తంజావూరు ముక్త(1914–2007) సంగీత విద్వాంసురాలు. ఈమె తన సోదరి టి.బృందతో కలిసి గాత్రయుగళ కచేరీలు చేసింది. ఈ జంట కర్ణాటక సంగీత చరిత్రలో యుగళకచేరీలు మొదటి మహిళాద్వయంగా పేరుపొందింది.[1][2] వీరిది వీణ ధనమ్మాళ్ సాంప్రదాయం.

టి.ముక్త
తంజావూరు ముక్త
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంతంజావూరు ముక్త
జననం1914
మూలంమద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా
మరణం2007 (aged 92–93)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిగాత్రవిద్వాంసురాలు
వాయిద్యాలుగాత్రం, సరస్వతి వీణ

విశేషాలు

మార్చు

ముక్త తన సంగీత పాఠాలు తన తల్లి కామాక్షి వద్ద వీణ ధనమ్మాళ్ పద్ధతిలో నేర్చుకుంది. ఈ బాణీ సూక్ష్మ గమకాలతో అనుస్వరాలతో నిండి ఉంటుంది. తల్లి వద్ద శిక్షణ పొందిన తర్వాత తన సోదరి బృందతో కలిసి కాంచీపురం నయన పిళ్ళై,[3]లక్ష్మీరత్నం, వీణధనమ్మాళ్‌ల వద్ద తన సంగీతాన్ని మెరుగుపరచుకొంది. ఈమె తన 8వ యేట మొదటి కచేరీ చేసింది. 2003లో క్లీవ్‌లాండ్ (అమెరికా)లో ఈమె తన చిట్టచివరి కచేరీ చేసింది.[4][5]ఈమె ఎక్కువగా పదములను, జావళీలను ప్రాచుర్యంలోనికి తెచ్చింది.

ఈమె శిష్యబృందంలో సుభాషిణి పార్థసారథి, నిర్మల సుందరరాజన్, మైసూర్ నాగమణీ శ్రీనాథ్, ఉమా వాసుదేవన్ (కుమార్తె) మొదలైన వారున్నారు.

ఈమె 1972లో సంగీత నాటక అకాడమీ అవార్డును పొందింది.[6][7]

ఈమె తన 93వయేట 2007లో మరణించింది. ఈమె శతజయంతి ఉత్సవాలను 2014లో చెన్నైలో జరుపుకున్నారు.

మూలాలు

మార్చు
  1. "Mukta and her Music". The Hindu. 11 September 2014. Retrieved 25 August 2015.
  2. "Uncompromising standard". The Hindu. 1 December 2002. Archived from the original on 25 ఫిబ్రవరి 2003. Retrieved 25 August 2015.
  3. "Carnatic vocalist T Muktha dead Carnatic vocalist T Muktha dead". Rediff. 12 March 2007. Retrieved 25 August 2015.
  4. "Musician T. Muktha passes away". The Hindu. 12 March 2007. Archived from the original on 14 మార్చి 2007. Retrieved 25 August 2015.
  5. "Remembering T Mukta in Her Centenary Year". New Indian Express. 9 September 2014. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 25 August 2015.
  6. "Brinda-Muktha: Bastions of a Glorious Tradition" (PDF). www.sruti.com. p. 31. Archived from the original (PDF) on 24 సెప్టెంబరు 2015. Retrieved 26 August 2015.
  7. "Sangeet Natak Akademi Puraskar (Akademi Awards)". Sangeet Natak Akademi. Archived from the original on 30 మే 2015. Retrieved 14 ఫిబ్రవరి 2021.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=టి.ముక్త&oldid=4093299" నుండి వెలికితీశారు