డా.టీవీ నారాయణ రెండు తెలుగు రాష్ట్రాలలో విద్య, సామాజిక రంగాలల్లో సుపరితుడైన వ్వక్తి. తెలంగాణా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. పాఠశాల అధ్యాపకుడుగా జీవితం ఆరంబించిన వీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడి స్థాయికి ఎదిగారు.[1]

టీవీ నారాయణ
TV Narayana.jpg
టీవీ నారాయణ
జననం(1925-07-26)1925 జూలై 26
మరణం2022 జనవరి 11(2022-01-11) (వయసు 96)
వృత్తికవి, రచయిత, సామాజికవేత్త
జీవిత భాగస్వామిటి.ఎన్.సదాలక్ష్మి
తల్లిదండ్రులువెంకయ్య, నర్సమ్మ
పురస్కారాలుపద్మశ్రీ

జననంసవరించు

టీవీ నారాయణగా ప్రసిద్ధి చెందిన తక్కెళ్ల వెంకట నారాయణ 1925, జూలై 26న వెంకయ్య, నర్సమ్మ దంపతులకు సికింద్రాబాదు సమీపంలోని బొల్లారంలో జన్మించారు. మాజీ మంత్రి టి.ఎన్.సదాలక్ష్మి వీరి భార్య. టీవీ నారాయణ సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారు.

విద్యసవరించు

ప్రాథమిక విద్యాభ్యాసం బొల్లారం రెసిడెంట్ స్కూల్లో జరిగింది. నిజాం కళాశాలలో బి.ఎ. గణిత శాస్త్రము చదివిన వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో ఎం.ఎ. పట్టా పొందారు. వీరు నిత్య విద్యార్థిగా వుంటూ తన 71 వ ఏట కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు. వీరు అనేక సామజిక కార్యక్రమాల్లో పాల్గొని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి బందు సేవా మండలి స్థాపించారు. వేదాలు, ఉపనిషత్తులు చదివారు.

ఉద్యమ జీవితంసవరించు

నారాయణ రాజకీయ కార్యకలాపాలు హిందూత్వకు దగ్గరగా ఉండడంతో రజాకార్లకు టార్గెట్‌గా మారారు. ఇదే సమయంలో స్వామి రామానంద తీర్థతో కలిసి పనిచేశారు. రజాకార్ల నుండి తప్పించుకోవడానికి అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళారు.

ఉద్యోగంసవరించు

1954లో హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేశారు. బోర్డ్‌ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా ఉద్యోగం చేశారు. 1974లో సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా, ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో డిప్యూటి డైరెక్టర్‌గా రిటైరై 1974-80 మధ్యకాలంలో పబ్లిక్‌సర్విస్‌ కమిషన్‌ సభ్యుడిగా పనిచేశారు.

ఉపాధ్యాయుడిగా ఖమ్మం, జనగామ, జోగిపేట, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో పనిజేశారు. మాజీ డిజిపి పేర్వారం రాములు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సంతోష్‌రెడ్డి, ముకుందరెడ్డి తదితరులందరికి విద్యను బోధించారు.

రచనలుసవరించు

నారాయణ 20 వరకూ పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని:

 1. జీవనవేదం
 2. ఆర్షపుత్ర శతకం[2]
 3. భవ్యచరిత శతకం
 4. ఆత్మదర్శనం (కవితా సంపుటి)
 5. అమర వాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాస సంపుటి)

పురస్కారాలుసవరించు

 1. 2016లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం[3]
 2. భారత రాష్ట్రపతి చేతులమీదుగా వేద పండిత్ పురస్కారం
 3. తెలుగు విశ్వ విద్యాలయం నుండి ధర్మరత్న పురస్కారం
 4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి దళిత రత్న పురస్కారం

పదవులుసవరించు

నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కార్య నిర్వాహక మండలి సభ్యుడిగా, ఆర్య ప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షుడిగా, భాగ్యనగర్ ఖాది కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.

మరణంసవరించు

టివి నారాయణ 2022, జనవరి 11న హైదరాబాదులోని కేర్ ఆస్ప‌త్రిలో మరణించాడు.[4][5]

మూలాలుసవరించు

 1. "చదువుల రేడు టీవీ అస్తమయం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-11. Archived from the original on 2022-01-12. Retrieved 2022-01-12.
 2. E-books available at Tirumala Tirupati Devasthanams, తెలుగు విభాగం
 3. Apr 26; 2016. "Padmashri awardee Dr T V Narayana felicitated |". herald.uohyd.ac.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-17. Retrieved 2022-01-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 4. "టీవీ నారాయణ కన్నుమూత". andhrajyothy. Archived from the original on 2022-01-12. Retrieved 2022-01-12.
 5. "స్వాతంత్ర్య సమరయోధుడు, కవి టీవీ నారాయణ మృతి". EENADU. Archived from the original on 2022-01-12. Retrieved 2022-01-12.