తగుళ్ళ గోపాల్

తగుళ్ళ గోపాల్ పల్లెజీవనానికి తనదైన పదాలతో అద్దం పట్టే ఒక తెలుగు యువ కవి. ఆయన 2021 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ‘యువ పురస్కారం’ కు ఎంపికయ్యాడు. తగుళ్ళ గోపాల్ కవితా సంకలనం " దండకడియం" సాహిత్య అకాడమీ యువ పురస్కారం కు ఎంపికయింది.[1]

తగుళ్ళ గోపాల్
జననంతగుళ్ళ గోపాల్
(1992-01-08) 1992 జనవరి 8 (వయసు 31)
కలకొండు గ్రామం, మాడ్గుల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
వృత్తికవి
రచయిత
మతంహిందూ
తండ్రితగుళ్ళ కృష్ణయ్య,
తల్లిఎల్లమ్మ
వెబ్‌సైటు
https://thagullagopal.blogspot.com/

జననంసవరించు

ఈయన జనవరి 8,1992 న పాత మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి ), మాడ్గుల మండలంలోని కలకొండ గ్రామంలో తగుళ్ళ కృష్ణయ్య, ఎల్లమ్మల దంపతులకు జన్మించాడు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగంసవరించు

రాజవర్థన్ రెడ్డి గారి దగ్గర ఉండి చదువుకున్నాడు.ఏడవతరగతి వరకు కలకొండలో,ఆ తరువాత APRS నాగార్జున సాగర్ లో పదవతరగతి పూర్తిచేశాడు.కల్వకుర్తిలోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ఇంటర్ చేశారు.హైద్రాబాద్ నేరెడ్ మెట్ లోని జిల్లావిద్యా శిక్షణాసంస్థ ప్రభుత్వకళాశాలలో డి.ఎడ్ పూర్తి చేశాడు.వెస్ట్ మారెడ్ పల్లిలోని విద్యాకిరణ్ టెక్నో స్కూల్లో రెండు సంవత్సరాలు తెలుగు బోధించాడు. 31.12.2012 రోజున ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమింపబడ్డాడు.

ప్రస్తుతం వెల్దండ మండలం అజిలాపురం గ్రామంలో ఉపాధ్యాయుడిగ పనిచేస్తున్నాడు.

అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటిలో డిగ్రి,పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లిలో ఎం.ఎ (తెలుగు) పూర్తి చేశాడు.

ప్రచురితమయిన మొదటి కవితసవరించు

ప్రచురితమయిన పుస్తకాల జాబితాసవరించు

2016లో "తీరొక్కపువ్వు" నానీల సంపుటి రచించాడు.

2019లో పల్లెజీవనం,మానవసంబంధాల నేపథ్యంలో "దండకడియం"కవిత్వం వెలువరించాడు.

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులుసవరించు

  1. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం-2021 [2]

మూలాలుసవరించు

  1. "Thagulla Gopal: పశువులు కాసి చదువుకొని..పేదరికాన్ని అక్షరబద్ధం చేసి". EENADU. Retrieved 2022-02-07.
  2. BBC News తెలుగు (30 December 2021). "తంగుళ్ల గోపాల్‌కు 'యువ పురస్కారం'". Archived from the original on 30 డిసెంబరు 2021. Retrieved 30 December 2021.

బయటి లంకెలుసవరించు