డి.కె.జయరామన్ (డి.కె. గా సుప్రసిద్ధుడు), "కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయం" లో ఒకరైన డి.కె.పట్టమ్మాళ్ యొక్క సోదరుడు. ఆయన కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఆయనకు "సంగీత కళానిథి" అనే పురస్కారం ఆయన మరణానికి కొద్ది రోజుల ముందుగా వచ్చినది.[1] ఆయన తన సోదరి డి.కె.పట్టమ్మాళ్ వద్ద సంగీతాన్ని అభ్యసించిన తరువాత సంగీతంలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకొనుటకు ప్రసిద్ధ సంగీత విధ్వాంసులైన ముత్తయ్య భాగవతార్, పాపనాశం శివన్ వంటి గురువుల వద్ద చేరారు. ఆయన సోదరి వలెనే ముత్తుస్వామి దీక్షితుల సంగీత బాణీలను బాగా తెలుసుకున్నారు. ఆయన తమిళ పాటలను కూడా పాడారు.[2]

దామల్ కృష్ణస్వామి జయరామన్
డి.కె.పట్టమ్మాల్ తో ఆమె సోదరుడు డి.కె.జయరామన్(1940లలో)
వ్యక్తిగత సమాచారం
జననం(1928-07-29)1928 జూలై 29
మూలంకాంచీపురం,మద్రాసు ప్రెసిడెన్సీ, ఇండియా.
మరణం1991 జనవరి 18(1991-01-18) (వయసు 62)
తమిళనాడు,భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం, ప్లే బ్యాక్ సింగర్
వృత్తిగాయకుడు
క్రియాశీల కాలం1929–2009
లేబుళ్ళుHMV, EMI, RPG, AVM Audio, Inreco, Charsur Digital Workshop etc.

జీవిత విశేషాలు

మార్చు

తన 8 వ యేట,[1] డి.కె.జె పాపనాశం శివన్ వద్ద నేరుగా విద్యనభ్యసించారు. ఆయన శివన్ వద్ద 1973 లో మరణించే వరకు కొనసాగించారు.[1] ఆయన కొన్ని స్వరాలను కోటేశ్వర అయ్యర్,[1] తంజావూరు శంకర అయ్యర్,ఆర్.వేణుగోపాల్, వి.వి.శ్రీవత్స వద్ద కూడా నేర్చుకున్నారు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Rajendran, Sulochana (April 1991). "An Eternal Student - A Tribute". Shanmukha. XVII (2). Mumbai: Sri Shanmukhananda Fine Arts & Sangeetha Sabha: 37.
  2. "Carnatica biography". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-02.

ఇతర లింకులు

మార్చు