పండిట్ దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ ( 1921 మే 28 - 1955 అక్టోబరు 26 ) హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. ఆయన బాలమేధావి. భక్తి భజనల గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన పాడిన భజనలలో "పాయోజీ మైనే రామ్ రతన్ ధన్", మహాత్మాగాంధీకి ప్రీతిపాత్రమైన "రఘుపతి రాఘవ రాజారామ్" ప్రసిద్ధమైనవి.[1]

దత్తాత్రేయ విష్ణు పలుస్కర్
దత్తాత్రేయ విష్ణు పలుస్కర్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామందత్తాత్రేయ విష్ణు పలుస్కర్
మూలంనాసిక్, మహారాష్ట్ర
సంగీత శైలిహిందుస్తానీ శాస్త్రీయ సంగీతం
వృత్తిహిందుస్తానీ గాత్ర సంగీతకారుడు
క్రియాశీల కాలం1935 - 1955
లేబుళ్ళుహెచ్.ఎం.వి

బాల్యం, జీవితం మార్చు

డి.వి. పలుస్కర్ మహారాష్ట లోని నాసిక్లో జన్మించాడు. అతని తండ్రి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు విష్ణు దిగంబర్ పలుస్కర్ . డి.వి. పలుస్కర్ పదేళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకొనగా, ఆయన తండ్రి యొక్క శిష్యులైన పండిట్ వినాయక్ రావు పట్వర్ధన్, పండిట్ నారాయణ్‌రావ్ వ్యాస్లు అతనికి సంగీత శిక్షణ నిచ్చారు. పండిట్ చింతామన్ రావు పలుస్కర్, పండిట్ మిరాశీ బువాలు కూడా డి.వి. పలుస్కర్‌కు సంగీతాన్ని నేర్పినారు.

సంగీత ప్రస్థానం మార్చు

పలుస్కర్ తన పద్నాలుగవ యేట, పంజాబు లోని హర్‌వల్లభ్ సంగీత సమ్మేళన్లో తన తొలి సంగీత కచేరీ నిచ్చాడు. అతడు ముఖ్యంగా గ్వాలియర్ ఘరానా, గంధర్వ మహావిద్యాలయంకు చెందిన వాడైనా, ఇతర ఘరానాలలోని మంచి సంగతులను స్వీకరించేవాడు. ఆ తరంలో చాలామంది ఇతర సంగీతకారుల లాగే తన ఘరానా గాయకీని ఆపోసన పట్టిన తర్వాత ఇతర ఘరానాల నుండి స్వీకరించేందుకు స్వతంత్రించవచ్చని భావించాడు.[2] అతని గాత్రం మధురం; రాగాన్ని చాలా స్పష్టంగా పాడేవాడు. బంధిష్, తాన్లను అద్భుతంగా ఆలపించేవాడు. అతని మొదటి ఆల్బం 1944 లో విడుదలయింది. 1955 లో, భారతీయ కళాకారుడి హోదాలో చైనాను సందర్శించాడు. తన తండ్రిలాగే పలుస్కర్ భక్తిపరుడు. శాస్త్రీయ సంగీతాన్నే కాక, అతడు భజనలు కూడా పాడేవాడు. బైజూ బావ్రా సినిమాలో ఉస్తాద్ అమీర్‌ఖాన్తో కలిసి పాడాడు. బెంగాలీ సినిమా శాప్ మోచన్లో కూడా పాడాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

1955 అక్టోబరు 26 నాడు డి.వి. పలుస్కర్ మెదడు వాపు వ్యాధితో మరణించాడు.

ఆల్బంలు మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు