టి. ఎ. ప్రమీల

భారతీయ నటి

ప్రమీలా దక్షిణ భారత చిత్రాలలో చేసిన ప్రముఖ భారతీయ నటి. 1970, 1980లలో ఆమె ప్రధాన నటిగా ఉన్నది. మలయాళం, తమిళం లతో పాటు కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ఆమె తన నటనతో ఆకర్షణీయమైన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె నాలుగు దక్షిణ భారత భాషలలో సుమారు 250 చిత్రాలలో నటించింది. ఇందులో మలయాళ చిత్రాలు 50కి పైగా ఉన్నాయి. 1968లో మలయాళంలో ఇన్స్‌పెక్టర్ చిత్రంలో నటించింది. 1973లో వచ్చిన తమిళ చిత్రం అరంగేట్రమ్ తో తన కెరీర్ లో గొప్ప పురోగతిని సాధించింది. ఆమె ఒక అమెరికన్ ను వివాహం చేసుకుని లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియాలో స్థిరపడింది. ఆమె ఒక రోమన్ కాథలిక్, కాగా మాతృభాష తమిళం.

ప్రమీల
జననంఆగస్టు 1956
తిరుచిరాపల్లి, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయ, యునైటెడ్ స్టేట్స్
వృత్తిసినిమా నటి
క్రియాశీలక సంవత్సరాలు1972–1990
భార్య / భర్తపాల్ ష్లాక్టా (m.1993)[1]
పిల్లలుపిల్లలు లేరు
బంధువులుఎస్. ఎ. అశోకన్
విన్సెంట్ అశోకన్ (మేనల్లుడు)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె అమల్ దాస్, సుశీలా దంపతుల నలుగురు పిల్లలలో రెండవ కుమార్తెగా జన్మించింది. వారిది తమిళనాడులోని తిరుచిరాపల్లి. ఆమెకు పెద్ద సోదరుడు సీజర్, చిన్న సోదరి స్వీటీ, తమ్ముడు ప్రభూ ఉన్నారు. తన సినీ కెరీర్ కోసం వీరి కుటుంబం చెన్నైకి మకాం మార్చింది. ఆమె తన ప్రాథమిక విద్యను చెన్నైలోని శారదా విద్యాాలయంలో పూర్తి చేసింది. ఆమె తిరుచిలోని హోలీ రిడీమర్స్ గర్ల్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె 12 సంవత్సరాల వయస్సులో ఇన్స్‌పెక్టర్ చిత్రంలో నటించింది. ఇది 1968లో విడుదల అయింది.

ఆమె పాల్ ష్లాక్టాను వివాహం చేసుకుని కాలిఫోర్నియాలో స్థిరపడింది. ఆ దంపతులకు పిల్లలు లేరు.[2][3]

కెరీర్

మార్చు

తెలుగు

మార్చు

టెలివిజన్

మార్చు
  • వైశక సంధ్య-మలయాళ సీరియల్

మూలాలు

మార్చు
  1. "തമ്പുരാട്ടിയിലെ ഗ്ലാമര്‍ രംഗം സ്‌ക്രീനില്‍ തെളിഞ്ഞപ്പോള്‍ ഞാന്‍ തലകുനിച്ച് ഇരിക്കുകയായിരുന്നു".
  2. கணேஷ், ஆ சாந்தி (13 November 2018). "சிவாஜி போட்டோ வெச்சிருந்ததுக்கு அடிவாங்கினவ, சிவாஜிக்கே ஹீரோயின் ஆனேன்!". Ananda Vikatan (in తమిళం). Retrieved 2021-06-12.
  3. Daily, Keralakaumudi. "തമ്പുരാട്ടിയിലെ ഗ്ളാമർ രംഗംസ്ക്രീനിൽ തെളിഞ്ഞപ്പോൾ ഞാൻ തലകുനിച്ചു". Keralakaumudi Daily (in ఇంగ్లీష్). Retrieved 2021-06-12.