తల్లీ కూతుళ్ళు
తల్లీ కూతుళ్ళు 1971 నవంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. అన్నపూర్ణ కంబైన్స్ పతాకం కింద టి.క్రాంతి కుమార్, పి.రాఘవరావు లు నిర్మించిన ఈ సినిమాకు జి.రామినీడు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, కొంగర జగ్గయ్య, సావిత్రి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1]
తల్లీ కూతురు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.రామినీడు |
---|---|
తారాగణం | శోభన్ బాబు , సావిత్రి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ కంబైన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు,
- కొంగర జగయ్య,
- సావిత్రి గణేశన్,
- కాంచన,
- రాజబాబు,
- వై. విజయ,
- అల్లు రామలింగయ్య,
- రమాప్రభ,
- రావు గోపాల్ రావు,
- నిర్మల
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత: టి.క్రాంతి కుమార్, పి.రాఘవరావు;
- సినిమాటోగ్రాఫర్: జి.కె. రాము;
- ఎడిటర్: అంకి రెడ్డి వేలూరి;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
- లిరిసిస్ట్: సి. నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ, ఆరుద్ర, రోహిణి దేవి
- కథ: వి.హెచ్.ప్రసాద్;
- సంభాషణ: బొల్లిముంత శివరామకృష్ణ
- గానం: పి. సుశీల, ఎల్ .ఆర్. ఈశ్వరి, కె. జమునా రాణి, కౌసల్య, రమోల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చక్రవర్తి (సంగీతం)
- ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వరరావు;
- నృత్య దర్శకుడు: బి. హీరాలాల్, పసుమర్తి కృష్ణ మూర్తి, చిన్ని-సంపత్, రాజు (డ్యాన్స్), శేషు, మలేషియా మహాలింగం
- నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ కంబైన్స్
- విడుదల:05:11:1971.
పాటల జాబితా
మార్చు1.గానమే ప్రాణమై మౌనమే ధ్యానమే రాధ ఎన్నాళ్ళుగా వేచెనో, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పి. సుశీల
2.మల్లెతీగ నడిచిందా మెరుపు తీగ నిలిచిందా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితా రాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
3.సిగ్గులేని మావయ్య రామచిలక పైట లాగాడు, రచన: రోహిణీదేవీ, గానం.కె.జమునా రాణి
4.హరి ఓం తత్ సత్ హరి ఓం కృష్ణా అయ్యెరామా, రచన: ఆరుద్ర, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
5.అహవయసు అందాల నది భలే హుషారుగా పొంగింది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
6.ఓ చిట్టి చిట్టి బేబీ ఓ పొట్టి పొట్టి బాబీ చిలకల్లాగ నవ్వాలి, రచన: సి నారాయణ రెడ్డి, గానం.చక్రవర్తి
7.బుట్టశ్రీ చేటశ్రీ పంపుశ్రీ మేకుశ్రీ బద్దకశ్రీ నేడు మురికి భక్షణ దినం, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.చక్రవర్తి బృందం
మూలాలు
మార్చు- ↑ "Thalli Kuthullu (1971)". Indiancine.ma. Retrieved 2024-06-19.
. 2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.