ఠాణే జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లాలలో ఠాణే జిల్లా (హిందీ:ठाणे जिल्हा) ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 11,060,148. ;[1] 2014లో ఠాణే జిల్లాలో కొంతభూభాగం వేరుచేసి పాల్‌గర్ జిల్లా రూపొందించబడింది. తరువాత జిల్లా జసంఖ్యలో మార్పు వచ్చింది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 8,070,032. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ కళ్యాణ్, మిరా-భయందెర్, భివాండీ, ఉళస్నగర్, అమ్బర్నాద్, కుల్గవొన్-బద్లపుర్, షహపుర్, నవీన ముంబై మొదలైన ప్రధాన నగరాలు ఉన్నాయి..

ఠాణే

ठाणे जिल्हा
District
Kansai Section, Ambernath, Maharashtra 421501, India - panoramio.jpg
ఠాణే is located in Maharashtra
ఠాణే
ఠాణే
నిర్దేశాంకాలు: 19°12′N 72°58′E / 19.2°N 72.97°E / 19.2; 72.97Coordinates: 19°12′N 72°58′E / 19.2°N 72.97°E / 19.2; 72.97
Country India
రాష్ట్రంమహారాష్ట్ర
ప్రధాన కార్యాలయంThane
విస్తీర్ణం
 • మొత్తం4,214 కి.మీ2 (1,627 చ. మై)
జనాభా వివరాలు
(2011 Census, within revised area)
 • మొత్తం80,70,032
 • సాంద్రత1,900/కి.మీ2 (5,000/చ. మై.)
భాషలు
 • అధికారMarathi
కాలమానంUTC+5:30 (IST)
వాహన నమోదు కోడ్MH-04,MH-05,MH-43,MH-48
జాలస్థలిthane.nic.in

భౌగోళికంసవరించు

జిల్లా 18°42' నుండి 20°20' ఉత్తర అక్షాంశం, 72°45' నుండి 73°48' తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. .

చరిత్రసవరించు

1817లో ఠాణే జిల్లా ప్రాంతం పేష్వాల నుండి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తరువాత ఈ ప్రాంతం ఠాణే కేంద్రంగా ఉత్తర కొంకణి జిల్లాలో భాగంగా మారింది. అప్పటి నుండి సరిహద్దులలో మార్పులు జరుగుతూనే ఉంది. 1830లో ఉత్తర కొంకణి జిల్లా దక్షిణ కొంకణి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలుపుకుని విస్తరించబడింది. 1833 నాటికి జిల్లా పేరు ఠాణాగా మార్చబడింది. 1853 నాటికి మూడు సబ్‌దివిజన్లు (పెన్, ప్లేస్, మహాద్) అంధేరీ, కొలాబాలోని రెవదండా గిరిజన ప్రాంతాలు ఠాణా జిల్లాలోని కొలాబా సబ్ కలెక్టరేటుగా రూపొందించబడింది. 1869లో కొలాబా సబ్ కలెక్టరేటు జిల్లాగా రూపొందించబడింది (ప్రస్తుత రాయిగఢ్ జిల్లా).

పునర్విభజనసవరించు

1866లో ఠాణే ఉపవిభాగాల పునర్విభజన, పునర్నామకరణ చేయబడ్డాయి. సంజన్ (దహను), కొల్వన్ (షహాపూర్), నరసాపూర్ (కర్జత్) గా పునర్నామకరణ చేయబడ్డాయి. వద పెథాకు తాలూకా అంతస్తు ఇవ్వబడింది. 1861లో సల్సట్టే నుండి ఉరన్ మహల్ వేరుచేయబడి పంవెల్‌లో చేర్చబడింది. 1883లో పనవెల్ మహల్స్ (ఉరన్, కరంజ లాడ్) ప్రాంతాలు కొలాబా జిల్లాలో చేర్చబడ్డాయి. 1891లో కొలాబా జిల్లాలో కర్జత్ చేర్చబడింది. 1917లో బంద్రా కేంద్రంగా సరికొత్త మహల్ ఏర్పాటుచేయబడింది. 1920లో సల్సెట్టే రెండు తాలూకాలుగా (ఉత్తర సల్సెట్టే, దక్షిణ సల్సెట్టే) గా విభజించబడింది. దక్షిణ సల్సెట్టేలో ఉన్న 84 గ్రామాలు ఠాణే జిల్లా నుండి వేరుచేసి సబర్బన్ జిల్లాలో (ప్రస్తుత ముంబయి శివారు జిల్లా) చేర్చబడ్డాయి. 1923లో ఉత్తర సల్సెట్టేని కల్యాణ్ తాలూకాలో ఒక మహల్‌గా చేయబడి 1926లో ఠాణే అని నామకరణ చేయబడింది. కల్వే - మహింకు పాల్ఘర్‌గా పేరు మార్చబడింది. 1945లో బాంబే సబర్బన్ జిల్లాలోని 33 గ్రామాలు ఠాణా జిల్లాలో మార్చబడ్డాయి. 1946లో అరారే మిల్క్ కాలనీ ఏర్పాటు జరిగినప్పుడు ఈ గ్రామాలలో 14 బాంబేసబర్బన్ జిల్లాలో చేర్చబడ్డాయి.

స్వతంత్రం తరువాతసవరించు

స్వతంత్రం వచ్చిన తరువాత 1949లో జవ్హర్ రాజాస్థానం ప్రత్యేక తాలూకాగా మార్చి ఠాణే జిల్లాలో విలీనం చేయబడింది. 1956లో గ్రేటర్ బంబే సరిహద్దులను విస్తరించిన సమయంలో బొరివలి తాలూకాలోని 8 పట్టణాలు 27 గ్రామాలు ఠాణా తాలూకాలోని ఒక పట్టణం, ఒక గ్రామం బంబేసబర్బన్ జిల్లాకు బదిలీ చేయబడ్డాయి. 1960లో బాంబే రాష్ట్రం పునర్విభజన చేసిన సమయంలో 47 గ్రామాలు, అంబర్గావ్ తాలూకాలోని 3 పట్టణాలు గుజరాత్ లోని సూరత్ జిల్లాకు బదిలీ చేయబడ్డాయి. మిగిలిన 27 గ్రామాలను ముందుగా దహనులో చేర్చబడ్డాయి. తరువాత 1961లో ప్రత్యేక మహాలుగా (తలసారి) మార్చబడింది. 1969లో కల్యాణ్ జిల్లా తాలూకా రెండు తాలూకాలుగా (కల్యాణ్, ఉల్లాసనగర్) విభజించబడ్డాయి.[2]

భౌగోళికంసవరించు

జిల్లా కొంకణ్ జిల్లా ఉత్తరభాగంలోని మహారాష్ట్ర దిగువ భుములలో ఉంది. జిల్లాలో ఉలాస్ బేసిన్, వైతమలోయ భూభాగాలు ఉన్నాయి. జిల్లా ఉత్తరంలో సహ్యాద్రిపర్వత మైదానం ఉన్నాయి. జిల్లా మద్యలో ఉలాస్ లోయ ఉంది. ఉత్తర దక్షిణాలుగా వ్యాపించి ఉన్న సన్నని పర్వతావళి దిగువభూములను పశ్చిమ సముద్రతీర భూభాగం నుండి వేరుచేస్తుంది. థానే సముద్రఖాతం సముద్రానికి సమాంతరంగా సాగుతూ ఉంది. వీటి మద్య దూరం 6-10 కి.మీ దూరం ఉంది. జిల్లాలో ఈ పర్వతాలు ఏకాంతంగా అక్కడక్కడా నిలిచి ఉంటాయి. [3]

నదులుసవరించు

జిల్లాలో ప్రధానంగా ఉలాస్, వైతర్నా నదులు ప్రవహిస్తున్నాయి. ఉలాస్ నది లోనావాలా సమీపంలోని తుంగర్లి ఉత్తర భాగంలో జన్మించి భోర్ఘాట్ వైపు ప్రవహిస్తుంది. ఇది వసై క్రీక్ వద్ద సముద్రంలో సంగమిస్తుంది. ఉలాస్ నది 135కి.మీ పొడవున ప్రవహిస్తుంది. ఈ నదులకు పలు ఉపనదులు ఉన్నాయి. వీటిలో బార్వి, భత్స నదులు ప్రధానమైనవి.

= వైతర్నా నదిసవరించు

కొంకణ్ భూభాగంలో ప్రవహిస్తున్న నదులలో పొడవైనదైన వైతర్నా నది నాశిక్ జిల్లాలోని త్రితంబక్ పర్వతం వద్ద జన్మిస్తుంది. గోదావరి నది కూడా నాశిక్ లోని త్రియంబక్ పర్వతాలలో జన్మిస్తుంది. వైతర్నా నది షహపూర్, వదా, పాల్ఘర్ మీదుగా ప్రవహించి అరేబియన్ సముద్రంలో సంగమిస్తుంది. జిల్లాలో వైతర్నా నది 154కి.మీ పొడవున ప్రవహిస్తుంది. ఇది జిల్లా ఉత్తరభూభాగం అంతా నీటిపారుదల సౌకర్యం కలిగిస్తుంది. వైతర్నా నదికి పలు ఉపనదులు ఉన్నాయి. వీటిలో పింజల్, సూర్య, దహెర్జా, తంస మొదలైన ఉపనదులు ఉన్నాయి.

క్రీక్స్సవరించు

పశ్చిమ సముద్రతీరంలో పలు చిన్న క్రీక్స్ ఉన్నాయి. వీటిలో ఆటుపోట్లద్వారా సముద్రజలం ప్రవహిస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఇవి ఆక్రమణకు గురౌతున్నాయి. వీటిలో భివంది, చించాని, దహను క్రీక్స్ పెద్దవి. క్రీక్స్ అంటే సముద్రం చుచ్చుకుని ముందుకు రావడం వలన ఏర్పడే జలాశయాలు.

ద్వీపాలుసవరించు

ఠాణే జిల్లాలోని సల్సట్టే ద్వీపం ఉత్తర భాగంలో ఉంది. దీనిని ప్రధాన భూమి నుండి ఉలాస్ నదీజలాలు, ఠాణే క్రీక్ వేరుచేస్తున్నాయి. ఇది ద్వీపనగరం అయిన ముంబై నగరంతో అనుసంధానమై ఉంది. వసై తాలూకాలో అమ్లా ద్వీపం ఉంది. ప్రవేశంలో వైతర్నా ఉప్పూనీటి కయ్య ఉంది. .

సరసులుసవరించు

జిల్లాలో సహజమైన సరసులు లేవు. ముబై నగరానికి మంచునీరు సరఫరా చేయడనికి నిర్మించిన మానవనిర్మిత సరసులు ఉన్నాయి. భివండి ఉత్తర భూభాగంలో తంసా నది మీద తంసా సరసు నిర్మించబడింది. ఈ ఆనకట్ట సా.శ. 1892లో నిర్మించబడింది. దిగువ వైతర్నా నది ఆధారంగా నిర్మించిన మోదక్ సాగర్ ఆనకట్ట సా.శ. 1957లో నిర్మించబడింది. సా.శ. 1972లో ఎగువ వైతర్నా నది ఆధారంగా వైతర్నా సరసు నిర్మించబడింది. ఎగువ భాస్తా నది మీద భాస్తా సరసు నిర్మిచబడింది. 1981లో షహపూర్ వద్ద ఆనకట్ట నిర్మించబడింది. [4]

ఉష్ణ గుండాలుసవరించు

వసై తాలూకాలోని తంసా నది ముఖద్వారంలో పలు ఉష్ణ గుండాలు ఉన్నాయి. ఇవి అక్లొలి, గణేశ్పురి, వజ్రేశ్వరి గ్రామాల సమీపంలో ఉన్నాయి. (మద్వన్ తాల్ - పాల్ఘర్), సతివలి (సఫలే తాల్ - పాల్ఘర్) ). ఉష్ణగుండాలలో నీటి ఉష్ణోగ్రత 42°-55;°C.[3]

సరిహద్దులుసవరించు

సరిహద్దు వివరణ జిల్లా
తూర్పు సరిహద్దు పూనా, అహ్మద్‌నగర్ జిల్లా
సరిహద్దు పాల్‌ఘర్
పశ్చిమ సరిహద్దు అరేబియన్ సముద్రం,
నైరుతీ సరిహద్దు ముంబై పరిసరం జిల్లా
దక్షిణ సరిహద్దు రాయిగఢ్

వాతావరణంసవరించు

వాతావరణంసవరించు

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం పశ్చిమ సముద్రతీరం - తూర్పు సహ్యాద్రి లోయలు
పశ్చిమ సముద్రతీరం తాలూకాలు థానే, వాసి, పాల్ఘర్, దహను
వాతావరణం తేమ -వెచ్చని ఉపఉష్ణ మండల వాతావరణం
తూర్పు సహ్యాద్రి పర్వతపాదాలు కళ్యాణ్, భివాండీ, వేడ్, ఉలస్నగర్ అమ్బర్నాద్, టాక్ చీర తాలూకాలు
వాతావరణం పొడి - వేడి
వేసవి కాలం మార్చి - జూన్
వర్షాకాలం జూన్- సెప్టెంబరు
వర్షాకాం తరువాత అక్టోబరు - నవంబరు (94%)
జూలై మాస వషపాతం 40%
శీతాకాలం శిసెంబర్ - ఫిబ్రవరి
వేసవి సరాసరి ఉష్ణోగ్రత 32.9 ° సెల్షియస్
గరిష్ఠ ఉష్ణోగ్రత 40 ° సెల్షియస్
శీతాకాలం సరాసరి ఉష్ణోగ్రత 16.8 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
వర్షపాతం 2293 మి.మీ
మాహిం 1730.5 మి.మీ
షహాపూర్ 2588.7 మి.మీ
నమోదైన అత్యధిక వర్షపాతం ధాను వద్ద 1958 సెప్టెబర్‌న 24 గంటలు (481.1 మి.మీ)

.[5]

విభాగాలుసవరించు

జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి [6]

తాలూకా జనసంఖ్య
Census 2001
జనసంఖ్య
గణాంకాలు 2011
థానే 2,486,941 3,787,036
కల్యాణ్ 1,276,614 1,565,417
ముర్దాబాదు 170,267 190,652
భివండి 945,582 1,141,386
తాలూకా జనసంఖ్య
Census 2001
జనసంఖ్య
Census 2011
షహపూర్ 273,304 314,103
ఉల్హస్నగర్ 473,731 506,098
అంబర్నాథ్ 366,501 565,340
Totals 5,992,940 8,070,032

విభాగాలుసవరించు

 • జిల్లాలో 6 మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి : (థానే, కళ్యాణ్ (భారతదేశం), - దోంబివలి, ఉల్హస్నగర్, భివాండీ-నిజాంపూర్ (మున్సిపల్ కార్పొరేషన్), మిరా-భయాండర్ కలిసి నవీ ముంబై., 2 ముంసిపల్ కౌంసిల్స్ ఉన్నాయి. (అంబర్నాథ్, కుల్గయోన్ బద్లపూర్).
 • జిల్లాలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి మూడు పార్లమెంటు నియోజకవర్గాలలో భాగంగా ఉన్నాయి.
 • భివాండీ రూరల్ (ఎస్.టి), షహపుర్ (ఎస్.టి), భివాండీ వెస్ట్, భివాండీ ఈస్ట్, కళ్యాణ్ వెస్ట్, ముర్బద్ నియోజకవర్గాల భాగం భివాండీ (లోక్ సభ నియోజకవర్గం).
 • అమ్బర్నాద్ (ఎశ్.ఛి), ఊళస్నగర్, కళ్యాణ్ ఈస్ట్, దొంబివలి, కళ్యాణ్ గ్రామీణ, ముంబ్ర-కల్వ నియోజకవర్గాల భాగం కళ్యాణ్ (లోక్ సభ నియోజకవర్గం)
 • మిరా భయందర్ (విధాన సభ నియోజకవర్గం) | ఒవల-మజివద (విధాన సభ నియోజకవర్గం), కొప్రి-ఫచ్పఖది (విధాన సభ నియోజకవర్గం)

థానే (విధాన సభ నియోజకవర్గం) బెలపుర్ (విధాన సభ నియోజకవర్గం), ఐరొలి (విధాన సభ నియోజకవర్గం) నియోజకవర్గాల భాగం థానే (లోక్ సభ నియోజకవర్గం).

[7]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 11,054,131,[1]
ఇది దాదాపు. క్యూబా దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. ఒహియో నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 1 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1157 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 35.94%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 880:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 86.18%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

2001 గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి - జనసంఖ్య 8,131,849
నగరీకరణ శాతం 72.58% [10]
ఇందులో పురుషుల సంఖ్య
స్త్రీలసంఖ్య
స్త్రీ పురుష నిష్పత్తి
జాతీయ సరాసరి 928 కంటే
అక్షరాస్యతా శాతం 80.67%
పురుషుల అక్షరాస్యత 87.06%
స్త్రీల అక్షరాస్యత 73.10%
1991 నుండి 2001 వరకు జనసంఖ్య అభివృద్ధి.

దక్షిణ తాలూకాలు అధికంగా నగరప్రాంత తాలూకాలు. జిల్లాలో మరాఠీ భాష, వలసల కారణంగా జిల్లాలో ఉర్దూ, సింధి, గుజరాతీ, హిందీ భాషలు వాడుకలో ఉన్నాయి. దూరప్రాంత తాలూకాలలో ప్రాంతాలలో మరాఠీ ప్రధాన భాషగా ఉంది.

ప్రజలుసవరించు

పశ్చిమ సముద్రతీరంలో కోలీ ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. తూర్పు తాలూకాలలో వర్లి ప్రజలు అధికంగా జీవిస్తున్నారు. వీరు గృహకుడ్యాల మీద చిత్రించే చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆర్ధికంసవరించు

2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో శ్రామికుల సంఖ్య 11,961,704. జిల్లా జనసంఖ్యలో ఇది 47.37%. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలలో 51.75% పనిచేస్తున్నారు. వస్తువుల తయారీ, సర్వీస్, కుటీర పరిశ్రమలలో 6.19% శ్రామికులు పనిచేస్తున్నారు. మిగిలిన 30.69% శ్రామికులు ఇతర వృత్తులలో పనిచేస్తుంటారు. శ్రామికులలో స్త్రీలు 22.89% ఉన్నారు.[11]

వ్యవసాయంసవరించు

కరీఫ్ పంటలలో ప్రధానమైనవి వరి, చిరుధాన్యాలు పండించబడుతున్నాయి. మినుములు, పెసలు, కులిత్ వంటి పప్పుధాన్యాలు పండించబడుతున్నాయి. జిల్లాలో వరి ప్రధాన పంటగా ఉంది. జిల్లాలో ప్రధానంగా పల్ఘర్, భివాండీ, ముర్బద్, షహపుర్, వడ, విక్రమ్గద్, దహను తాలూకాలలో వరి పండించబడుతున్నాయి. జిల్లా ఉత్తర భూభాగంలోని జవహర్, ముర్బద్, విక్రమ్గద్, షహపుర్, మొదలైన తాలూకాలలో వరి, చిరుధాన్యాలు, గోధుమలు, పప్పుదినుసులు పండించబడుతున్నాయి.

పండ్ల తోటలుసవరించు

దహను తాలూకా పడ్లతోటలకు ప్రసిద్ధి. ఘోల్వద్ వద్ద సపోటాలు పెద్ద ఎత్తున పండొంచబడుతున్నాయి. పాల్గర్, తలసారి తాలూకాలలో కూడా సపోటా పండ్లతోటలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పండించబడుతున్న సపోటాలు దేశంలోని ఇతర ప్రాంతానికి ఎగుమతి చేయబడుతూ ఉంటారు. జిల్లాలో అదనంగా జామ, మామిడి, బొప్పాయి, ద్రాక్ష, కొబ్బరి తోటలు ఉన్నాయి. వాసై, పాల్గర్ తాలూకాలలో పలు రకాల అరటిపండ్లు (రాజేలి, తంబెలి, ముతెలి, వెల్చి జాతులు) పంటకు ప్రసిద్ధి. జిల్లాలో సీజన్ అనుసరించి బోర్, అడవి బేరీ, లిచీ పండ్లకు ముంబయి మార్కెట్లో గిరాకీ అధికంగా ఉంది. జిల్లాలో కూరగాయలు కూడా అధికంగా పండించబడుతున్నాయి. కూరగాయలలో వంకాయలు పెద్ద ఎత్తున పండించబడుతున్నాయి. దహను తాలూకాలో గులాబీ తోటలు కూడా ఉన్నాయి.[12]

పరిశ్రమలుసవరించు

రాష్ట్రంలో అధికంగా పారిశ్రమీకరణ చేయబడిన జిల్లాలో ఠాణే జిల్లా మూడవ స్థానంలో ఉంది. జిల్లాలో బృహాత్తర, మధ్యతరహా పరిశ్రమలు 1548, 18,480 చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుండి ప్రధానంగా డ్రగ్స్, టెక్స్టైల్స్, సంసంజనాలు, ప్లాస్టిక్స్, రబ్బర్, స్టీల్, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్, ఎరువులు, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఐరన్ & స్టీల్ ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఠాణే - బేలాపూర్ - కల్యాణ్ జిల్లాలో అధునాతన ఆధునిక పరిశ్రమలు ఉన్నాయి. ఇవి అమ్బర్నాద్, భివాండీ, బద్లపుర్, తారాపూర్, పల్ఘర్, వాసి, ముర్బద్‌లలో ఉన్నాయి. జిల్లాలో దాదాపు 4,000 పరిశ్రమలు జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా మెషనరీ, మెషిన్ టూల్స్, ఎలెక్ట్రిక్ మెషినరీ టూల్స్ కాక మిగిలిన ఇనుము, స్టీలు పరిశ్రమ, లోహపు ఉత్పత్తులు తయారుచేయబడుతున్నాయి. పారిశ్రామిక సమూహంలో ప్రధాన రవాణ, బాయిలర్లు, రిఫ్రిజిరేటర్లు, యంత్ర పరికరాలు, కంప్యూటింగ్, అకౌంటింగ్ యంత్రాలు, ఆహారం, వస్త్ర పరిశ్రమలు పారిశ్రామిక యంత్రాలు, రసాయనాలు, కాగితం, సిమెంట్ పరిశ్రమలకు యంత్రాలు తయారు చేయబడుతున్నాయి.

రసాయన పరిశ్రమలుసవరించు

జిల్లాలో బేసిక్ ఇండస్ట్రియల్ రసాయనాలలో ఎరువులు, కూరగాయల, జంతు నూనెలు, కొవ్వులు, పెయింట్స్, చెక్క వస్తువులపై వేసే రంగులు, క్షీరవర్దినులు ఇతర రసాయనిక ఉత్పత్తులు ఉన్నాయి. ఈ పరిశ్రమలు ప్రధానంగా ట్రాన్స్-థానే క్రీక్, Belapur రోడ్ పారిశ్రామిక ప్రాంతంలో కేంద్రీకరించి ఉన్నాయి. ఫైజర్, లుబ్రిజొల్ భారతదేశం లిమిటెడ్, పాలియోలేఫిన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నొఇసిల్, భి.ఏ.ఎశ్.ఎF (భారతదేశం) లిమిటెడ్ హెర్దిల్లీ కెమికల్స్ లిమిటెడ్, స్టార్ కెమికల్స్, ఇండొఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫీనిక్స్ కెమికల్ వర్క్స్ వంటి బృహాత్తర, మధ్యతరహా పరిశ్రమలు రసాయన తయారీ, రసాయనిక ఉత్పత్తులు తయారు చేయబడుతున్నాయి. వాగిల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, పోఖ్రాన్ రోడ్ అమ్బర్నాద్, డోమ్బివిలిలో కూడా రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి.

చేనేతసవరించు

కాటన్, ఇతర నేత పరిశ్రమ కేంద్రాలు ప్రధానంగా భివాండీ, థానే కళ్యాణ్ లలో కేద్రీకృతమై ఉన్నాయి. భివాండి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. చేనేతకు ఆదరణ లోపిస్తున్న కారణంగా నేతవారు పవర్‌లూమ్‌కు మారవలసి పరిస్థితులు ఎదురౌతున్నాయి.

చేపల పరిశ్రమసవరించు

జిల్లాలో చేపల పరిశ్రమకు ప్రాధాన్యత ఉంది. జిల్లా పశ్చిమ తీరంలో ఉన్న వాగులు, కయ్యలు చేపల పరిశ్రమకు అనుకూలిస్తున్నాయి. జిల్లాలోని ద్వీపాలలోని చేపలపరిశ్రమను సముద్రతీర చేపల పరిశ్రమ అధిగమిస్తుంది. జిల్లాలో చేపల పరిశ్రమ 75% ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. జిల్లాలో 110 కి.మీ పొడవు ఉన్న సముద్రతీరం చేపల పరిశ్రమకు అనుకూలంగా ఉంది. జిల్లాలో చేపల పరిశ్రమ దహను, పొఖరన్-ఉచ్హెలి, నవపుర్, మురబె, సత్పుతె, దతివరె, అర్నల, వాసి, ఉరన్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది.

ఆహార తయారీ పరిశ్రమసవరించు

జిల్లాలో ఆహార తయారీ పరిశ్రమలలో ధాన్యం మిల్లు ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులు, కోకో, చాక్లెట్, చక్కెర మిఠాయి, ఉప్పు, మంచు, ఖుర్బానీ, తయారీ, మాంసం సంరక్షణ, పాల ఉత్పత్తులు, క్యానింగ్, పండ్లు, కూరగాయలు, క్యానింగ్, యొక్క సంరక్షణ సంరక్షణకు, చేపల ప్రాసెసింగ్ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. పాలు వంటి ఆహార, అధిక ప్రోటీన్ ఆహారం ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమలలో రప్తకొస్, బ్రెట్, కో, ఫైజర్ లిమిటెడ్, క్యాడ్బరీ ఫ్రై (భారతదేశం) లిమిటెడ్ జిల్లాలో భారీ, మధ్యతరహా కంపెనీలు ప్రధానమైనవి.

వుడ్ ఉత్పత్తులుసవరించు

జిల్లాలో వుడ్ సంబంధిత ఉత్పత్తులలో ప్లైవుడ్, పొర, చెక్క బాక్సులను, పీపాలు, వెదురు, బెత్తం బుట్టలను, పోగులను, పారిశ్రామిక మ్యాచ్లను, కార్క్ & కార్క్ మొదలైన ఉత్పత్తులు ప్రధానమైనవి.

తారాపూర్ ఆటామిక్ పవర్సవరించు

అణుశక్తిని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న " తారాపూర్ ఆటామిక్ పవర్ స్టేషను" జీల్లాలో ఉపస్థితమై ఉంది. దీనికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఇతర ఫైనాంషియల్ సంస్థలు నిధిసహాయం చేస్తుంది. జిల్లాలోని ఆధిక్యతలో ఉన్న ప్రభుత్వ బ్యాంకులలో " బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర " మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో దీనికి 60 శాఖలు ఉన్నాయి. .[11]

ప్రయాణసౌకర్యాలుసవరించు

ఠాణే ముంసిపల్ కార్పొరేషన్ 1989 ఫిబ్రవరి 9 నుండి స్వంతంగా పబ్లిక్ ట్రాంస్‌పోర్ట్ సర్వీసులు (ఠాణే ముంసిపల్ ట్రాంస్‌పోర్ట్. టి.ఎం.టి) ప్రారంభించింది. టి.ఎం.టి సంస్థకు 45 మార్గాలలో 289 బసులు ఉన్నాయి. ఈ సంస్థకు 2 బస్ డిపోలు, 8 బస్‌స్టాండులు ఉన్నాయి. ఇందులో ఒక రోజుకు 2.8 లక్షల ప్రజలు ప్రయాణిస్తున్నారు. .[13]2006లో మీరా భయందర్ ముసిపల్ కార్పొరేషన్ (ఎం.బి.ఎం.టి) సంస్థకు స్వంత ట్రాంస్‌పోర్ట్ సర్వీస్ (మిరా- భయందర్ - ముంసిపల్ ట్రాంస్‌పోర్ట్) ఉంది. కల్యాణి దొంబ్వి కాత్పొరేషన్ తన స్వంత ట్రాంస్‌పోర్ట్ సర్వీస్ (కల్యాణి - దొబ్వి ముంసిపల్ ట్రాంస్‌పోర్ట్) కె.డి.ఎం.టి ఉంది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎం.ఎస్.ఆర్.టి.సి) బసులు ఠాణే నగరాన్ని ఇతర నగరాలతో అనుసంధానిస్తుంది.

రైలు మార్గంసవరించు

బ్రిహన్ముంబై ఎలెక్ట్రిక్ సప్లై, ట్రాంస్పోర్ట్ (బి.ఇ.ఎస్.టి) ముబై, భయందర్, ఠాణే రైళ్ళను నడుపుతూ ఉంది. జిల్లాలోని రైలుమార్గం మొత్తం పొడవు 345.73 కి.మీ. ఇది జిల్లా పశ్చిమ, మద్యభాగంలో నిర్మించబడి ఉంది. వెస్టర్న్ రైల్వే నెట్వర్క్ జిల్లాలోని వసై, పాల్ఘర్, దహను తాలూకాలను కలుపుకుంటూ పయనిస్తుంది. సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్ జిల్లాలో ఠాణే, కల్యాణ్, ఉలాస్నగర్, షహాపూర్‌లను కలుపుకుంటూ పయనిస్తుంది. వెస్టర్న్ రైల్వే లోకల్ ట్రైంస్ చర్చ్‌గేట్ రైల్వేగేట్ వద్ద ఆరంభమై ధాను రోడ్డు రైల్వే స్టేషను వరకు నడుపబడుతున్నాయి. సెంట్రల్ రైల్వే లోకల్ రైళ్ళు చత్రపతి శివాజి టెర్మినల్ నుండి కల్యాణ్, అంబర్నాథ్, బదల్పూర్, కర్జత్, కసర లను కలుపుకుంటూ నడుపబడుతున్నాయి. 1994లో దివా జంక్షన్ నుండి వసై వరకు కొత్త మార్గం నిర్మించబడింది. ఈ అనుసంధాన మార్గం సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వేలతో కలుపబడుతూ ఉంది. ఈ రైలు మార్గం పొడవు 41.96 కి.మీ.[11] కొంకణ్ రైల్వే నెట్‌వర్క్ కూడా జిల్లా గుండా పయనిస్తుంది. లోకల్ రైళ్ళు శివాజీ టెర్మినల్, ముంబై నుండి పాంవెల్‌లను కలుపుకుంటూ పయనిస్తుంది.

నౌకాశ్రయాలుసవరించు

జిల్లాలోని పశ్చిమ సముద్రతీరంలో దహను, సత్పతి, మహిం, కల్యాణ్, వసై, ఉత్లన్ వద్ద నౌకాశ్రయాలు ఉన్నాయి. ఈ నౌకాశ్రయాల మద్య ఫెర్రీ సర్వీసులు నడుపబడుతున్నాయి. జిల్లాలోని ఠాణే, మిరా, భయందర్, పలు ఇతర పట్టణాలలో మీటర్డ్ ఆటోరిక్షాలు లభిస్తుంటాయి. మీటర్డ్ టాక్సి సర్వీసులు ఠాణే, మిరా, భయందర్, పలు ఇతర పట్టణాలలో లభిస్తుంటాయి.

విమానాశ్రయంసవరించు

ప్రస్తుతం జిల్లాలో విమానాశ్రయం లేదు.

క్రీడలుసవరించు

జిల్లాలో థానే పట్టణంలో " దాదాజి కొండదేవ్ స్టేడియం " ఉంది. ఇక్కడ క్రికెట్, బ్యాడ్మింటెన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఆడాడానికి అవసరమైన వసతులు ఉన్నాయి.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. Thane district e-gazetteer - geography, administrative evolution
 3. 3.0 3.1 Thane district e-gazetteer - geography
 4. The Times of India, Mumbai edition, 25 May 2007
 5. Thane district e-gazetteer-climate
 6. Indian Census
 7. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2010-03-18. Retrieved 2014-11-27.
 8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cuba 11,087,330 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 5 (help)
 9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Ohio 11,536,504 {{cite web}}: line feed character in |quote= at position 5 (help)
 10. "Census GIS India". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
 11. 11.0 11.1 11.2 "www.smallindustryindia.com - Thane district". Archived from the original on 2014-01-30. Retrieved 2014-11-27.
 12. "www.indianngos.com - Thane district". Archived from the original on 2007-10-24. Retrieved 2014-11-27.
 13. "Thane Municipal Corporation website – Transport". Archived from the original on 2008-11-13. Retrieved 2014-11-27.

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు