భాషా విషయాలుసవరించు

జ్యోతి [ jyōti ] jyōti. [Skt.] n. Light, radiance. వెలుగు.[1] In a mystic sense, internal illumination. The lights that dance before the eyes when dazzled or closed. A lump of paste, used as a meat offering. A star నక్షత్రము The eye కన్ను. The sun సూర్యుడు. జ్యోతిర్లత jyōtir-lata. n. An ignis fatuus. A ray of light. జ్యోతిరింగణము jyōti-r-ingaṇamu. n. A firefly or glow-worm మిణుగురు పురుగు. జ్యోతిషము jyōtishamu. n. Astronomy, astrology. జోస్యము. జ్యోతిషికుడు jyōtiṣhkuḍu. n. An astronomer: an astrologer, a fortune teller. జ్యోతిష్మతి jyōtish-mati. n. A plant, the Balloon vine, or, the Heart-pea, or, the Winter Cherry, Cardiospermum Halicacabum, (Watts), also called సువర్నతల, వెక్కుడుతీగ or ఉప్పడంత. జ్యోతశ్చక్రము an astronomical chart or diagram. సూర్యచంద్రాది నక్షత్రగ్రహములను చూపేపటము. జ్యోతిస్సు jyōtissu. n. Radiance. జ్యోత్స్న jyōtsna. n. Moonlight. వెన్నెల. జ్యోత్స్ని jyōtsni. n. A moonlight night. వెన్నెలరాత్రి.

అఖండజ్యోతిసవరించు

 
భైరవకోనలో అఖండజ్యోతి దర్శనానికి వెళ్ళే మెట్లు, అఖండ జ్యోతి ఉన్న గుహ.
 
A ner tamid hanging over the ark in a synagogue

నిరంతరం వెలిగే జ్యోతిని అఖండజ్యోతి అంటారు. కొన్ని దేవాలయాలలో అఖండ జ్యోతిని వెలిగించి నిరంతరం దానిని సంరక్షిస్తుంటారు. ఈ అఖండజ్యోతిని పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు, పూజిస్తారు, ఈ దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఇంధనంను ఉచితంగా అందజేస్తారు. ఈ అఖండ జ్యోతిని పూజించడం వలన శుభం జరుగుతుందని నమ్ముతారు. దీపపు కుందెనలలో వత్తులను ఉంచి దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఇంధనంగా నువ్వులనూనె, లేదా ఆవు నెయ్యి, నువ్వులనూనె మిశ్రమం, లేదా ఆముదమును ఉపయోగిస్తారు. దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఆక్సిజన్ గాలి అందేలా ఈదురు గాలుల నుంచి, వానల నుంచి సంరక్షించేందుకు తగిన ప్రదేశంలో భద్రపరుస్తారు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జ్యోతి&oldid=2880856" నుండి వెలికితీశారు