తిరుమూళక్కళమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుమూళక్కళమ్
తిరుమూళక్కళమ్ is located in Kerala
తిరుమూళక్కళమ్
తిరుమూళక్కళమ్
Location within Kerala
భౌగోళికాంశాలు :10°11′16″N 76°19′40″E / 10.18778°N 76.32778°E / 10.18778; 76.32778
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:తిరుమూళిక్కళత్తాన్ (అప్పన్, శ్రీసూక్తి నాథన్)-
ప్రధాన దేవత:మధురవేణి త్తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:పెరుంకొళ తీర్థం
విమానం:సౌందర్య విమానము
కవులు:తిరుమంగై యాళ్వార్
ప్రత్యక్షం:హారీతునకు

విశేషాలు మార్చు

నమ్మాళ్వార్లు ఈ స్వామియొక్క మార్దవ గుణమును కీర్తించారు. ఈ దివ్యదేశమునకు వళత్తిన్ కళమ్‌ (తి.మొ.7-1-6) అను విలక్షణమైన పేరుంది. తిరువాయిమొళిలో నాలుగు వైవిధ్యమైన స్తుతులు ఉన్నాయి.

  1. తమ దోషములను సహింపగల క్షమాగుణమును గుర్తుచేయుచు అజ్జిరైయ మడనారాయ్ (1-4-1) అను దశకములో వ్యూహమూర్తి కీర్తించబడ్డాడు.
  2. "వైకల్‌పూంగళివాయ్" అను దశకమున సర్వేశ్వరుని ఆర్త రక్షణ దీక్షను గుర్తుచేయుచు విభవమూర్తి కీర్తించబడ్డాడు. విషయమై దూతప్రేషణ చేయబడింది.
  3. "పొన్నులగాళిరో" అను దశకమున సర్వేశ్వరుని రసజ్ఞతా గుణమును గుర్తుచేయుచు పరవాసుదేవుని విషయముగను అంతర్యామి విషయముగను కీర్తించబడ్డాడు.
  4. "ఎంగానలగమ్‌ కళివాయ్" అను దశకమున సర్వేశ్వరుని సౌందర్యాతి శయమును గుర్తుచేయుచు అర్చావతార మూర్తిగా కీర్తించబడ్డాడు.

సాహిత్యం మార్చు

శ్లో. సరసీం తు పెరుకొళాభిధాం తిరుమూழிక్కళ పట్టణే శ్రితే
   సురనాథ దిశాముఖ స్థితి ర్వర సౌందర్య విమాన మందిర:||

శ్లో. మధురవేణిరమా నయనప్రియో నిజపురాహ్వయ వా నవనే శ్రుతు:
   హరితనామ మహాముని వీక్షితో విజయితే శఠవైరి పరిస్తుత:||

పాశురాలు మార్చు

పా. ఎజ్గానలగజ్కழிవాయ్; ఇరై తేర్‌న్ది జ్గీనిదమరుమ్;
    శెజ్గాల మడనారాయ్; తిరుమూழிక్కళత్తుఱైయుమ్;
    కొజ్గార్ పూన్తుழாయ్ ముడి; యెజ్కుడక్కూత్తర్ క్కెన్ తూదాయ్;
    నుజ్గాల్ గ ళెన్ తలై మేల్; కెழுమీరో నుమరోడే;
            నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-7-1

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
తిరుమూళిక్కళత్తాన్ (అప్పన్, శ్రీసూక్తి నాథన్) - మధురవేణి త్తాయార్ పెరుంకొళ తీర్థం తూర్పు ముఖము నిలుచున్న భంగిమ తిరుమంగై యాళ్వార్ సౌందర్య విమానము హారీతునకు

చేరే మార్గం మార్చు

ఆల్‌వాయ్ టౌన్ నుండి బస్సు ఉంది. బస్టాండు సమీపంలోనే సన్నిధి ఉంది. ఎర్నాకుళం నుండియు రావచ్చును 10 కి.మీ

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు