తిరుమోగూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుమోగూర్
కాలమేగపెరుమాళ్
కాలమేగపెరుమాళ్
తిరుమోగూర్ is located in Tamil Nadu
తిరుమోగూర్
తిరుమోగూర్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :9°57′3.69″N 78°12′25.56″E / 9.9510250°N 78.2071000°E / 9.9510250; 78.2071000
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కాలమేఘ పెరుమాళ్
ప్రధాన దేవత:తిరుమోగూర్ వల్లి తాయార్, మేఘవల్లి(మోహన వల్లి)
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:క్షీరాబ్ది పుష్కరిణి
విమానం:కేతకి విమానం(మోహన విమానం)
కవులు:నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:బ్రహ్మ, రుద్ర, ఇంద్రులకు

విశేషాలు మార్చు

ఇచ్చట శ్రీ భూసమేతులైన క్షీరబ్దిశాయి పెరుమాళ్ల సన్నిధి గలదు. (పళ్లికొండ పెరుమాళ్) షోడశ బాహు సుదర్శన పెరుమాళ్ సన్నిధియు కలదు

పేరువెనుక చరిత్ర మార్చు

అమృతమును పంచు నిమిత్తమై మోహినీ అవతారము దాల్చిన స్వామి దేవతల ప్రార్థన నంగీకరించి కాళమేఘ పెరుమాళ్లుగా అవతరించుటచే ఈక్షేత్రమునకు మోహనపురమని పేరు వచ్చింది.

విశేషాలు మార్చు

సన్నిధి ప్రక్కన గల క్షీరాబ్ది పుష్కరిణి ఉంది. తాళతామరై నది ఇచట ప్రవహించుచున్నది. సన్నిధిలో ప్రసాదము లభించును.ఇచట వేంచేసియున్న చక్రత్తాళ్వార్ మిక్కిలి ప్రభావ సంపన్నులు.

ఉత్సవాలు మార్చు

వృషభం విశాఖ తీర్థోత్సవము

సాహిత్యం మార్చు

శ్లో. మోకూర్ నామ్నిపురే పయోబ్ధి సరసీ సంశోభితే ప్రాజ్ముఖ:
   స్థాయీ మేఘలతా పరిష్కృత వపు శ్శ్రీకాళమేఘప్రభు:|
   శ్రీమత్కేతక దేవయాన వనతి ర్విద్యోతతే పద్మభూ
   రుద్రేంద్రాదిమ సేవిత:కలిజిత:పాత్రం శఠారేస్త్సుతే:||

పాశురాలు మార్చు

పా. తాళతామరై త్తడమణివయల్ తిరుమోగూర్
   నాళుమేని నన్గమర్‌న్దు నిన్ఱు అశురరై త్తగర్‌క్కుమ్‌;
   తోళునాన్గుడై చ్చురికుழ்ల్‌కమలక్కణ్ కనివాయ్
   కాళమేగత్తై యన్ఱి మతొన్ఱిలజ్గదియే.

   ఇడర్ కెడవెమ్మై ప్పోన్దళియా యెన్ఱెన్ఱేత్తి;
   శుడర్ గొళ్ శోతియై త్తేవరుమ్‌ మునివరుమ్‌ తొడర
   పడర్ కొళ్ పామ్బణై ప్పళ్లికొళ్వాన్ తిరుమోగూర్‌,
   ఇడర్‌కెడ వడిపరవుదుమ్‌ తొణ్డీర్ నమ్మినే.
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 10-1-1,4

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
కాలమేఘ పెరుమాళ్ తిరుమోగూర్ వల్లి తాయార్, మేఘవల్లి (మోహన వల్లి) - క్షీరాబ్ది పుష్కరిణి తూర్పు ముఖము నిలుచున్న భంగిమ నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కేతకి విమానం (మోహన విమానం) బ్రహ్మ, రుద్ర, ఇంద్రులకు

చేరే మార్గం మార్చు

మధురకు 10 కి.మీ. మధుర నుండి టౌన్ బస్ సౌకర్యం ఉంది. మధుర నుండి "మేలూరు" వెళ్లుబస్‌లో ఒత్తక్కఱై అనుచోట దిగి అట నుండి (నడచిగాని) తిరువాదవూర్ వెళ్లుబస్‌లో 11/2 కి.మీ. వెళ్లిన సన్నిధి చేర వచ్చును

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు