తుమ్మలపల్లి (నాంపల్లి)

తెలంగాణ, నల్గొండ జిల్లా, నాంపల్లి (నల్గొండ జిల్లా) మండలం లోని గ్రామం

తుమ్మలపల్లి, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నాంపల్లి మండలంలోని గ్రామం.[1]

తుమ్మలపల్లి
—  గ్రామ పంచాయితి  —
తుమ్మలపల్లి is located in తెలంగాణ
తుమ్మలపల్లి
తుమ్మలపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°49′06″N 79°00′13″E / 16.818368°N 79.003730°E / 16.818368; 79.003730
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం నాంపల్లి
ప్రభుత్వం
 - సర్పంచ్ కొలుకులపల్లి చెన్నయ్య
జనాభా (2011)
 - మొత్తం 1,667
 - పురుషుల సంఖ్య 832
 - స్త్రీల సంఖ్య 835
పిన్ కోడ్ 508373
ఎస్.టి.డి కోడ్ 08692
వెబ్‌సైటు: http://www.thummalapally.org

ఇది మండల కేంద్రమైన నాంపల్లి నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండ నుండి 52 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం గతంలో రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది.ఆ తర్వాత రేవెల్లి నుంచి తుమ్మలపల్లి, ఫకీర్ పురం గ్రామాలను వేరు చేస్తూ తుమ్మలపల్లి గ్రామపంచాయతీని ఏర్పాటు చేశారు.2019లో జరిగిన గ్రామపంచాయతి విభజన చట్టం ద్వారా పకీర్ పురం విడిపోయి తుమ్మలపల్లి గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ జనాభా మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 259 ఇళ్లతో, 1160 జనాభాతో 998 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 597, ఆడవారి సంఖ్య 563. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 414 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 577278[3].పిన్ కోడ్: 508373.

సమీప గ్రామాలు మార్చు

తుమ్మలపల్లి గ్రామానికి ఉత్తరం వైపున వెంకటాపురం, దక్షిణం వైపున రేవెల్లి, తూర్పున పాశంవారిగూడెం, పడమర మేళ్ళవాయి గ్రామాలున్నాయి. ఈశాన్య మూలన సుల్తాన్పురం, ఆగ్నేయాన శాఖాజీపురం గ్రామ సరిహద్దులుగా ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు నాంపల్లిలో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల నాంపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు దేవరకొండలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నల్గొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల దేవరకొండలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు నల్గొండలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

తాగు నీరు మార్చు

గ్రామంలో 220 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రధానంగా పంగోనిబండ బోరు నుంచి వచ్చే మంచి నీటిని ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా మూడు లైన్లకు రోజు విడచి రోజు మంచినీరు సరపరా అవుతుంది. టెంపుల్ బోరు ద్వారా పాటిమీదికి నీరు సరపరా అవుతుంది. ఇవి కాకుండా నెల్వలపల్లి నుంచి వచ్చే కృష్ణా నీరు 3 GLSR ట్యాంకుల ద్వారా మూడు,నాలుగు రోజుల కొకసారి సరపరా అవుతుంది.

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

కొండమల్లేపల్లి నుంచి గుమ్మడవల్లి మీదుగా 15 కిలోమీటర్లు, పాల్వాయి నుంచి గ్రామానికి 10కిలోమీటర్లు భిటి రోడ్డు మార్గం ఉంది. మండల కేంద్రమైన నాంపల్లి 10 కిలోమీటర్లు భిటి రోడ్డు ఉంది. మేళ్ళవాయికి 5 కిలోమీటర్లకు గాను కిలోమీటరు మెటల్ రోడ్డు ఉంది. పాశంవారిగూడెం, శాఖాజీపురం, సుల్తాన్ పురానికి డొంకబాటలు ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

విద్యుద్దీపాలు మార్చు

గ్రామంలో మొత్తం 80 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్థంబానికి విద్యుత్ దీపం అమర్చి నాలుగు చోట్ల ఆన్ - ఆఫ్ స్విచ్ లను ఏర్పాటు చేశారు. కేవలం రాత్రిపూట మాత్రమే ఇక్కడ వీధి లైట్లు వెలుగుతాయి. ఇందుకు గ్రామ పంచాయతీ అదనంగా మరో వరస కేబుల్ ఏర్పాటు చేసింది. మండలంలో మరే గ్రామంలోను ఇలాంటి ప్రత్యేకత లేదు.

భూమి వినియోగం మార్చు

తుమ్మలపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 25 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 47 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 11 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 83 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 293 హెక్టార్లు
  • బంజరు భూమి: 469 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 65 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 781 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 48 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

తుమ్మలపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 48 హెక్టార్లు

పంచాయితీ సర్పంచులు మార్చు

  • కొలుకులపల్లీ చెన్నయ్య (2019-2023)
  • గుమ్మడపు రామలక్ష్మి (2013 - 2019)
  • దండిగ నాగమణి (2005-2010)
  • దండిగ వెంకటయ్య (2000-2005)
  • అన్నెపాక లచ్చయ్య (1996-2000)

మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మార్చు

  • దండిగ వెంకటయ్య ( 2000-2005 )
  • అన్నెపాక లచ్చయ్య ( 1995 -2000)
  • గోన గోవిందరావు ( 1990-1995 ఏకగ్రీవం)
  • వాదాసు నర్సింహా ( 1985 - 1990 )
  • గోన గోవిందరావు ( 1985 ముందు ఏకగ్రీవం)

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు మార్చు

పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయం

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు) మార్చు

1) గోన గోవిందరావు - మాజీ సర్పంచ్ 25 సంవత్సరాలు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పేరు మోసిన సారా కంట్రాక్టర్.

2) గుమ్మడపు నరసింహారావు - 1999 లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు (ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆడ శిశువుల అమ్మకాలను వెలుగులోకి తెచ్చారు.ఎలిమినేటి మాదవరెడ్డి ప్రాజెక్టు (SLBC) ప్రాజెక్టు పనుల పురోగతికి కృషి చేసాడు. సంక్షోభ నిలయాలు - సంక్షేమ హాస్టళ్ళు సీరియల్ వార్తలతో వసతి గృహాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పాటు పడ్డాడు.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు మార్చు