డ్రాకులా (1931 సినిమా)

డ్రాకులా 1931, ఫిబ్రవరిలో విడుదలైన అమెరికా హర్రర్ సినిమా. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో టాడ్ బ్రౌంనింగ్ దర్శకత్వంలో బెలా లుగోసీ, హెలెన్ ఛాండ్లర్, డేవిడ్ మేనర్స్, డ్వైట్ ఫ్రే, ఎడ్వర్డ్ వాన్ స్లోన్ తదితరులు నటించిన ఈ చిత్రం, హామిల్టన్ డీన్, జాన్ ఎల్. బాల్డెస్టన్ 1924లో రాసిన డ్రాకులా నాటకం ఆధారంగా రూపొందించబడింది.[3] ఈ రెండింటికి బ్రిటీష్ అబ్రహం (బ్రామ్) స్టోకర్ 1897లో రాసిన డ్రాకులా అనే నవల మాలం.[4]

డ్రాకులా
డ్రాకులా సినిమా పోస్టర్
దర్శకత్వంటాడ్ బ్రౌంనింగ్
స్క్రీన్ ప్లేగారెట్ ఫోర్ట్
నిర్మాతటాడ్ బ్రౌంనింగ్, కార్ల్ లెంమెల్, జూనియర్.
తారాగణంబెలా లుగోసీ, హెలెన్ ఛాండ్లర్, డేవిడ్ మేనర్స్, డ్వైట్ ఫ్రే, ఎడ్వర్డ్ వాన్ స్లోన్
ఛాయాగ్రహణంకార్ల్ ఫ్రాండ్
కూర్పుమిల్టన్ కార్టుత్, మారిస్ పివార్
పంపిణీదార్లుయూనివర్సల్ పిక్చర్స్
విడుదల తేదీs
ఫిబ్రవరి 12, 1931 (1931-02-12)(న్యూయార్క్)
ఫిబ్రవరి 14, 1931 (యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
85 నిముషాలు[1]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషలుఇంగ్లీష్, హంగేరియన్
బడ్జెట్$355,000[2]

సాయంత్రం సమయంలో ఒక గుర్రపు బండిలో రెన్‌ఫీల్డ్ అనే వ్యక్తి డ్రాకులా భవంతికి వెలుతాడు. 500 సంవత్సరాలుగా ఆ భవనంలో రక్త పిశాచాలుగా ఉన్న డ్రాకులా, అతని ముగ్గురు భార్యలు అర్థరాత్రి శవ పేటికల్లోంచి లేచి రెన్‌ఫీల్డ్ ని చంపేసి అతని రక్తం తాగుతారు. అక్కడినుండి నౌకలో ఇంగ్లాండ్కు వెళుతూ ఆ నౌకలోని వారందరిని చంపేస్తారు. ఇంగ్లాండ్ వెళ్ళిన తరువాత అక్కడున్న వాన్ హాల్సింగ్ అనే ప్రొఫెసర్ డ్రాకులాను రక్త పిశాచిగా గుర్తించడంతో డ్రాకులా ఆ ప్రొఫెసర్ ను చంపబోతాడు. అది చూసిన హాల్సింగ్ తన చేతిలోని శిలువ (క్రాస్) ను డ్రాకులా ముందు చూపించగా, డ్రాకులా మాయం అవుతాడు.

నటవర్గం

మార్చు
  • బెలా లుగోసీ
  • హెలెన్ ఛాండ్లర్
  • డేవిడ్ మేనర్స్
  • డ్వైట్ ఫ్రే
  • ఎడ్వర్డ్ వాన్ స్లోన్
  • హెర్బర్ట్ బన్స్టన్
  • ఫ్రాన్సిస్ డేడ్
  • జోన్ స్టాండింగ్
  • చార్లెస్ కె. గెరార్డ్

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: టాడ్ బ్రౌంనింగ్
  • నిర్మాత: టాడ్ బ్రౌంనింగ్, కార్ల్ లెంమెల్, జూనియర్.
  • స్క్రీన్ ప్లే: గారెట్ ఫోర్ట్
  • ఆధారం: టీష్ అబ్రహం (బ్రామ్) స్టోకర్ 1897లో రాసిన డ్రాకులా అనే నవల, హామిల్టన్ డీన్, జాన్ ఎల్. బాల్డెస్టన్ 1924లో రాసిన డ్రాకులా నాటకం
  • ఛాయాగ్రహణం: కార్ల్ ఫ్రాండ్
  • కూర్పు: మిల్టన్ కార్టుత్, మారిస్ పివార్
  • పంపిణీదారు: యూనివర్సల్ పిక్చర్స్
 

చిత్రవిశేషాలు

మార్చు
  1. బెలా లుగోసి మొదట 1927లో డ్రాకులా నాటకంలో ‘డ్రాకులా’గా నటించి, విజయవంతంగా 261 ప్రదర్శనలు ఇచ్చాడు.
  2. ఈ చిత్రం విడుదలై విజయం సాధించిన తరువాత హాలివుడ్ లో ఇలాంటి చిత్రాల నిర్మాణం పెరిగింది.[3]
  3. ఈ సినిమాలో సంగీతం ఉపయోగించే వీలు ఉన్నప్పటికీ, చాలా సన్నివేశాల్లో సంగీతం పెట్టలేదు. సైలెన్స్, బ్లాక్ లండ్ వైట్ సినిమా ప్రేక్షకుల్ని మరింత భయపెడుతుందని యూనివర్సల్ పిక్చర్స్ వారి నమ్మకం.[3]
  4. 2017లో జరిగిన వేలంలో డ్రాకులా సినిమా పోస్టర్ $5,25,800 డాలర్లకు అమ్ముడుపోయింది.[5]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Dracula". The Film Daily (Volume 55) Jan–Jun 1931, February 15 Issue, Page 11.
  2. Michael Brunas, John Brunas & Tom Weaver, Universal Horrors: The Studios Classic Films, 1931–46, McFarland, 1990 p11
  3. 3.0 3.1 3.2 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 16.
  4. David J. Skal (2004). Hollywood Gothic: The Tangled Web of Dracula from Novel to Stage to Screen, Paperback ed. New York: Faber & Faber; ISBN 0-571-21158-5
  5. ఎన్.టివి తెలుగు, న్యూస్ (12 October 2018). "ఈ సినిమా పోస్టర్ విలువ మిలియన్ డాలర్లు..!!!". Archived from the original on 10 February 2019. Retrieved 10 February 2019.

ఇతర లంకెలు

మార్చు

ఆధార గ్రంథాలు

మార్చు