తిరప్

అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లోని 17 జిల్లాలలో తిరప్ జిల్లా ఒకటి. ఈ జిల్లా సరిహద్దులో నాగాలాండ్, అస్సాం, అంతర్జాతీయంగా మయన్మార్, రాష్ట్రంలోని చంగ్‌లంగ్, లంగ్‌డింగ్లు ఉన్నాయి.

Tirap జిల్లా
Arunachal Pradesh లో Tirap జిల్లా స్థానం
Arunachal Pradesh లో Tirap జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్య పట్టణంKhonsa
విస్తీర్ణం
 • మొత్తం2,362 కి.మీ2 (912 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1,11,997[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత52.2%[1]
 • లింగ నిష్పత్తి931[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

తిరప్ ప్రాంతంలో పూర్వం స్థానిక గిరిజనులు నివసిస్తూ ఉండేవారు. 16వ శతాబ్దంలో అహోం పాలనా కాలంలో ఇక్కడకు నొక్టే ప్రజలు వచ్చి స్థిరపడ్డారు. 1945లో ఈ ప్రాంతం జపానీయుల ఆక్రమితప్రాంతంగా కొంతకాలం ఉంది. జపనీయుల సామ్రాజ్యం పతనం అయ్యే వరకు ఇది కొనసాగింది. తరువాత " సుమన్ గోప్ " పాలన మొదలైంది. తరువాత తిరప్ నాగాతిరుగుబాటు దారుల లక్ష్యంగా మారింది. గ్రేటర్ నాగాలాండ్ లక్ష్యంగా సైనికపరంగా ఈ దాడులు సాగాయి. నాగా తిరుగుబాటు దారులకు బాప్టిస్ట్ మిషనరీలు సహాయం అందించారు.[2]

1887 నవంబరు 14 న తిరప్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి చంగ్‌లంగ్ జిల్లా రుఇపొందించబడింది. 2013లో తిరప్ లోని మరికొంత భూభాగం వేరుచేసి లాంగ్‌డింగ్ జిల్లా రూపొందించబడుంది .[3]

భౌగోళికంసవరించు

తిరప్ జిల్లా వైశాల్యం 2,362 చ.కి.మీ.[4] ఇది కెనడా లోని కార్న్‌వాల్ ద్వీపం వైశాల్యానికి సమానం.[5] ఈ ప్రాంతం సముద్రమట్టానికి 200 నుండి 4,000 మీటర్ల (పత్కై కొండలు) ఎత్తులో ఉంది.

విభాగాలుసవరించు

  • తిరప్ జిల్లాలో అరుణాచల్ ప్రదేశం లెజిస్లేటివ్ శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి : నాంసాంగ్, తూర్పు ఖొంస, పశ్చిమ ఖొంస, బోర్డురియ-బోగాపని.

ఇవి అరుణాచల్ ఈస్ట్ పార్లమెంటరీ విభాగంలో భాగంగా ఉన్నాయి.[6]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 111,997,[1]
ఇది దాదాపు. గ్రెనడా దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 613వ స్థానంలో ఉంది. .[1]
1చ.కి.మీ జనసాంద్రత. 13 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.63%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 931:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 52.23%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

తిరప్ జిల్లాలో నాగాగిరిజన జాతికి చెందిన నొక్టే ప్రజలు అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో నొక్టే ప్రజలతో నాగాలకు చెందిన కొన్యాక్, వింకో ప్రజలు కూడా ఉన్నారు. వీరు సంప్రదాయకంగా హిందూయిజం, అనిమిజం ఆచరిస్తుంటారు. ప్రస్తుతం వీరంతా క్రైస్తవ మతం అనుసరిస్తున్నారు. అల్పసంఖ్యాకులు అయిన తుస్తా, తంగ్సా, సింగ్పొ ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు, పండుగ సందర్భాలలో నొక్టే ప్రజలు లోకు, వింకో ప్రజలు ఒరియా, తుస్తా ప్రజలు పొంగ్తు ఉత్సవాలు అత్యుత్సాహంగా నిర్వహిస్తుంటారు. వీటితో దుర్గా పూజ కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు.

అరుణాచల ప్రదేశ్లో క్రైస్తవ మతం ప్రచారం తిరప్ జిల్లా నుండి మొదలైంది. బోర్డురియా గ్రామం మొదటగా 2004లో కాథలిక్ చర్చి సిల్వర్ జూబ్లి ఉత్సవం జరుపుకుంది. గుర్తించతగిబంత మంది హిందూ నొక్టేలు క్రమంగా క్రైస్తవమతానికి మారుతున్నారు. ప్రత్యేకంగా ఖొంసా ప్రాంతంలో ఇది అధికంగా జరిగింది.

విద్యసవరించు

తిరప్ జిల్లాలో " రామక్రిష్ణా మిషన్ స్కూల్ " ఉంది. ఇది తిరప్ వాసులు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-14. Retrieved 2014-07-15.
  3. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: extra text: authors list (link)
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11. Cornwall Island 2,358km2 horizontal tab character in |quote= at position 16 (help)
  6. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011. Check date values in: |archive-date= (help)
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Grenada 108,419 July 2011 est. line feed character in |quote= at position 8 (help)

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=తిరప్&oldid=2985812" నుండి వెలికితీశారు