ప్రధాన మెనూను తెరువు

తల్లోజు ఆచారి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు[1].

తల్లోజు ఆచారిటి.ఆచారి

వ్యక్తిగత వివరాలు

జననం (1966-06-06) 1966 జూన్ 6 (వయస్సు: 53  సంవత్సరాలు)
ఆమనగల్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసము ఆమనగల్
మతం హిందూ,

జీవిత విశేషాలుసవరించు

ఆయన జూన్ 6, 1966న ఆమన‌గల్ లో జన్మించారు. ఆయన తండ్రి రాములు. ఆయన ఎం.వి.యస్.కళాశాల,మహబూబ్ నగర్ లో ఇంటర్మీడియట్ చదివారు[2].తరువాత బి.ఎ. పట్టభద్రుడైనారు. ఆయన భార్య గీత.[3] ఆచారి మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు[4]. 2014 శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసారు.[5]

రాజకీయ ప్రస్థానంసవరించు

1986లో ఆచారి ఆమన‌గల్ పంచాయతి వార్డు సభ్యునిగా విజయంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1996లో ఆమనగల్ పంచాయతి సర్పంచిగా ఎన్నికై ఐదేళ్ళు పదవిలో ఉన్నారు. 1999, 2004, 2009లలో భారతీయ జనతా పార్టీ తరఫున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేశారు. 2004లో రెండోస్థానంలో నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి కృషిచేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో మరోసారి అదేస్థానం నుంచి పోటి చేసి స్వల్ప ఓట్ల తేడాలో రెండవ స్థానంలో నిలిచారు.ఫిబ్రవరి 28న జాతీయ ఓబీసీ కమీషన్ సభ్యులుగా రాష్ట్రపతి రాంనాథ్ కొవింధ్ గారు నియమించడం జరిగినది.[6]

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు