తిరుక్కండియూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుక్కండియూర్
తిరుక్కండియూర్ is located in Tamil Nadu
తిరుక్కండియూర్
తిరుక్కండియూర్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:హర శాపం తీర్త పెరుమాళ్(హర శాపనాశకర్)
ప్రధాన దేవత:కమలవల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:కపాలాక్ష్ల తీర్థాము
విమానం:కమలాకృతి విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:అగస్త్యునకు

విశేషాలు మార్చు

రుద్రుని చేతియందు గల కపాలమును నేలపడునట్లు అనుగ్రహించిన స్థలము. సన్నిధికి 1 కి.మీ దూరములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సన్నిధులు ఉన్నాయి. ఈ క్షేత్ర సమీపములో కల్యాణపురమున శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి ఉంది.

సాహిత్యం మార్చు

శ్లో. నిత్యం భాతి కపాల తీర్థ రుచిరే శ్రీకండియూర్ పట్టణే
   వైమానే కమలాకృతా స్థితియుత: ప్రాచీముఖాలంకృత:|
   నాయక్యా హర శాప నాశక విభు శ్శ్రీపద్మ వల్ల్యా శ్రిత:
   ప్రత్యక్షో వర కుంభ సంభవ మునే: కీర్త్య: కలిద్వేషిణ: ||

పాశురం మార్చు

పా. పిణ్డియార్ మణ్‌డై యేన్ది ప్పిఱర్ మనై తిరి తన్దుణ్డుమ్‌
    ముణ్డియాన్; శాపయ్ దీర్త ఒరువనూర్; ఉలగమేత్తుమ్‌
    కణ్డియూర్; అరజ్గమ్ మెయ్యమ్ కచ్చిపేర్‌మల్లై యెన్ఱు
    మణ్డినార్; ఉయ్యలల్లాల్ మట్రనయార్కు ఉయ్యలామే?
            తిరుమంగై ఆళ్వార్-తిరుక్కుఱున్దాణ్డగమ్‌ 19

 
వీధి వీక్షణ
 
ఆలయ ఆవరణ

భగవంతుని కృపకు పాతృలైన వారు మార్చు

వివిధ జాతులలో జన్మించియు భగవంతుని కృపకు పాత్రులైన వారు:-

  1. గుహప్పెరుమాళ్.
  2. శబరి.
  3. జటాయు మహారాజు.
  4. సుగ్రీవాది వానరులు.
  5. అయోధ్యా వాసులైన చరాచరము.
  6. చిన్తయన్తియను గోపిక.
  7. దధిభాణ్డు అను గొల్లవాడు.
  8. వాని పెరుగు బాన.
  9. కుబ్జ.
  10. సుదాముడను మాలా కారుడు.
  11. ఘంటా కర్ణుడు.
  12. శ్రీకృష్ణునకు భోజనమిడిన ఋషి పత్నులు.
  13. ప్రహ్లాదాళ్వార్.
  14. విభీషణుడు.
  15. గజేంద్రళ్వాన్.
  16. గరుడునకు భయపడి భగవంతుని శరణు వేడిన సుముఖ మను సర్పము.
  17. శ్రీకృష్ణుని ఆశ్రయించిన గోవిందస్వామి.
  18. మార్కండేయుడు.

చేరే మార్గం మార్చు

తంజావూరు నుండి తిరువయ్యారు పోవుటౌను బస్‌లో పోవలెను. వసతులు లేవు. తంజావూరులోనే బసచేయవలెను

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
హర శాపం తీర్త పెరుమాళ్ (హర శాపనాశకర్) కమలవల్లి తాయార్ కపాలాక్ష్ల తీర్థాము తూర్పు ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ కమలాకృతి విమానము అగస్త్యునకు

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు