డబ్‌స్మాష్ అనేది ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ల కొరకు రూపొందించిన వీడియో మెసేజింగ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఉపయోగించి, వినియోగదారులు ప్రఖ్యాతిచెందిన కొటేషన్ లేదా డైలాగ్ వంటివాటి ఆడియో రికార్డింగ్ కి డబ్బింగ్ చెప్తూన్న తమ వీడియో రికార్డ్ చేసుకోగలుగుతారు.[1] డబ్‌స్మాష్ యాప్ ఆధికారికంగా 2014 నవంబరు 19న విడుదలైంది. దాని వ్యవస్థాపకులు జానస్ డ్రూప్పెల్, రోలాండ్ గ్రీంకె, డేనియల్ టస్కిక్.

డబ్స్‌మాష్-ఆండ్రాయిడ్ తెర

చరిత్ర మార్చు

జర్మన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు జానస్ డ్రూప్పెల్, రోలాండ్ గ్రీంకె, డేనియల్ టస్కిక్ ఈ యాప్ ని అభివృద్ధి చేశారు. డబ్‌స్మాష్ ఆధికారికంగా 2014 నవంబరు 19న విడుదలైంది.[2] 2015 జనవరి 20న మలి వెర్షన్ 1.2.1 విడుదలైంది. తర్వాత నెలలలో మరో ఆరు వెర్షన్లు విడుదలయ్యాయి. జూలై 2015న 1.3 వెర్షన్ విడుదలైంది.[3]

ప్రాచుర్యం మార్చు

డబ్‌స్మాష్ యాప్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. మొదట జర్మనీలో విజయవంతమైన ఈ యాప్, క్రమంగా ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ యాప్ ని 2015 జనవరి నెలాఖరు నాటికే కోటిమందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు, 2015 జూన్ మూడోవారం నాటికి ఈ సంఖ్య 5కోట్లకు చేరింది.[4][5] సామాన్యులతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా ఈ క్రేజ్ లో పాలుపంచుకుంటున్నారు. ఫార్ములా వన్ డ్రైవర్ లెవిస్ హామిల్టన్, ఆస్ట్రేలియన్ నటుడు హగ్ జాక్‌మేన్, జెన్నిఫర్ లోపెజ్, డెమి మోరె, కేట్ అప్టన్ వంటి ప్రముఖులెందరో ఈ డబ్‌స్మాష్ యాప్ తో లిప్ సింక్ వీడియోలు తయారుచేసినవారిలో ఉన్నారు.[2] బాలీవుడ్ ప్రముఖులు సోనమ్ కపూర్, సోనాక్షీ సిన్హా, రణ్‌వీర్ సింగ్, ఫర్హాన్ అఖ్తర్, అనిల్ కపూర్, రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, నేహా ధూపియా, సోహా అలీఖాన్, దబాంగ్2 దర్శకుడు అర్బాజ్ ఖాన్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటివారంతా డబ్‌స్మాష్ లో వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా డబ్ స్మాష్ వీడియోల్లో నటించారు.[6] తెలుగు సినీనటుల్లో బాలకృష్ణ, మంచు లక్ష్మి, మంచు విష్ణులు కలసి లెజెండ్ సినిమాలోని డైలాగ్ తో, రామ్‌చరణ్ తేజ్, రానాలు కలసి మగధీర డైలాగూ చెప్తూ డబ్‌స్మాష్ వీడియోలు చేసి విడుదలచేశారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ ప్రెషన్ ఇప్పుడనండి అబ్బా అంటూ రవితేజ మిరపకాయ్ సినిమాలో చెప్పిన డైలాగును నవదీప్ డబ్‌స్మాష్ లో లిప్ సింక్ చేశారు. శివబాలాజీ దంపతులు, గీతామాధురి, మాధవీలత మొదలైన తెలుగు సినీనటులెందరో డబ్ స్మాష్ వీడియోలు విడుదల చేశారు.[7]

విమర్శలు మార్చు

డబ్‌స్మాష్ లో పలువురు లిప్ సింక్ చేసి తయారుచేసే డైలాగులు, పాటలు కాపీహక్కుల పరిధిలో ఉన్నవి కావడంతో కాపీహక్కులను ఈ వీడియోల్లో చాలావరకూ ఉల్లంఘిస్తున్నాయి. పక్షుల, జంతువుల శబ్దాలు రికార్డు చేసి గానీ, స్వంతంగా రాసుకుని చెప్పిన డైలాగులు గానీ తప్పిస్తే దాదాపుగా మిగిలిన వీడియోలన్నీ కాపీహక్కులు ఉల్లంఘిస్తున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. కేవలం ప్రైవేటుగా మిత్రులతో పంచుకోవడం కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక అనుసంధాన వేదికలపై విస్తృత ప్రజానీకం చూసి, పంచుకునే వీలుండేలా పంచుకుంటే కాపీహక్కులు ఉల్లంఘించినట్టేనంటున్నారు.[2]

ఇవి కూడా చూడండి మార్చు

  1. "Dubsmash". play.google.com. Google, Inc. Retrieved 29 November 2014.
  2. 2.0 2.1 2.2 ద వీక్, సంపాదకులు. "Dubsmash app: what is it and why's it so successful?". The week. Retrieved 8 July 2015.
  3. "Dubsmash Versions and History". AppsMeNow. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 8 July 2015.
  4. బిబిసి, రిపోర్టర్ (27 January 2015). "Lip-synching goes viral: the rise of Dubsmash". బిబిసి. బిబిసి న్యూస్. Retrieved 8 July 2015.
  5. "7 apps with large teen fan bases brands should know about". Digiday. Retrieved 8 July 2015.
  6. "Dubsmash fever grips Bollywood celebs". టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 8 July 2015.
  7. సుంకరి, ప్రవీణ్ కుమార్. "డైలాగ్ మాది యాక్షన్ మీది". Archived from the original on 2015-07-09. Retrieved 2015-07-08.

బయటి లింకులు మార్చు

  • అధికారిక వెబ్సైట్ :