అనువాదం

(తర్జుమా నుండి దారిమార్పు చెందింది)
భారతీయ సాహిత్యాన్ని ఆంగ్లంలొకి అనువదించిన మాక్స్ ముల్లర్.

వేద వాక్య విభజన

మార్చు

వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు.[1] విధి యనగా విధాయక మని [2] గౌతమాచార్యులవారు న్యాయసూత్రములో జెప్పినారు. ఇట్లు చేయవలసినది యని యాజ్ఞాపించునది విధి. ' స్వారాజ్యకామో వాజపేయేన యజేత ' ( స్వర్గమును కోరువాడు వాజపేయ యఙమును జేయవలసినది ) అనునది విధివాక్యము. ఒకానొక కార్యమును స్తుతించి, లేక నిందించి, భయము కలిగించి, పూర్వచరిత వర్ణించి బోధించునట్టివాక్యము అర్థవాదవాక్య మనబడును. ' పాకకారీ పాపో భవతి ' ( పాపము చేయువాడు పాపుడైపోవును ) అనునది అర్థవాదము. ఇందు నాజ్ఞ స్పష్టముగా నుండదు. విధివాక్యము జెప్పినదానిని మరల జెప్పుట అనువాదం.

అనువాద రకములు SWAROOP

మార్చు
అనువాదము రెండు విధములు

శబ్దానువాదము, అర్థానువాదము. ఇదివరకు జెప్పిన మాటలను మరల జెప్పుట శబ్దానువాదము. ఇదివరకు దెలిసిన విషయమునే మరల నన్యపదములతో జెప్పుట అర్థానువాదము. 'అనువాదే చరణానాం' (2.4.3) అను పాణినీయసూత్రముమీద టీక వ్రాయుచు గాళికాకారుడు 'ప్రమాణాంతరావగతస్యార్థస్య శబ్దేన సంకీర్తనమాత్ర మనువాదః' అని వ్రాసియున్నాడు. వేణుప్రమాణముచే సిద్ధించినయర్థమును (సంగతిని) శబ్దముచే జెప్పుటమాత్రము అనువాద మనబడును. 'అగ్ని ర్హి మస్య భేషజం ' (అగ్ని చలికి మందు) అనునది యనువాదము. ఏల? ప్రత్యక్ష ప్రమాణముచే నీసంగతి మన మెరుగుదుము. అజ్ఞానమును ఈవాక్య మనువదించింది.

అనువాదము మరల మూడు విధములు.

భూతార్థానువాదము, స్తుత్యర్థానువాదము, గుణానువాదము. ' సదేవ సౌమ్యేద మగ్ర ఆసిత్ ' (ఓ సౌమ్య ! మొదట సత్తే ఉండెను) అనునది మొదటి దానికి ఉదాహరణము. 'వాయుర్వైక్షేపిష్ఠా దేవతా' (వాయువు క్షేపిష్ఠయైన దేవతసుమా) యన్నది స్తుత్యర్థానువాదము. ' దధ్నా జుహోతి ' (పెరుగుతో హోమము చేయుచున్నాను) అనునది గుణానువాదము.

వేదమును నమ్మని బౌద్ధాది పూర్వపక్షులు వేదమునందు నుండు అనువాదవాక్యములు పిష్టపేషణన్యాయమున బునరుక్తములు గనుక వేదమునకు గౌరవహాని కలుగుచున్నది యని యాక్షేపించిరి. అందులకు గౌతమాచార్యులవారు "అనువాదములు పునరుక్తములు కావు. అవే శబ్దములు మాల వచ్చినను వానికి నర్థభేద ముండును. వ్యవహారమునందు మొదట 'గచ్ఛా (పో) అని మరల 'గచ్ఛ, గచ్ఛా (పో, పో) అని దానినే అనువదించినప్పటికిని రెండవ తడవ నుచ్చరించిన 'గచ్ఛ గచ్ఛా పదములకు శీఘ్రముగా పొమ్మని యర్థ మగుచున్నది. అట్లే వైదికము లగు అనువాదములకును విధి వాక్యముల కంటె భిన్నార్థ ముండును. కావున నవి పునరుక్తములు కావు" అని గౌతముడు చెప్పియున్నాడు.

దీనిమీద వాత్స్యాయను డిట్లు భాష్యము వ్రాసినాడు. " విహితమైన యథమును మరల నేల చెప్పవలె నన్న అధికారార్థము ( చెప్పబోవు విషయ మిది యని తెలియుటకు ), విహిత మైనదానిని నిందించుటకుగాని, స్తుతించుటకుగాని, విధి శేషముగ గాని చెప్పబడును. విహితార్థమునము దరువాత వచ్చినదికూడ ననువాదమగును...లోకమునందును అనువాదము కలదు. ' వండు వండు ' అని చెప్పుట కలదు. అందులకు ద్వరగ వండు మని కాని, దయచేసి వండు మని కాని (అధ్యేషణ ), తప్పక వండు మని కాని (అవధారణ) అర్థ మగుచున్నది.

పైన వర్ణించిన మూడువిధములైన వాక్యములలో విధి వాక్యములే ప్రమాణములు గాని మిగిలిన రెండు విధము లైన వాక్యములును ప్రమాణములు కా వని కొందరు పూర్వపక్షము చేసెదరు.

అనువాద ఎల్లలు

మార్చు

అనువాదం ప్రస్తుతం బాగా పలుకుబడి పొందుతున్న ప్రక్రియ. ఇందులో ఎన్ని అవకాశాలున్నాయో అన్ని ఎల్లలూ ఉన్నాయి.

అనువాదం కొత్త ప్రపంచానికి తెరచే సరికొత్త వాకిలి. అనువాదకుడికి కేవలం రెండు భాషల లిపులతో పరిచయమున్నంతమాత్రాన సరిపోదు. ఆయాభాషల వాడుకదారుల సాంస్కృతిక జీవనంతో పరిచయముండాలి. అనువాదంలోని రకాల జోలికి వెళ్ళకుండా, అనువాదానికున్న ఎల్లల గురించి తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా వివిధ భాషా, సంస్కృతుల ప్రజల జీవన విధానాన్ని వాటితో ఏ మాత్రం సబంధం లేని అంటే, ఏక దేశ లేదా ఏకీకృత సంస్కృతీ వివరాలు, ఆచార్య వ్యవహారాదుల్లో పూర్తిగా భిన్నమైనవి కాని భాషలమధ్య అనువాదం సులభమని. అయితే, పూర్తిగా వేరు పరిస్థితులుంటే అనువాదం కష్టమనీ, ఒక అభిప్రాయం ఉంది. అయితే, సోదర భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాది భాషల్లో పరస్పర అనువాదంలోనూ చాలా కష్టాలున్నాయి. అందువల్లే అనువాదానికి ఎల్లలున్నాయని చెప్పవచ్చు.

ఉదాహరణలు

మార్చు

మూలాలు

మార్చు
  1. ' విద్యర్థవాదానువాద వచనవినియోగాత్ ' - గౌతమ, 2. 1. 63
  2. ' విధిర్విధాయకః ' 2. 1. 64)

వనరులు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

వనరులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అనువాదం&oldid=4032948" నుండి వెలికితీశారు