జ్యోతి (మాసపత్రిక)

జ్యోతి మాసపత్రిక 1962 లో విజయవాడలో ప్రారంభమైంది.[1] వ్యవస్థాపక సంపాదకులు వేమూరి రాఘవయ్య, లీలావతి రాఘవయ్య, సంపాదక వర్గ సభ్యులు వేమూరి సత్యనారాయణ, గాంధీ, యర్రంశెట్టి సాయి. సంపాదక మండలిలో ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు, బాపు, వి.ఎ. కె.రంగారావు వంటివారు కూడా ఉన్నారు. జ్యోతి పత్రిక వల్ల తెలుగునాట పలువురు రచయితలు ఉత్సాహం చెంది చక్కని రచనలు చేశారు.[2]

జ్యోతి మాసపత్రిక సంపాదక మండలిలో ఒకరైన నండూరి రామమోహనరావు చిత్రం

పత్రిక ప్రారంభ సంచికలో ఒక విశేషం యద్దనపూడి సులోచనారాణి రాసిన సెక్రెటరీ నవల ధారావాహికగా మొదలవడం.[3] అది ఆమె రాసిన తొలి నవల. ఈ నవల పెద్ద హిట్టై ఆ తరువాత సినిమాగా కూడా రూపొందింది.

1970 ల్లో శ్రీశ్రీ, జ్యోతిలో పదబంధ ప్రహేళిక పేరుతో క్రాస్‌వర్డ్ పజిల్ నిర్వహించాడు.

మూలాలు మార్చు

  1. "ఎన్ .టి రామారావు రాజకీయ ప్రవేశం .తరువాత ఏమి జరిగిందంటే .? - Navyamedia". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-08-14.
  2. భమిడిపాటి, రామగోపాలం (March 1990). ఇట్లు మీ విధేయుడు (నేనెందుకు రాస్తున్నాను). విశాఖపట్టణం: విశాఖ సాహితి. Retrieved 10 March 2015.
  3. "ఆ పాత్రతో ఇప్పటికీ గొడవే!". www.andhrajyothy.com. Archived from the original on 2020-08-14. Retrieved 2020-08-14.