తాడిబోయినవారిపాలెం

డిబోయినవారిపాలెం, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ పంచాయతీ మార్చు

తాడిబోయినవారిపాలెం గ్రామం చుక్కపల్లివారిపాలెం పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ గంగమ్మ తల్లి (దేవర) అలయం:- ఈ గ్రామంతోపాటు పేరుకలపూడి గ్రామంలో గూడా చాలా మందికి గంగమ్మ తల్లి ఆరాధ్య దైవం. ఆ తల్లి చల్లని చూపులు ఎల్లప్పుడూ తమపై ఉంటుందని వీరి విశ్వాసం. తమకు కష్టం వచ్చినప్పుడల్లా అ దేవికి మొక్కుకుంటారు. అ తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. అందువలన ఆ దేవర పేరుని తమ పిల్లలకు పెట్టుకుంటారు. వీరిలో ఎక్కువ పేర్లు గంగమ్మ, గంగయ్య, గంగాధరరావు అని ఉండటం సహజం. [1]

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.