టి.కె.గోవిందరావు

కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు

త్రిపునితుర కృష్ణన్ ఎంబ్రందిరి గోవిందరావు ఒక కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.

టి.కె.గోవిందరావు
దస్త్రం:With T.K.Govinda Rao.jpg
జననం1929, ఏప్రిల్ 1
కొచ్చి, కేరళ
మరణం2011 సెప్టెంబరు 18(2011-09-18) (వయసు 82)
వృత్తిభారత శాస్త్రీయ గాత్ర విద్వాంసుడు
తల్లిదండ్రులుత్రిపునితుర వాదక్కెకొట్ట చక్కలమట్ట్ పల్లిస్సెరితిల్ కృష్ణారావు (తండ్రి),
కమలాంబాళ్ (తల్లి)
పురస్కారాలు

విశేషాలు మార్చు

ఇతడు కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందినవాడు. ఇతనిది సంగీత నేపథ్యం కలిగిన కుటుంబం. 1949లో ఇతడు మద్రాసులోని సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక్ మ్యూజిక్‌లో చేరి అక్కడ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆచార్యునిగా పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‌గా, ఛీఫ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహించి తనవంతు సంగీతసేవను చేశాడు. మద్రాసు సంగీత అకాడమీ, సంగీత నాటక అకాడమీ, ఐ.సి.సి.ఆర్.వంటి అనేక సంస్థలలో ఎక్స్‌పర్ట్స్ కమిటీ సభ్యుడిగా సేవలందించాడు. దేశవిదేశాలలో కచేరీలు చేస్తూ కళాకారునిగా రాణించాడు. సంగీతానికి సంబంధించి అనేక ప్రామాణిక గ్రంథాలు రచించి సంగీత ప్రపంచానికి అందించాడు. గానమందిర్ ట్రస్టును ఏర్పాటు చెసి కర్ణాటక సంగీత వ్యాప్తికి, పరిరక్షణకు ఎంతో సేవ చేశాడు. ఎంతోమంది శిష్యులకు సంగీతవిద్యను నేర్పించి వారిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దాడు. 1996లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం గాత్రం విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది. ఇతనికి 1999లో మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారంతో సత్కరించింది. ఇంకా సంగీత చూడామణి, సంగీత శాస్త్ర రత్నాకర వంటి బిరుదులు ఇతడిని వరించాయి.

ఇతడు నిర్మల సినిమాలో మొట్టమొదటి మలయాళ సినిమా నేపథ్యగానాన్ని ఆలపించాడు. అలాగే పి.లీలతో కలిసి మొట్టమొదటి మలయాళ సినిమా యుగళగీతాన్ని పాడాడు. ఇతడు కేవలం ఈ ఒక్క సినిమాలోనే పాడాడు.

ఇతడు 2011, సెప్టెంబరు 18వ తేదీన మరణించాడు.[1]

మూలాలు మార్చు

  1. శంకర నారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాద్: శాంతా వసంతా ట్రస్టు. p. 91. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 20 February 2021.