958లో తక్కువ ఖర్చుతో తీసిన ద క్రై బేబి కిల్లర్ అనే ఒక యువతకు సంబంధించిన నాటకములో ప్రధాన పాత్రలో నటించటంతో ప్రారంభించారు. తరువాత దశాబ్దము అంతటా, నికల్సన్ అ చిత్ర నిర్మాతైన రోజర్ కార్మాన్తో తరచు కలిసి పనిచేశారు. కార్మాన్ అనేక నికల్సన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ద లిట్టేల్ షాప్ అఫ్ హారర్స్లో ఒక షాడో-మసోకిస్టిక్ డెంటల్ రోగి (విల్బర్ ఫోర్స్) పాత్రలో మరియు ద రావెన్, ద టెరర్, ద సెయింట్ వలెన్టైంస్ డే మస్సాకర్ వంటి నికల్సన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అనేక సార్లు దర్శకుడు మోంటే హెల్మన్తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా, రైడ్ ఇన్ ది విర్ల్విండ్, ద షూటింగ్ అనే రెండు తక్కువ ఖర్చుతో తీసిన పాశ్చాత్య చిత్రాలలో నటించారు. ఇవి ఫ్రాన్స్ కళారంగంలో గొప్ప విజయం సాధించినా కూడా, US చిత్ర పంపిణికారులకు ఏ ఆసక్తి కలగచేయలేదు. వీటిని తరువాత టెలివిజన్ కు అమ్మేశారు.

కీర్తికి ఎదుగుటసవరించు

దస్త్రం:EasyRider2.jpg
ఈసీ రైడర్ లో న్యాయవాది జార్జ్ హాన్సన్ లాగ పేటర్ ఫొండతో జాక్ నికల్సన్

తన నటనా జీవితం గొప్ప విజయం సాధించలేకపోవడంతో, నికల్సన్ రచయిత / దర్శకుడి వృత్తులకు వెనుదిరగక తప్పలేదు. 1967 నాటి ద ట్రిప్ (కోర్మాన్ దర్శకత్వం వహించిన) చిత్రానికి LSD-ఆజ్యముగా ఆయన వ్రాసిన స్క్రీన్ ప్లేనే రచయితగా ఆయన యొక్క మొట్ట మొదటి విజయం. ఈ చిత్రంలో పీటర్ ఫోండా మరియు డెన్నిస్ హాప్పర్ నటించారు. ది మొన్కీస్ నటించిన హెడ్ అనే చిత్రాన్ని బాబ్ రాఫెల్సన్తో కలిసి నికల్సన్ వ్రాశారు. అంతే కాక, అ చిత్రానికి సౌండ్ ట్రాక్ కూడా అతనే ఏర్పాటు చేసాడు. అయితే, ఫోండా మరియు హాప్పర్ యొక్క ఈసీ రైడర్లో ఆయనకి దొరికిన నటనా ఆవకాశం, ఆయన నటనా జీసితాన్ని గొప్ప మలుపు తిప్పింది. జార్జ్ హన్సన్ అనే ఎక్కువగా త్రాగే ఒక న్యాయవాది పాత్రలో నికల్సన్ నటించారు. ఈ పాత్రకు ఆయనకు మొదటి ఆస్కార్ ప్రతిపాదన లభించింది. హన్సన్ పాత్ర దొరకడం నికల్సన్ కు ఒక అధ్రుష్టము గల అవకాశం. ఆ పాత్ర అసలు టెర్రీ సథరన్ అనే స్క్రీన్ రచయిత యొక్క మంచి మిత్రుడైన రిప్ టార్న్ అనే నటుడు కొరకు రాయబడింది. అయితే టార్న్ కు, చిత్ర దర్శుకుడు డెనిస్ హాప్పర్ కు మధ్య జరిగిన ఒక గాటు వాదన తరువాత టార్న్ అ చిత్రమునుంది వైతోలిగాడు. అ వాదనలో టార్న్ మరియు హాప్పర్ దాదాపు ఒకరినోక్కరు కొట్టుకునే స్థితికి వచ్చారు.[11]

మరుసటి ఏడాది, ఫైవ్ ఈసీ పీసస్ (1970) అనే చిత్రంలో అతని గొప్ప నటనకు ఆయనకు ఉత్తమ నటుడు ప్రతిపాదన లభించింది. ఆ చిత్రంలో కావాలసినది దొరికిన్చికోవడం గురించి ఆయన చెప్పిన "చికన్ సలాడ్" డయలాగ్ ప్రసిద్ధి చెందింది. అదే సంవత్సరములో ఆన్ అ క్లియర్ డే యు కేన్ సీ ఫార్ఎవర్ యొక్క చిత్ర రూపంలో అయన నటించాడు. అయితే దాంట్లో అతని ప్రదర్శనలో చాల భాగం తీసివేయబడింది.

నికల్సన్ పోషించిన ఇతర పాత్రలు ఏమనుగా కేనస్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్న హాల్ అష్ బై యొక్క ది లాస్ట్ డిటైల్ (1973) మరియు అధ్బుత రోమన్ పోలన్స్కి నోఇర్ థ్రిల్లర్ చైనాటౌన్ (1974). ఈ రెండు చిత్రాలకు గాను ఉత్తమ నటుడుగా అకాడెమీ అవార్డ్ కొరకు నికల్సన్ ప్రతిబాదించబడ్డాడు. దర్శుకుడుతో నికల్సన్ స్నేహంగా ఉండేవాడు. వాళ్ల స్నేహం మన్సన్ ఫ్యామిలీ చేతులలో పోలన్స్కి భార్య షరాన్ టేట్ మరణానికి చాల కాలం ముందునుండే మొదలయింది. పోలన్స్కి భార్య మరణాంతరం అతనికి నికల్సన్ తోడుగా ఉన్నాడు.[12][13] టేట్ మరణానంతరం, నికల్సన్ ఒక సుత్తిని తన దిండు కింద పెట్టుకొని నిద్ర పోయేవాడు.[13] తన పనిని మధ్యలో ఆపి మన్సన్ విచారణ కు హాజరు అయ్యేవాడు.[14] పోలన్స్కి అరెస్ట్ కు కారణమైన హత్యాచారం నికల్సన్ ఇంట్లోనే జరిగింది.[15]

కెన్ రసల్ దర్శకత్వం వహించిన ది హూ యొక్క టామీ (1975) చిత్రంలోనూ, మైకేల్ యాన్జలో యాన్టోనియోని యొక్క ది పాసెంజర్ (1975) లోను అతను నటించారు.

ఒక అమెరికన్ ఐకాన్సవరించు

 
1990 మార్చి 26 నాడు 62వ అకాడెమి అవార్డ్స్ లో నికల్సన్ (కుడి వైపు) మరియు డెన్నిస్ హాప్పర్

1975లో మిలోస్ ఫోర్మన్ దర్శకత్వం వహించిన కెన్ కేస్సి నవల యొక్క చిత్ర రూపమైన ఓన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్ చిత్రంలో రాన్దేల్ పి. మాక్ మార్ఫి పాత్ర పోషించినదానికి గాను నికల్సన్ తన మొట్ట మొదటి ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డ్ ని గెలుచుకున్నారు. అతనితో పాటు నర్స్ రాట్చేడ్ పాత్ర కోసం లూయి ఫ్లేట్చర్ ఆస్కార్ ఉత్తమ నటి అవార్డ్ గెలుచుకుంది.

ఆ తరువాత, ఆయన ఇంకా ఎక్కువ అసాధారణమైన పాత్రలు పోషించడం ప్రారంభించారు. అతను ది లాస్ట్ టైకూన్ చిత్రంలో రాబర్ట్ డి నిరో కు జంటగా ఒక చిన్న పాత్ర పోషించాడు. ఆర్థర్ పెన్ యొక్క ప్రాశ్చాత్య ది మిస్సౌరీ బ్రేక్స్ అనే చిత్రంలో, కేవలం మార్లన్ బ్రాండోతో కలిసి నటించడానికోసం, ఒక తక్కువ సానుభూతి కలిగిన పాత్రలో నటించారు. దీని తరువాత, అయిన దర్శకత్వం వహించిన రెండవ చిత్రమైన ప్రాశ్చాత్య కామిడి అయిన గోయిన్ సౌత్ విడుదలయింది. దర్శకుడుగా అతని మొదటి చిత్రం 1971లో విడుదలైన డ్రైవ్, హి సెడ్ .

స్టాన్లీ కుబ్రిక్ తీసిన స్టీఫన్ కింగ్ యొక్క ది షైనింగ్ (1980) చిత్రానికి ఆయనికి అకాడెమీ అవార్డ్ లభించనప్పటికి, ఇది నికల్సన్ వేసిన అతి ముఖ్యమైన పాత్రలలో ఒకటి. అతని మరుసటి ఆస్కార్ పురస్కారం, జేమ్స్ ఎల్. బ్రూక్స్ దర్శకత్వం వహించిన టెర్మ్స్ అఫ్ ఎన్డియర్మెంట్ చిత్రంలో పదవీ విరమణ చేసిన ఒక ఆస్ట్రోనాట్ బ్రీడ్లవ్ పాత్రకు లభించిన ఉత్తమ సహాయ నటుడుగా అకాడెమీ అవార్డ్. 80లలో నికల్సన్ అనేక చిత్రాలలో నటించాడు. వాటిలో కొన్ని ది పోస్ట్మాన్ ఆల్వేస్ రింగ్స్ ట్వైస్ (1981), రెడ్స్ (1981), ప్రిజ్జిస్ ఆనర్ (1985), ది విచస్ అఫ్ ఈస్ట్విక (1987), బ్రాడ్కాస్ట్ న్యూస్ (1987) మరియు ఆయన్వీడ్ (1987). రెడ్స్, ప్రిజ్జిస్ ఆనర్ మరియు ఆయన్వీడ్ చిత్రాలకు ఆయనకు ఆస్కార్ ప్రతిపాదనలు లభించాయి.

విట్నస్ చిత్రంలో జాన్ బుక్ పాత్రని నికల్సన్ నిరాకరించారు.[16] 1989 నాటి బాట్ మాన్ చిత్రంలో నికల్సన్ పోషించిన ది జోకేర్ అనే ఒక పైశాచిక విలన్ మరియు హంతకుడు పాత్ర ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయం సాధించింది. నికల్సన్ లాభకరమైన ఒక ఒడంబడిక ద్వారా $60 మిలియను సంపాదించారు.

ఎ ఫ్యు గుడ్ మెన్ (1992) చిత్రంలో కోపోద్రేక కర్నల్. నాథన్ ఆర్. జేసేప్ పాత్రకు గాను నికల్సన్ కు మరొక అకాడెమీ ప్రతిబాధన లభించింది. ఈ చిత్రం U.S. మెరైన్ కార్ప్స్లో జరిగే ఒక హత్య గురించిన కథ. ఈ చిత్రంలో ఉన్న ఒక న్యాయస్థాన సన్నివేశంలో, నికల్సన్ "మీరు నిజాన్ని ఎదురుకోలేరు" అని గట్టిగా అరిచే డయలాగ్ ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోన్ సోర్కిన్ వ్రాసిన ఒక సోలిలోకి. ఇది తరువాత చాల ప్రసిద్ధి చెందింది.

1996లో నికల్సన్ బాట్ మాన్ దర్శకుడైన టీం బర్టన్తో మల్లి జత కలిసి మార్స్ అట్టాక్స్!లో నటించారు. దీంట్లో రెండు విభిన్నమైన పాత్రలలో, ప్రెసిడెంట్ జేమ్స్ డెల్ మరియు లాస్ వేగాస్ ఆస్తుల వ్యాపారి ఆర్ట్ లాండ్ గాను నటించారు. మొదట్లో నికల్సన్ యొక్క ఒక పాత్రని చంపేయడాన్ని వార్నర్ బ్రోస్. స్టూడియో అధికారులకు నచ్చలేదు. అందువల్ల, బర్టన్ రెండు పాత్రని సృష్టించి రెండిటిని చంపేశారు.

నికల్సన్ వేసిన అన్ని పాత్రలు ప్రశంసలని అందుకోలేదు. మాన్ ట్రబెల్ (1992) మరియు హోఫ్ఫా (1992) చిత్రాల్లో ఆటను వేసిన పాత్రకు ఆయనకు రాజీ అవార్డ్స్ చెత్త నటుడుగా ప్రతిపాదించబడ్డారు. అయితే, హోఫ్ఫాలో నికల్సన్ వేసిన పాత్రకు గోల్డన్ గ్లోబ్ ప్రతిపాదన లభించింది.

తరువాత, జేమ్స్ ఎల్. బ్రూక్స్ దర్శకత్వం వహించిన ప్రేమగాథ అయిన యాస్ గుడ్ యాస్ ఇట్ గేట్స్ (1997) చిత్రంలో ఓబ్సేస్సివ్ కంపల్సివ్ డిసార్డర్తో బాధపడుతున్న న్యురోటిక్ రచయిత, మెల్విన్ ఉడాల్ అనే పాత్రకు నికల్సన్ తన మరుసటి ఉత్తమ నటుడుకు గాను అకాడెమీ అవార్డ్ గెలుచుకున్నారు. నికల్సన్ గెలుచుకున్న ఆస్కార్ తో పాటు మాన్ హట్టన్ వెయిట్రేస్ పాత్ర పోషించిన హెలెన్ హంట్ కు ఉత్తమ నటిగా అకాడెమి అవార్డు లభించింది. ఈ చిత్రంలో హెలెన్ హంట్ ఆమె పనిచేస్తున్న రెస్టారంట్ కు తరచు వస్తున్న ఉడాల్ తో ప్రేమ/ద్వేషం స్నేహం చూపిస్తున్న పాత్రలో నటించారు.

2001లో మాస్కో అంతర్జాతీయ చిత్రోత్సవంలో స్టానిస్లావ్స్కి అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి నటుడుగా నికల్సన్ నిలిచారు. ఈ పురస్కారం "నటనలో మరియు విశ్వాసనీయతలో ఉత్తమ సిఖరాలని చేరినందుకు" ఇవ్వబడింది.

నికల్సన్ ఒక తీవ్రమైన క్రీడా అభిమాని. స్టేపేల్స్ సెంటర్, గ్రేట్ వెస్ట్రన్ ఫోరం లలో జరిగే లాస్ అన్జేలేస్ లేకేర్స్ బాస్కెట్బాల్ ఆటలలో కోర్ట్ పక్కన సీట్ లలో క్రమం తప్పకుండ కనిపించేవాడు. 1999లో పార్కిన్సన్ అనే ఒక UK టీవీ చాట్ కార్యక్రమంలో ఆయన హాజరయి, తనని "జీవితకాల మాంచెస్టర్ యునైటడ్ అభిమాని" గా చెప్పుకున్నారు.

ఇటీవలి సంవత్సరాలుసవరించు

అబౌట్ స్కిమిడ్ట్ (2002) లో నికల్సన్, తన భార్య మరణం తరువాత తన సొంత జీవితాన్నే ప్రశ్నించే ఒక పదవీ విరమణ చేసిన ఒమహ నెబ్రాస్కా యాక్చువరి పాత్రలో నటించారు. అ చిత్రంలో ప్రశాంతత, నిగ్రహంతో కూడిన అతని ప్రదర్శన, అంతకు ముందు చిత్రాలలో అనేక పాత్రలలో అతని ప్రదర్శనకు చాల విభేదంగా ఉండి, అతనికి ఉత్తమ నటుడుగా అకాడెమి అవార్డ్ ప్రతిపాదన లభించింది. యాన్గర్ మానేజ్మెంట్ అనే కామెడి చిత్రంలో అతను అతిగా శాంతస్వరూపి అయిన ఆడం సండ్లర్ అనే వ్యక్తికి సహాయం చేసే ఒక ఉగ్రమైన తెరపిస్ట్ పాత్రా పోషించారు. 2003లో సంథింగ్స్ గొట్ట గివ్ అనే చిత్రంలో ఒక వయసవుతున్న ప్లేబాయ్ పాత్రలో నికల్సన్ నటించారు. ఇది తన యౌవన స్నేహితురాలి యొక్క తల్లి అయిన డయాన్ కీటన్తో ప్రేమలో పడుతున్న పాత్ర. 2006 చివరిలో నికల్సన్ ఫ్రాంక్ కాస్టెల్లో అనే మాట్ డమోన్ అధ్యక్షుడైన ఒక పైశాచిక బాస్టన్ ఐరిష్ మాబ్ నేత పాత్ర పోషించి మల్లి "చీకటి ప్రపంచం" లోకి అడుగు పెట్టారు. అలాగే మార్టిన్ స్కోర్సేస్ యొక్క ఆస్కార్ విజేత ది డిపార్టడ్ చిత్రంలో లియోనార్డో డికాప్రియో పాత్ర పోషించారు. ఈ చిత్రం అండ్రూ లా యొక్క ఇంఫెర్నల్ అఫెర్స్ చిత్రం యొక్క పునర్నిర్మాణం.

నవంబరు 2006లో నికల్సన్ తన మరుసటి చిత్రమైన రాబ్ రేఇనర్ యొక్క ది బకట్ లిస్ట్ అనే చిత్రంలో నటించడం ప్రారంభించారు. ఈ చిత్రానికి తను తల గుండు చేసుకున్నాడు. ఈ చిత్రంలో నికల్సన్ మరియు మార్గన్ ఫ్రీమాన్, తమ ఆశయాలని పూర్తి చేసుకునే మరణిస్తున్న వ్యక్తులుగా నటించారు. ఈ చిత్రం డిసంబర్ 25, 2007 నాడు పరిమితంగానూ, 2008 జనవరి 11 నాడు పూర్తి స్థాయిలోనూ విడుదల అయింది. ఈ చిత్రంలో నటించడానికి, తన పాత్ర గురించిన పరిశోధనలో భాగంగా, నికల్సన్ ఒక లాస్ అన్జేలేస్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నవాళ్లు ఏ విధంగా తమ జబ్బుని ఎదుర్కొంటున్నారో స్వయంగా చూశాడు.

వ్యక్తిగత జీవితంసవరించు

అయనకు మిషెల్ ఫిలిప్స్, బెబ్ బ్యుల్, లారా ఫ్లిన్ బాయిల్ వంటి అనేక నటీమణులు, మాడల్ లతో ప్రేమ సంబంధం ఉందని చెప్పుకోబడుతుంది. నికల్సన్ కు అత్యధిక కాలమైన 16 సంవత్సరాలుగా, 1973 నుండి 1989 వరకు, జాన్ హాస్టన్ అనే చిత్ర దర్శకుడు కూతురైన అన్జేలికా హాస్టన్ అనే నటితో సంబంధం ఉండేది. అయితే, రెబెక్కా బ్రౌస్సార్డ్ ఆయన వల్ల గర్భవతి అయిందని మీడియాలో రావడంతో, ఈ సంభంధం ముగిసింది. నికల్సన్, బ్రౌస్సార్డ్ కు లోరైన్ నికల్సన్ (1990లో జననం), రేమాండ్ నికల్సన్ (1992లో జననం) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జేనిఫర్ నికల్సన్ (సాంద్ర నైట్ కు 1963లో జననం), హాని హాల్మాన్ (విన్నీ హాల్మాన్ కు 1981లో జననం) జాక్ యొక్క ఇతర పిల్లలు. సూసన్ అన్స్పాక్ అనే నటి తన కొడుకు కాలేబ్ గొడ్దార్డ్ (1970లో జననం) నికల్సన్ కే పుట్టాడు అని ఆరోపించింది కాని జాక్ ఈ విషయాన్ని బహిరంగంగా ఎప్పుడు ఆమోదించలేదు.[17]

అనేక సంవత్సరాలు నికల్సన్ బెవెర్లి హిల్స్ లోని ముల్హోల్లాండ్ డ్రైవ్లో మార్లన్ బ్రాండో ఇంటికి పక్క ఇంట్లోనే నివసించేవాడు. వారన్ బీటి కూడా పక్కనే నివసించేవారు. అందువల్ల ఈ వీధికి "బ్యాడ్ బాయ్ డ్రైవ్" అని పేరు వచ్చింది. బ్రాండో 2004లో మరణించిన తరువాత, నికల్సన్ అతని ఇంటిని $6.1 మిలియను కు, అ భవనాన్ని పడగొట్టే ఉద్దేశంతో కొన్నాడు. బ్రాండో యొక్క గౌవరవాన్ని కాపాడడానికే ఆ విధంగా చేసానని నికల్సన్ చెప్పాడు. ఎందుకంటే, అ చెడులు పట్టిన "పాడు" భవనాన్ని బాగు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు.[18]

నికల్సన్ న్యు యార్క్ యాన్కీస్ మరియు లాస్ అన్జేలేస్ లేకర్స్ యొక్క అభిమాని. అతను లేకర్స్ ఆటలకు తప్పనిసరిగా హాజర్ అయ్యే విషయాన్ని ఒక కథగా చెప్పేవాళ్లు. 1970 నుండి అయిన సీసన్ టికట్ పెట్టుకొని 25 సంవత్సరాలుగా ది ఫోరం మరియు స్టేపేల్స్ సెంటర్ లలో క్రమం తప్పకుండ అతి తక్కువ ఆటలు తప్ప అన్ని ఆటలకు హాజరయ్యేవాడు. కొన్ని సందర్పాలలో నికల్సన్ ఆట అధికారులతోను ప్రధ్యర్ది ఆటగాళ్లతోను వాగ్వివాదానికి దిగి, కోర్ట్ లోపలకు కూడా వెళ్లేవాడు.[19] ఒక లేకర్స్ ఆటని కూడా చూడకుండా వదిలిపెట్టను అనే అతని తీవ్ర అభిమానం వల్ల, స్టూడియోలు లేకర్స్ వాళ్ల ఆటల జరిగే రోజులని బట్టి తమ చిత్ర నిర్మాణాన్ని పెట్టుకోవలసి వచ్చేది.[19][20]

20వ శాతాబ్దానికి చెందిన కళా మరియు ప్రస్తుత కాలానికు చెందిన కళను సేకరించేవాడు. స్కాట్లాండ్ కు చెందిన జాక్ వేట్రియానో కళని కూడా సేకరించేవారు.[21]

తన రాజకీయ అభిప్రాయాల గురించి అతను ఎప్పుడు బహిరంగంగా చెప్పకపోయినా, నికల్సన్ తనను జీవితాంతం ఒక డెమొక్రాట్ గానే అనుకునేవాడు.[22] ఫెబ్రవరి 4, 2008 నాడు ఆయన యునైటడ్ స్టేట్స్ అధ్యక్షుడు ఎన్నికకు సేనటర్ హిల్లరి క్లింటన్ కు తన మద్దతు ప్రకటించారు.[23] రిక్ డీస్ యొక్క రేడియో కార్యక్రమంలో ఒక బెటిలో నికల్సన్ ఈ విధంగా చెప్పారు "Mrs.క్లింటన్ ఆరోగ్య రక్షణ, జైలు సంస్కరణలు, సైన్యానికి సహాయం, స్త్రీలకు ఆదరణ మరియు అమెరికన్లకు ఆదరణ వంటి అంశాల మీద శ్రద్ధ చూపుతుంది. మరియు మనకు మంచి టష్ ఉన్న అధ్యక్షుడు రావలసిన సమయం వచ్చింది."

కలిఫోర్నియా మ్యుసియం అఫ్ హిస్టరీ, విమన్ అండ్ ది ఆర్ట్స్ లోని కలిఫోర్నియా హాల్ అఫ్ ఫెమ్లో నికల్సన్ చేర్చబడుతాడు అని 2008 మే 28 నాడు కాలిఫోర్నియా గవర్నరైన ఆర్నాల్డ్ ష్వాష్నేగర్ మరియు ఫర్సట్ లేడి మేరియ ష్రివార్ ప్రకటించారు. ఈ కార్యక్రమం 2008 డిసెంబరు 15 నాడు ఇతర 11 గొప్ప కాలిఫోర్నియా ప్రజలతో పాటు నికల్సన్ కూడా చేర్చుకోబడ్డారు.

అకాడెమీ అవార్డ్ ల చరిత్రసవరించు

 
గ్రామన్స్ చైనీస్ థియేటర్ లో జాక్ నికల్సన్ యొక్క పాదముద్రలు మరియు చేతి ముద్రలు.

మొత్తం 12 ప్రతిపాదనలతో (ఉత్తమ నటుడుగా 8 సార్లు మరియు ఉత్తమ సహాయ నటుడుగా 4 సార్లు), అకాడెమీ అవార్డ్ ల చరిత్ర లోనే అత్యధికంగా ప్రతిపాదించబడిన నటుడు జాక్ నికల్సన్. నికల్సన్ మరియు మైకిల్ కైన్ మాత్రమే ఐదు వివిధ దశాబ్దాలలో (1960లు, 1970లు, 1980లు, 1990లు మరియు 2000లు) నటన (ప్రధాన పాత్ర లేదా సహాయ పాత్ర) కోసం ప్రతిపాదించబడిన నటులు.[ఉల్లేఖన అవసరం] మూడు ఆస్కార్ విజయాలతో ఆయన నటనా విభాగంలో రెండవ అత్యధిక ఆస్కార్ విజయాలకు గానూ వాల్టర్ బ్రెన్నన్తో సరిసమానుడయ్యాడు (బ్రెన్నాన్ యొక్క విజయాలన్నీ ఉత్తమ సహాయ నటుడిగా వచ్చినవే).

79వ అకాడమీ అవార్డులలో నికొల్సన్ ద బకెట్ లిస్ట్లో తన పాత్ర కొరకు జుట్టును పూర్తిగా తీసివేశాడు. ఈ కార్యక్రమములలో ఆయనకు ఏడవ సారిగా ఉత్తమ చిత్రానికి ఇచ్చే అకాడెమీ అవార్డు (1972, 1977, 1978, 1990, 1993, 2006 మరియు 2007) బహుకరించబడింది.[24]

నికల్సన్ అకాడమీలోని ఒక క్రియాశీల పాత్ర పోషించే మరియు వోటు వేసే అర్హత కలిగిన సభ్యుడు. అతను గత ధశాబ్ధములో దాదాపుగా ప్రతి కార్యక్రమమునకు, తన పేరు ప్రతిపాదించినా లేకున్నా, హాజరు అయ్యారు.

ఫిల్మోగ్రఫీసవరించు

1994 2002 2006 ది డిపార్టెడ్ 2007
సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు
1958 ది క్రై బేబి కిల్లర్ జిమ్మీ వాలస్
1960 టూ సూన్ టు లవ్ బడ్డి
ది వైల్డ్ రైడ్ జాని వారన్
ది లిటిల్ షాప్ అఫ్ హారర్స్ విల్బర్ ఫోర్స్
స్టుడ్స్ లోనిగన్ వేరి రైలీ
1962 ది బ్రోకన్ లాండ్ విల్ బ్రోశియస్
1963 ది టెరర్ అండ్రే డువాలేర్ దర్శకుడు కూడా
ది రావెన్ రెక్స్ఫోర్డ్ బెడ్లో
1964 ఫ్లైట్ టు ఫ్యురి జే వికాం
ఎన్సైన్ పల్వర్ డోలన్
బెక్ డోర్ టు హెల్ బర్నేట్
1965 రైడ్ ఇన్ ది వేర్ల్విండ్ వేస్
1966 ది షూటిన్గ్ బిల్లి స్పియర్
1967 ది సెయింట్ వేలేన్టైన్స్ డే మస్సాకర్ గినో, హిట్ మాన్ అనామక
హీల్స్ అన్జేల్స్ ఆన్ వీల్స్ పోయట్
1968 సైక్-అవుట్ స్టోనీ
1968

<head>

హిమ్‌సెల్ఫ్
1969 ఈసీ రైడర్ జార్జ్ హన్సన్

ఉత్తమ సహాయ నటిగా కాన్సాస్ సిటీ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ పురస్కారం
ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం
ఉత్తమ సహాయ నటుడుగా న్యు యార్క్ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం
ప్రతిపాదన — ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డు
| ప్రతిపాదన – సహాయ పాత్రలో ఉత్తమ నటుడికి BAFTA అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలన చిత్రం

1970 ఆన్ ఎ క్లియర్ డే యు కెన్ సీ ఫార్ఎవర్ టాడ్ ప్రిన్గెల్
ది రెబెల్ రౌసర్స్ బన్నీ
ఫైవ్ ఈసీ పీసస్ రాబర్ట్ ఎరోయిక డుపీ ప్రతిపాదన – ఉత్తమ నటుడికి అకాడమీ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటుడుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటిక
1971 కార్నల్ నాలడ్జ్ జోనాథన్ ఫుర్స్ట్

ప్రతిపాదన – ఉత్తమ నటుడుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం

ఎ సేఫ్ ప్లేస్ మిట్చ్
డ్రైవ్, హి సేడ్

దర్శుకుడు
ప్రతిపాదన - పాల్మే డి ఓర

1972 ది కింగ్ అఫ్ మార్విన్ గార్డెన్స్ డేవిడ్ స్టేబ్లేర్
1973 ది లాస్ట్ డిటైల్ బిల్లీ "బాడ్ యాస్" బుడ్డుస్కి ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు గా BAFTA అవార్డు చైనా టౌన్ కు కూడా


కేనస్ చిత్రోత్సవం ఉత్తమ నటుడు
ఉత్తమ సహాయ నటుడుగా దేశీయ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం చైనా టౌన్ కు కూడా
ఉత్తమ సహాయ నటుడుగా న్యు యార్క్ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం చైనా టౌన్ కు కూడా
| ప్రతిపాదన – ఉత్తమ నటుడికి అకాడమీ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటుడుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటిక

1974 చైనా టౌన్ జే.జే. 'జెక్' గిట్టస్ ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు గా BAFTA అవార్డు ది లాస్ట్ డిటైల్ కు కూడా


ఉత్తమ నటుడుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ – చలన చిత్ర రూపకం
ఉత్తమ విదేశీ చలనచిత్ర ప్రదర్షుకుడు కు గాను ఫోటోగ్రమస్ డి ప్లాటా అవార్డు
ఉత్తమ సహాయ నటుడుగా కన్సాస్ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం
ఉత్తమ సహాయ నటుడుగా దేశీయ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం ది లాస్ట్ డిటైల్ కు కూడా
ఉత్తమ సహాయ నటుడుగా న్యు యార్క్ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం ది లాస్ట్ డిటైల్ కు కూడా
| ప్రతిపాదన – ఉత్తమ నటుడికి అకాడమీ అవార్డు

1975 ది ఫార్చూన్ ఆస్కార్ సల్లివన్ (ఆస్కార్ డిక్స్ అని కూడా పిలవబడుతాడు)
ఒనె ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్ రాన్డేల్ పాట్రిక్ మాక్ మార్ఫి

ఉత్తమ నటుడికి అకాడమీ పురస్కారం
ప్రధాన పాత్రలో నటించిన ఉత్తమ నటుడుగా BAFTA అవార్డు
ఉత్తమ నటుడుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ – చలన చిత్ర రూపకం
ఉత్తమ నటుడు కు గాను నేషనల్ బోర్డ్ అఫ్ రివియు అవార్డ్
ఉత్తమ సహాయ నటుడు గా జాతీయ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం
ఉత్తమ నటుడుగా న్యు యార్క్ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం
ఉత్తమ విదేశీ నటుడు గా సంట్ జోర్డి అవార్డు

ది పాసెంజర్ డేవిడ్ లాక్
టామి

ది స్పెషలిస్ట్

1976 ది మిసౌరి బ్రేక్స్ టాం లోగాన్
ది లాస్ట్ టైకూన్ బ్రిమ్మర్
1978 గోయిన్ సౌత్ హెన్రీ లాయిడ్ మూన్ దర్శుకుడు కూడా
1980 ది షైనింగ్ జాక్ టోరన్స్
1981 ది పోస్ట్ మాన్ ఆల్వేస్ రింగ్స్ ట్వైస్ ఫ్రాంక్ చంబెర్స్
రాగ్ టైం పైరేట్ అట్ బీచ్ అనామిక
రెడ్స్ ఈగన్ ఓ'నీల్ ప్రతిపాదన – సహాయ పాత్రలో ఉత్తమ నటుడికి BAFTA అవార్డు
ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ చిత్ర విమర్శకుల అవార్డ్
ఉత్తమ సహాయ నటిగా కాన్సాస్ సిటీ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ పురస్కారం
ఉత్తమ సహాయ నటుడు కు గాను నేషనల్ బోర్డ్ అఫ్ రివియు అవార్డ్
ఉత్తమ సహాయ నటుడు కు గాను న్యు యార్క్ ఫిలిం క్రిటిక్స్ సిర్కిల్ అవార్డ్
ప్రతిపాదన — ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలన చిత్రం
1982 ది బార్డర్ చార్లీ స్మిత్
1983 టెర్మ్స్ అఫ్ ఎన్డియర్మెంట్ గారేట్ బ్రీడ్లవీ ఉత్తమ సహాయ నటుడు గా అకాడమీ అవార్డ్
ఉత్తమ సహాయ నటుడుగా బాస్టన్ చిత్ర విమర్శకుల సంస్థ అవార్డ్
ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలన చిత్రం
ఉత్తమ సహాయ నటుడుగా కన్సాస్ సిటీ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ పురస్కారం
ఉత్తమ సహాయ నటుడుగా లాస్ అన్జేలేస్ ఫిలిం క్రిటిక్స్ సంఘం పురస్కారం
ఉత్తమ సహాయ నటుడు కు గాను నేషనల్ బోర్డ్ అఫ్ రివియు అవార్డ్
ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ చిత్ర విమర్శకుల అవార్డ్
1984 టెర్రర్ ఇన్ ది ఎఇల్స్ పాత చిత్రాలు
1985 ప్రిజ్జీస్ ఆనర్ చార్లీ పర్టాన ఉత్తమ నటుడుగా బాస్టన్ చిత్ర విమర్శకుల సంస్థ అవార్డ్
ఉత్తమ నటుడు గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
ఉత్తమ నటుడు గా న్యు యార్క్ చిత్ర విమర్శకుల సిర్కిల్ అవార్డ్
ఉత్తమ నటుడుగా జాతీయ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం
| ప్రతిపాదన – ఉత్తమ నటుడికి అకాడమీ అవార్డు
1986 హార్ట్ బర్న్ మార్క్ ఫోర్మాన్
1987 ది విట్చస్ అఫ్ ఈస్ట్విక్ డారైల్ వాన్ హార్న్ ఉత్తమ నటుడుగా లాస్ అన్జేలేస్ ఫిలిం క్రిటిక్స్ సంఘం పురస్కారం ఆయర్న్ వీడ్ కు కూడా
|ఉత్తమ నటుడుగా న్యు యార్క్ ఫిలిం క్రిటిక్స్ సంఘం పురస్కారం ఆయర్న్ వీడ్ మరియు బ్రాడ్కాస్ట్ న్యూస్ కు కూడా
బ్రాడ్కాస్ట్ న్యూస్ బిల్ రోరిచ్ ఉత్తమ నటుడుగా న్యు యార్క్ ఫిలిం క్రిటిక్స్ సంఘం పురస్కారం ఆయర్న్ వీడ్ మరియు ది విట్చస్ అఫ్ ఈస్ట్విక్ కు కూడా
ఆయర్న్వీడ్ ఫ్రాన్సిస్ ఫేలన్

ఉత్తమ నటుడుగా లాస్ అన్జేలేస్ ఫిలిం క్రిటిక్స్ సంఘం పురస్కారం ది విట్చస్ అఫ్ ఈస్ట్విక్ కు కూడా
ఉత్తమ నటుడుగా లాస్ అన్జేలేస్ ఫిలిం క్రిటిక్స్ సంఘం పురస్కారం బ్రాడ్ కాస్త న్యూస్ మరియు ది విట్చస్ అఫ్ ఈస్ట్విక్ కు కూడా
| ప్రతిపాదన – ఉత్తమ నటుడుగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటుడుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం

1989 బాట్మాన్ జాక్ నపియర్ / ది జోకర్ ప్రతిపాదన – సహాయ పాత్రలో ఉత్తమ నటుడికి BAFTA అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
1990 ది టూ జాక్స్ జే.జే. 'జెక్' గిట్టేస్ దర్శకుడు కూడా
1992 మాన్ ట్రబెల్ ఈగన్ ఎర్ల్ ఆక్స్ లైన్ (హారి బ్లిస్ అని కూడా పిలవడుతారు)
ఎ ఫ్యు గుడ్ మెన్ కాల్. నాథన్ ఆర్. జేస్సేప్

ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడుగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ సహాయ నటుడు కు గాను నేషనల్ బోర్డ్ అఫ్ రివియు అవార్డ్
ఉత్తమ సహాయ నటుడు గా సౌత్ ఈస్టర్న్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్
ప్రతిపాదన — ఉత్తమ సహాయ నటుడుగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలన చిత్రం
| ప్రతిపాదన – పురుషుల పాత్రలో ఉత్తమ ప్రదర్శనకు MTV మూవీ అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ విల్లన్ గా MTV మూవీ పురస్కారం

హోఫ్ఫా జేమ్స్ ఆర్. 'జిమ్మి' హోఫ్ఫా

ప్రతిపాదన – ఉత్తమ నటుడుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం

వోల్ఫ్ విల్ రండాల్
1995 ది క్రాసింగ్ గార్డ్ ఫ్రెడ్డి గేల్
1996 బ్లడ్ అండ్ వైన్ అలెక్స్ గేట్స్
ది ఈవినింగ్ స్టార్ గారేట్ బ్రీడ్లవ్
మార్స్ అట్టాక్స్! ప్రెసిడెంట్ జేమ్స్ డెల్ / ఆర్ట్ ల్యాండ్

ప్రతిపాదన — ఉత్తమ నటుడుగా శాటిలైట్ అవార్డు - సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం

1997 యాస్ గుడ్ యాస్ ఇట్ గెట్స్ మెల్విన్ ఉడాల్

ఉత్తమ నటుడికి అకాడమీ పురస్కారం
చలనచిత్రంలో ఉత్తమ హాస్యరసపూరిత నటుడుగా అమెరికన్ కామిడి అవార్డ్
ఉత్తమ నటుడుగా బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
ఉత్తమ నటుడుగా లండన్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్
ఉత్తమ నటుడు గా నేషనల్ బోర్డ్ అఫ్ రివియు అవార్డ్
ఉత్తమ నటుడుగా ఆన్ లైన్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ పురస్కారం
ఉత్తమ నటుడుగా శాటిలైట్ అవార్డు - సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
ప్రధాన పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరచిన నటుడుగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు

1999 గోల్డెన్ గ్లోబ్ వారి సెసిల్ బి. డి మిల్లె అవార్డు
2001 ది ప్లేడ్జ్ జెర్రీ బ్లాక్
అబౌట్ స్కిమిడ్ట్ వార్రెన్ ఆర్. స్కిమిడ్ట్

ఉత్తమ నటుడుగా బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (గాంగ్స్ అఫ్ న్యు యార్క్లో డేనియల్ డే-లూయిస్తో పంచుకున్నారు)
ఉత్తమ నటుడుగా డల్లాస్-ఫోర్ట్ వొర్థ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటుడుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ – చలన చిత్ర రూపకం
ఉత్తమ నటుడుగా లాస్ అన్జేలేస్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (గాంగ్స్ అఫ్ న్యు యార్క్లో డేనియల్ డే-లూయిస్తో పంచుకున్నారు)
ఉత్తమ నటుడుగా వాషింగ్టన్ డి.సి. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
| ప్రతిపాదన – ఉత్తమ నటుడికి అకాడమీ అవార్డు
ప్రతిపాదన — ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడుగా BAFTA అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ నటుడుగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ నటుడుగా లండన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ నటుడుగా ఆన్ లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటి అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నూతన నటుడుగా ఫోనిక్స్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్
ప్రతిపాదన — ఉత్తమ నటుడుగా శాటిలైట్ అవార్డు - చలన చిత్ర నాటకం
ప్రతిపాదన – ప్రధాన పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన పురుష నటుడికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు

2003 యాంగర్ మానేజ్మెంట్ డా. బడ్డి రైడెల్
సంథింగ్స్ గొట్ట గివ్ హారి సంబోర్న్

ప్రతిపాదన — ఉత్తమ నటుడుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం

ఫ్రాన్సిస్ 'ఫ్రాంక్' కోస్టేలో ఉత్తమ సహాయ నటుడుగా ఆస్టిన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ సహాయ నటుడుగా ఫ్లోరిడా ఫిల్మ్ క్రిటిక్స్ సిర్కిల్ అవార్డు
ఉత్తమ విల్లన్ గా MTV మూవీ అవార్డ్
ఉత్తమ నట బృందాని కి గాను నేషనల్ బోర్డ్ అఫ్ రేవియు అవార్డ్
ఉత్తమ సహాయ నటిగా ఫీనిక్స్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్
|ప్రతిపాదన – సహాయ పాత్రలో ఉత్తమ నటుడికి BAFTA అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడుగా బ్రాడ్కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడుగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలన చిత్రం
ప్రతిపాదన — ఉత్తమ సహాయ నటుడుగా ఆన్లైన్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్
ప్రతిపాదన - తెరలో ఉత్తమ మ్యాచ్-అప్ కొరకు పీపెల్స్ చాయిస్ అవార్డు మాట్ డమోన్ మరియు లియోనార్డో డికాప్రియోతో కలిసి
| ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడుగా శాటిలైట్ అవార్డు - చలన చిత్రం
ప్రతిపాదన — చలన చిత్రంలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
ది బకట్ లిస్ట్ ఎడ్వర్డ్ కోల్

సూచనలుసవరించు

 1. 1.0 1.1 Marx, Arthur (1995). "On His Own Terms". Cigar Aficionado. Cite web requires |website= (help)
 2. Douglas, Edward (2004). Jack: The Great Seducer — The Life and Many Loves of Jack Nicholson. New York: Harper Collins. p. 14. ISBN 0060520477.
 3. బెర్లినేర్, ఈవ్. జూన్ నిల్సన్, డోనాల్డ్ ఫార్సిలో యొక్క వివాహా సర్టిఫికేట్. యంగ్ జాక్ నికల్సన్: ఆస్పిశియాస్ బెగినింగ్స్ . Evesmag.com. 2001.
 4. 4.0 4.1 4.2 McDougal, Dennis (2007). Five Easy Decades: How Jack Nicholson Became the Biggest Movie Star in Modern Times. Wiley. pp. 8, 278. ISBN 0-471-72246-4. Unknown parameter |month= ignored (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "bookbio1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 5. 5.0 5.1 "The Religious Affiliation of Jack Nicholson". Adherents.com. 2009-08-23. Cite web requires |website= (help)
 6. "'I Wasn't Inhibited by Anything'". Parade Magazine. 2007-12-04. Retrieved 2007-02-16. Cite web requires |website= (help)
 7. Ebert, Roger (1983-11-27). "Interview with Jack Nicholson". Chicago Sun-Times. Retrieved 2007-02-16. Cite web requires |website= (help)
 8. 8.0 8.1 కాలిన్స్, నాన్సీ. ది గ్రేట్ సేడుసర్: జాక్ నికల్సన్ . రొల్లింగ్ స్టన్ పత్రిక, మార్చ్ 29, 1984. జాక్ నికల్సన్.ఆర్గ్ యొక్క స్కాన్ కాపి.
 9. ది కోస్ట్ స్టార్ . 14 అక్టోబర్ 2004.
 10. మాక్ గిల్లిగన్, పి. జాక్స్ లైఫ్ . W.W. నార్టన్ & కంపనీ, 1994.
 11. హిల్, లీ. ఎ గ్రాండ్ గయ్: ది లైఫ్ అండ్ ఆర్ట్ అఫ్ టెరీ సతర్న్ . బ్లూమ్స్బురి, 2001.
 12. Dunne, Dominick (April 2001). "Murder Most Unforgettable". Vanity Fair. |access-date= requires |url= (help)
 13. 13.0 13.1 McDougal, Dennis (2007). Five easy decades: how Jack Nicholson became the biggest movie star in modern times. John Wiley and Sons. pp. 109–110. ISBN 0471722464.
 14. McGilligan, Patrick (1996). Jack's Life: A Biography of Jack Nicholson. W. W. Norton & Company. p. 219. ISBN 0393313786.
 15. Deutsch, Linda (2009-09-27). "Polanski's Arrest Could Be His Path to Freedom". ABC News. Retrieved 2009-09-30. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (help); Cite news requires |newspaper= (help)
 16. ఫిల్మ్ కామెంట్ జూన్ 1985.
 17. von Strunckel, Shelley (2006-06-23). "What the Stars say about them — Jack Nicholson and Susan Anspach". The Sunday Times. p. 36. Cite news requires |newspaper= (help); |access-date= requires |url= (help)
 18. నికల్సన్ బ్రాండో ఇంటిని పడగొట్ట పోతున్నారు . IMDB న్యూస్. ఆగస్ట్ 9, 2006.
 19. 19.0 19.1 నికల్సన్ కోర్ట్ కోపానికి పాత్రయ్యారు . BBC న్యూస్. మే 11, 2003.
 20. స్కర్సేసే గేట్స్ జాక్ద్ బై నికల్సన్ . రాటన్ టొమాటోస్.కాం. జూలై 25, 2005.
 21. Braid, Mary (1999-07-23). "Jack Nicholson loves him. The public adores him. His erotic art has made him millions and his posters outsell Van Gogh and Star Wars. So why is Jack Vettriano so bitter?". The Independent (UK). Independent News & media plc. Retrieved 2009-02-22.
 22. జాక్ నికల్సన్ రాజకీయం గురించి ఆడిన మాటలు- CNN.com[dead link]
 23. హిల్లరీ క్లీన్టన్. నటుడు జాక్ నికల్సన్ హిలరీ క్లీన్టన్ ని అధ్యక్షుడు గా ఎన్నుకోవాటానికి మద్దతు ప్రకటించారు ఫెబ్రవరి 4, 2008
 24. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జ్యాక్ నికల్సన్ పేజీ

వేలుపరి వలయాలుసవరించు