తాండూరు కోట తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లోని తాండూరు గ్రామంలో ఉన్న కోట.[1]

తాండూరు కోట
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లోని తాండూరు, తెలంగాణ
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరంసా.శ. 1309
కట్టించిందిగోండు రాజులు
వాడిన వస్తువులురాతి

కోట చరిత్ర మార్చు

సా.శ. 1240 నుంచి 1750 వరకు చంద్రాపూర్ నుంచి ఆదిలాబాద్‌ జిల్లా మధ్య ప్రాంతాన్ని వీరు పాలించిన గోండురాజులు 15, 16 శతాబ్దాల మధ్యకాలంలో మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండల పరిధిలో ఈ కోటను నిర్మించారు. అంతేకాకుండా ఆదిలాబాద్‌ నుంచి చంద్రాపూర్‌ వరకు కూడా ఇలాంటి అనేక కోటలను వారు నిర్మించారు.[2]

కోట విశేషాలు మార్చు

సముద్రమట్టానికి 507 మీటర్ల ఎత్తులో ఈ కోట నిర్మించబడింది. 1860లో గోండుజాతి అనేకసార్లు బ్రిటిషుపై తిరుగుబాటు చేసింది. కొమురం భీమ్ కూడా వచ్చి కొన్నిరోజులపాటు ఈ కోటలో తల దాచుకున్నాడు.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 October 2019. Retrieved 7 October 2019.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (20 January 2018). "శిథిలావస్థలో 'చరిత్ర'". www.andhrajyothy.com. Archived from the original on 18 November 2019. Retrieved 18 November 2019.