తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ దళిత కవి.
జీవిత విశేషాలుసవరించు
ఏలూరులో హైస్కూల్ విద్య, విజయవాడలో డిగ్రీ, మనీలాలో ఎం.బి.ఎ చదివిన అతను ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో డెరైక్టర్‌గా బెంగళూరులో పనిచేస్తున్నాడు.[1] అతను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా జపాన్, దుబాయి, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలలో పనిచేశాడు. అప్పటి కేంద్ర మంత్రి జగ్మోహన్ తో కలిసి ఉత్తర ఆసియా దేశాలలో పర్యటించి చైనా నుంచి ఇండియాకు మోస్ట్ ఫేవర్డ్ డెస్టినేషన్ సాధించడంలో కృషిచేశాడు. దక్షిణ కొరియా, ఒసాకాలో జరిగిన ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ సమావేశాలలోనూ, దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ మినిస్టీరియల్ సమావేశంలోనూ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2010లో జరిగిన కామన్ వెల్త్ క్రీడలకోసం జోహన్స్‌బర్గ్, కేప్‌టౌన్ లలో క్వీన్స్ బేటన్ ర్యాలీని దేశం తరపున నిర్వహించాడు. హాంగ్ కాంగ్ నుంచి ఇండియాకు విమానం వేయడంలో ముఖ్యపాత్ర వహించాడు.[2]
2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజీ అనే మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని అమానుషంగా హింసించి, హత్యచేసిన వైనం మరాఠీయులకు అతను రాసిన కవిత ‘సూది బెజ్జంలో ఒంటెలు’ ద్వారా తెలిసింది. దాని గురించి తెలుగు మిత్రులద్వారా తెలుసుకున్న మహారాష్ట్ర దళితులు ‘ఖైర్లాంజీ’ సంఘటనపై ఉద్యమించారు[1].
రచనలుసవరించు
తెలుగులో దళిత వ్యాకరణం, మాకూ ఒకభాష కావాలి[3] కవిత్వ సంకలనాలను ప్రచురించారు. 2011లో మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొన్నారు.
పురస్కారాలుసవరించు
- పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పురస్కారం
- ప్రతిష్టాత్మక ఫ్రీ వెర్స్ ఫ్రంట్ పురస్కారం 2014
- విమలాశాంతి పురస్కారం
- విజయవాడ వారి క్రైస్తవ పురస్కారం
- గిడుగు రామమూర్తి పురస్కారం 2018
- ↑ 1.0 1.1 "ప్రశ్నించడమే దళిత కవిత్వం..." Sakshi. 2015-01-02. Retrieved 2019-07-14.
- ↑ సుధాకర్, తుల్లిమల్లి విల్సన్. "తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, Author at Rasthamag.com". Rasthamag.com. Archived from the original on 2019-07-14. Retrieved 2019-07-14.
- ↑ "దళిత కవిత్వపు వెలుగు రవ్వ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ !". సారంగ. 2013-10-02. Retrieved 2019-07-14.[permanent dead link]