తిరుచ్చెంకున్నూర్

తిరుచ్చెంకున్నూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

త్రిచిట్టట్ మహావిష్ణు దేవాలయం, చెంగన్నూరు
తిరుచ్చెంకున్నూర్
తిరుచ్చెంకున్నూర్ is located in Kerala
తిరుచ్చెంకున్నూర్
తిరుచ్చెంకున్నూర్
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఇమయవరప్పన్
ప్రధాన దేవత:శెంగమలవల్లి
దిశ, స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:శంఖ పుష్కరిణి హ్రస్వాపగా నది(దీనిని తిరుచ్చిత్తార్ అంటారు)
విమానం:జగజ్ఱ్యోతి విమానం
కవులు:నమ్మాళ్వార్
ప్రత్యక్షం:భస్మాసుర కారణంగా పరమశివునకు

విశేషాలు మార్చు

సంసారులు స్వప్రయోజనపరులు. స్వామి యందు సుంతయేని ప్రేమలేనివారు. అట్టి సంసారుల మధ్యలో స్వామి అవతరించినాడే! ఈస్వామి కేమగునో యని ఆళ్వార్లు భయపడినారు. ఆళ్వార్ల భయమును గమనించిన స్వామి తన శౌర్యవీర్యాదులను ప్రదర్శించి మీకేమియు భయము వలదు. నిర్బరులై యుండుడనిరి. ఆశౌర్య గుణమును "కజ్జనైత్తగర్‌త్త శీర్‌కొళ్" (కంసుని చంపిన శౌర్యగుణము గలస్వామి) యని కొండాడిరి. (8-1-1)

సాహిత్యం మార్చు

శ్లో. చెంకున్ఱూర్ నగరే తు శంఖ సరసీ హ్రస్వాపగా సంయుతే|
   వైమాసం సమధిశ్రిత స్థితిలసన్ దివ్యం జగద్యోతిషమ్|
   నాయక్యా నిమిష: ప్రభుర్విజియతే పశ్చాన్ముఖాంభోరుహే
   యుక్త శ్శంగమలాభిధా సహితయా శ్రీ మచ్చఠారి స్తుత:||

   భస్మాసుర నిమిత్తేన శశిభూషణ వీక్షిత:
   భక్తబృంద పరిత్రాణ కాముక స్సతతం హరి:||

పాశురాలు మార్చు

పా. వార్‌కడావరుని యానై మామలైయిన్; మరుప్పిణైక్కువడిఱుత్తురుట్టి
    ఊర్‌కొళ్ తిణ్బాగ నుయిర్ శెగుత్త రజ్గి మల్లరై క్కొన్ఱు శూழ் వరణ్‌మేల్
    పోర్ కడావరశర్ పుఱక్కిడ; మాడమీమిశైక్క--నై త్తగర్‌త్త,
    శీర్‌కొళ్ శిత్తాయన్ తిరుచ్చెజ్గన్ఱూరిల్; తిరుచ్చిత్తాఱెజ్గళ్ శెల్ శార్వే.
                నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-4-1

చేరే మార్గం మార్చు

తిరువనంతపురమున స్వామిని సేవించి అటనుండి బయలుదేరి "వర్కలా" స్టేషనులో దిగి "జనార్థన" క్షేత్రమును సేవించి అచట నుండి కొట్టార్కరై స్టేషనులో దిగవలెను. ఈ కొట్టార్కరైకు 50 కి.మీ. దూరములో బస్సుమార్గమున ఈ శెంగణూర్ ఉంది. "త్రివేండ్రం" "ఎర్నాకులం" (వయా) కొల్లం రైల్వేలైనులో శెజ్గనూర్ స్టేషన్. అన్ని వసతులు ఉన్నాయి. ఈ శెంగణూర్ నుండి అయిదు దివ్యదేశములను సేవింపవచ్చును.

శెంగణూర్ నకు తూర్పున 10 కి.మీ.దూరమున-తిరువారన్ విళై. నైఋతి 5 కి.మీ. దూరమున తిరుప్పులియూర్, వాయవ్యం 5 కి.మీ. దూరమున తిరువణ్ వణ్డూరు ఉత్తరం 10 కి.మీ. దూరమునతిరువల్లాయ్, 25 కి.మీ. దూరమున తిరుక్కుడిత్తానం క్షేత్రములు గలవు

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లింకులు మార్చు