డి. రవీంద్ర నాయక్

ధరావత్ రవీందర్ నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్‌ ఎంపీగా పని చేశాడు.[1]

డి. రవీంద్ర నాయక్

ఎంపీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2008
ముందు బోడకుంటి వెంకటేశ్వర్లు
తరువాత ఎర్రబెల్లి దయాకర్ రావు
నియోజకవర్గం వరంగల్ లోకసభ నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1978 - 1985
ముందు బి.రామశర్మ
తరువాత బద్దు చౌహాన్
నియోజకవర్గం దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 15 ఆగష్టు 1952
మొండ్రాయి గ్రామం, కొడకండ్ల మండలం, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు డి.టి.నాయక్, జానకి బాయి
జీవిత భాగస్వామి నందా నాయక్
సంతానం ఇద్దరు కుమార్తెలు
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం సవరించు

రవీందర్ నాయక్ తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామంలో డి.టి.నాయక్, జానకి బాయి దంపతులకు 15 ఆగష్టు 1952లో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఏ పూర్తి చేశాడు. రవీందర్ నాయక్ 30 జులై 1978న నందా నాయక్ ను వివాహమాడాడు, వారికీ ఇద్దరు కుమార్తెలున్నారు.

రాజకీయ జీవితం సవరించు

రవీందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ అభ్యర్థి కేతావత్ హరియా పై 15674 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1983లో తిరిగి రెండోసారి 3160 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

రవీందర్ నాయక్ కొంతకాలం క్రియాశీలక రాజకీయలకు దూరంగా ఉంది తెలంగాణ మలిదశ ఉద్యమంలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి వరంగల్ లోకసభ నియోజకవర్గం పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బోడకుంటి వెంకటేశ్వర్లు పై గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[3] రవీంద్ర నాయక్ కొన్ని కారణాలు వల్ల టిఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ అధికార ప్రతినిధిగా పని చేశాడు.[4] ఆయన 4 సెప్టెంబర్ 2019న కాంగ్రెస్ పార్టీని విడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

మూలాలు సవరించు

  1. Loksabha (2004). "DHARAVATH, SHRI RAVINDER NAIK". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch (help)
  2. Onefivenine (2014). "Devarakonda Assembly Constituency". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  3. Sakshi (5 November 2018). "ఎమ్మెల్యే అయ్యారు.. ఎంపీ అయ్యారు !". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  4. Sakshi (21 May 2017). "'సీఎం కేసీఆర్‌ మాటల మాంత్రికుడు'". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  5. Sakshi (4 September 2019). "బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.