తుర్కయాంజల్

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.
(తుర్కయంజల్ నుండి దారిమార్పు చెందింది)

తుర్కయాంజాల్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామం జిల్లా సరిహద్దులో ఉంది. ఇది ఈ మండలంలో పెద్ద గ్రామం. తుర్కయాంజల్ గ్రామ పరిధిలో మణిముత్యాలమ్మ కుంట, సంజీవరెడ్డి నగర్, శ్రీశ్రీ నగర్, కుర్మగూడ ఉప గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న తుర్కయంజల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

తుర్కయాంజల్
—  రెవెన్యూ గ్రామం  —
తుర్కయాంజల్ is located in తెలంగాణ
తుర్కయాంజల్
తుర్కయాంజల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°16′17″N 78°35′00″E / 17.271512°N 78.583399°E / 17.271512; 78.583399
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం అబ్దుల్లాపూర్ మెట్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,903
 - పురుషుల సంఖ్య 4,650
 - స్త్రీల సంఖ్య 4,253
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[3]

గణాంకాలు మార్చు

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 8903 పురుషులు 4650, స్త్రీలు 4253. నివాస గృహాలు 1927, విస్తీర్ణం 2053 హెక్టార్లు. ప్రధాన భాష తెలుగు.

రవాణ సౌకర్యాలు మార్చు

ఈ గ్రామం హైదరాబాదు - నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపైనున్నందున ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది. హయత్ నగర్ ఇక్కడికి 9 కి.మీ దూరంలో ఉంది. రోడ్డు సౌకర్యం ఉంది.

పాఠశాలలు మార్చు

ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఒక అంగన్ వాడీ కేంద్రం ఉంది. సెయింట్ పాల్ స్కూలు, కె.బి.సైనిక హైస్కూలు ఉన్నాయి.

ఇతర గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామంలో ఒక బిస్కట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ వేంకటేశ్వరస్వామి దేవాలయం, బాలఏసు మందిరం అనే చర్చి ఉంది.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. https://www.census2011.co.in/data/town/574202-turkayamjal-andhra-pradesh.html
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)

వెలుపలి లింకులు మార్చు