డాడీ డాడీ
డాడీ డాడీ 1998 నాటి తెలుగు హాస్య చిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై [1] కోడి రామకృష్ణ దర్శకత్వంలో [2] రామోజీ రావు ఈ సినిమాను నిర్మించాడు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, హరీష్, రాశి నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం కూర్చాడు. అక్కినేని నాగేశ్వరరావుకు ఇది 250 వ చిత్రం.[3] శివాజీ గణేశన్, బి. సరోజా దేవి, విజయ్ & సిమ్రాన్ నటించిన 1997 తమిళ చిత్రం " వన్స్ మోర్ "కి ఇది రీమేక్.
డాడీ డాడీ (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | ఆదినారాయణరావు , హరీష్ , రాశి |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
కథసవరించు
సిరిసంపదల్లో జన్మించిన ప్రసాదు (హరీష్) తో సినిమా మొదలవుతుంది. అతని తండ్రి ఎప్పుడూ విదేశాలలోనే ఉంటాడు. అతనికి ఉన్న ఏకైక సహచరుడు అతని కజిన్ అంజీ (అలీ). ప్రసాద్ తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూంటాడు. ఉన్నత జీవనశైలితో, బిజీ షెడ్యూలుతో విసిగిపోతాడు. సాధారణ వ్యక్తిలా జీవించాలనుకుంటున్నాడు. అతను ఒక అందమైన అమ్మాయి సుభద్రను (రాశి) ప్రేమిస్తాడు. కాని అతడు బంధాలు అనుబంధాల పట్ల గౌరవం లేనివాడని తప్పుగా అర్ధం చేసుకుని అతన్ని తిరస్కరిస్తుంది. మరొక వైపు, ఆప్కో అనే అప్పల కొండ (శివాజీ రావు), జిత్తులమారి, సుభద్రను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. ఈ ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచుతాడు. ఇంతలో, ప్రసాద్ తండ్రి విమాన ప్రమాదంలో మరణిస్తాడు. వ్యాపారం మొత్తం దివాళా తీయబోతోంది. దానికి కొంచెం ముందు, ప్రసాద్ తన తండ్రి ఒక బ్యాంకులో భారీ మొత్తాన్ని సంపాదించాడని తెలుసుకుంటాడు, కాని దాన్ని పొందాలంటే తండ్రి సంతకం తప్పనిసరి. ఎవరో ఒకరిని తండ్రిగా చూపించి ఆ నిధిని తీసుకోవాలని ప్రసాదు, అంజీ ప్లానువేసారు. ఆ సమయంలో, ఆనందరావు (అక్కినేని నాగేశ్వరరావు) అనే కోటీశ్వరుడు నగరం లోకి వస్తాడు. ఒకసారి అతను ఒక పండ్లు అమ్ముకునేవాడి లాగా మారువేషంలో ఉన్నప్పుడు ప్రసాదు తన దుస్థితిని వ్యక్తపరుస్తాడు. తన సిబ్బంది చేసిన మోసం కారణంగానే అతడు దివాలా తీయబోతున్నాడని ఆనందరావు తెలుసుకుంటాడు కూడా. దానికి పొరాయశ్చిత్తంగా అతడికి తండ్రిగా నటించేందుకు అంగీకరిస్తాడు, ఆ తర్వాత ఆనందరావు తెలివిగా ప్రసాదును కష్టాల నుండి బయట పడేస్తాడు. సుభద్రతో అతడి ప్రేమ సమస్యను కూడా పరిష్కరిస్తాడు. కొంత సమయం తరువాత, ఆనందరావును ఎప్పటికీ తన తండ్రి గానే ఉండమని ప్రసాద్ కోరినప్పుడు నిజాన్ని ధ్రువీకరిస్తాడు. హృదయపూర్వకంగా అతన్ని ఆలింగనం చేసుకుంటాడు.
అప్పుడు, అపార్థాల కారణంగా సంవత్సరాల క్రితం విడిపోయిన ఆనందరావు భార్య శారద (జయసుధ) తిరిగి వస్తుంది. వారి గతాన్ని తెలుసుకున్న ప్రసాదు, సుభద్రలు వారిని ఏకం చేయాలని నిర్ణయించుకుంటారు. కాని దురదృష్టవశాత్తు, ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. పరిస్థితిని వాడుకుంటూ ఆప్కో, చీలికను పెద్దది చేస్తాడు. సుభద్రను పెళ్ళి చేసుకోవడానికి ప్లాను వేస్తాడు. శారద కూడా తన తప్పును తెలుసుకున్నప్పుడు ఆనంద్ రావు మళ్ళీ ఓ నాటకమాడి వాస్తవాలను ప్రకటిస్తాడు. చివరగా, ప్రసాదు సుభద్రల వివాహంతో ఈ చిత్రం సంతోషకరంగా ముగుస్తుంది.
నటీనటులుసవరించు
సాంకేతిక సిబ్బందిసవరించు
- కళ: భాస్కర్ రాజు
- నృత్యాలు: తారా, డిఎస్కె బాబు, ప్రమీలా
- సంభాషణలు: ఎల్బీ శ్రీరామ్
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువన చంద్ర, సాహితి
- సంగీతం: వందేమాతం శ్రీనివాస్
- కథ: ఉషా కిరణ్ యూనిట్
- కూర్పు: నందమూరి హరిబాబు
- ఛాయాగ్రహణం: కోడి లక్ష్మణ్ రావు
- నిర్మాత: రామోజీ రావు
- స్క్రీన్ప్లే - దర్శకుడు: కోడి రామకృష్ణ
- బ్యానర్: ఉషా కిరణ్ మూవీస్
- విడుదల తేదీ: 1998
సంగీతంసవరించు
వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు. మయూరి ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.[4]
సంఖ్య. | పాట | గాయనీ గాయకులు | నిడివి | |
---|---|---|---|---|
1. | "దిల్ తో పాగల్ హై" | ఎస్పి బాలు, చిత్ర | 5:08 | |
2. | "హ్యాపీగున్నాను" | ఎస్పి బాలు | 4:41 | |
3. | "లవ్ పాఠాలు" | ఎస్పి బాలు, ఎస్పి చరణ్ | 4:59 | |
4. | "అందమైన గువ్వలు" | ఎస్పి బాలు, ఎస్పి చరణ్ | 4:39 | |
5. | "ప్యార్ కర్‌దో" | ఎస్పి బాలు, మాల్గాడి శుభ | 5:15 | |
6. | "జాంగ్రీ లాంటి పిల్లా" | మనో, చిత్ర | 4:08 |
మూలాలుసవరించు
- ↑ Daddy Daddy (Producer). Filmiclub.
- ↑ Daddy Daddy (Direction). Spicy Onion.
- ↑ Daddy Daddy (Cast & Crew). gomolo.com.
- ↑ Daddy Daddy (Songs). Cineradham.