డెనిస్ ముక్వేగి

డెనిస్ ముక్వేగి (/mʊkˈweɪɡi/;[1] జననం 1 మార్చి 1955) కాంగోకు చెందిన స్త్రీ జననేంద్రియ వైద్యుడు, పెంతెకోస్తు పాస్టర్. అతను బుకావు లో పాన్జీ హాస్పిటల్ స్థాపించి, సాయుధ విప్లవకారులు లైంగిక దాడులు చేసిన మహిళలకు చికిత్స అందిస్తున్నారు.[2] 2018లో, ముక్వేగి, నదియా మురాద్‌లు "లైంగిక హింసను యుద్ధాల్లో, సాయుధ పోరాటాల్లో ఆయుధంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ప్రయత్నాలు"[3] గుర్తించి, నోబెల్ శాంతి బహుమతిని వారిద్దరికీ సంయుక్తంగా ప్రదానం చేసారు.

డెనిస్ ముక్వేగీ
జననం (1955-03-01) 1955 మార్చి 1 (వయసు 69)
బుకావు, బెల్జియన్ కాంగో
విద్యబురుండా విశ్వవిద్యాలయం (ఎండీ)
ఆంగెర్స్ విశ్వవిద్యాలయం (ఎంఏ)
యూనివర్శిటీ లిబ్రె దె బ్రక్సెలెస్ (PhD)
క్రియాశీల సంవత్సరాలు1983–ప్రస్తుతం వరకు
పురస్కారాలునోబెల్ శాంతి బహుమతి
హ్యూమన్ రైట్స్ ఫస్ట్
సివిల్ కరేజ్ బహుమతి
వాలెన్ బెర్గ్ మెడల్
రైట్ లైవ్లీహుడ్ బహుమతి
ఫోర్ ఫ్రీడమ్స్ పురస్కారం
టైమ్ 100
సఖారోవ్ బహుమతి
సియోల్ శాంతి బహుమతి
మానవ హక్కులకు సంబంధించి ఐరాస బహుమతి
ఓలాఫ్ పామ్ బహుమతి
గుల్బెన్ కియాన్ బహుమతి
లీజియాన్ ఆఫ్ ఆనర్

రెండవ కాంగో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచీ అత్యాచార బాధితులైన వేలాదిమంది మహిళలకు చికిత్స అందించాడు. వారిలో కొందరు ఒకసారికి మించి అత్యాచారానికి గురైనవారు. ఈ క్రమంలో ముక్వేగీ రోజుకు 17 గంటలు పనిచేస్తూ దాదాపు రోజుకు పది ఆపరేషన్ల వరకు చేశాడు.[2] ద గ్లోబ్ అండ్ మెయిల్ ప్రకారం ముక్వేగి "అత్యాచారం వల్ల ఏర్పడ్డ గాయాలను నయంచేయడంలో ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ నిపుణుడు కావచ్చు".

మూలాలు మార్చు

  1. "English pronunciation of Denis Mukwege", You tube, 29 October 2014.
  2. 2.0 2.1 "Doctor and Advocate: One Surgeon's Global Fight for the Rights of Rape Survivors". Pacific Standard. Archived from the original on 19 మార్చి 2018. Retrieved 19 March 2018.
  3. "Announcement" (PDF). The Nobel Peace Prize. Archived from the original (PDF) on 2018-10-05. Retrieved 2019-08-07.