తెలంగాణ అధికారిక చిహ్నం
తెలంగాణ అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది, ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ, అంతరవృత్తం చిలకపచ్చ రంగులో ఉంటాయి. వాటి మధ్యలో పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లంలో, దాని కింద తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. మధ్య వృత్తంలో కాకతీయ కళా తోరణం, దాని మధ్యలో చార్మినార్ గుర్తు, దానిపై మూడు సింహాల చిహ్నం ఉంటాయి. బాహ్య వలయం దిగువన "సత్యమేవ జయతే" అని ఉంటుంది. నాలుగున్నరకోట్ల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ, పచ్చని తెలంగాణ నూటికినూరుపాళ్లు ప్రతిబింబించేలా ఈ లోగోను ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించారు.
రాజముద్రలో భావం
మార్చుతెలంగాణ సర్కారు కోసం రూపొందించిన లోగోలో దేశభక్తి, సంస్కతి, సంప్రదాయాలు, చరిత్రతో పాటు మానవ మనుగడ వంటి అనేక అంశాలు మిళితమయ్యాయి. అందరూ కోరుకునే బంగారు తెలంగాణను గుర్తుచేసేందుకు బంగారు వర్ణంతో వలయం. నాలుగు సింహాల చిహ్నం, అశోకుడి విజయచక్రంతో పాటు అందమైన ఔటర్ లైన్లు కనిపిస్తాయి.
తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పదాలు స్పష్టంగా దర్శనమిస్తాయి. దిగువన సత్యమేవ జయతే అని సంస్కృతంలో కూడా పొందుపరిచారు. కాకతీయుల కళావైభవాన్ని స్ఫురించే తోరణం, ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే బతుకుకు చిహ్నంగా నిర్మించిన చార్మినార్ గుర్తులు లోగోలో నిండిపోయాయి. లోగో ఏ సైజులో ఉన్నా వీక్షించేందుకు స్పష్టత సంతరించుకుంది. ఇంక్‌తో ముద్రవేస్తే అచ్చుగుద్దినట్లే ఉండేందుకు అనువుగా దీని రూపు సంతరించుకుంది.
ఏలె లక్ష్మణ్ అభిప్రాయాలు
మార్చుతెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపొందించిన ఈయన తన లోగో రూఫొందించడానికి గల కారణాలను వివరించారు. బంగారు తెలంగాణ సాధించినందుకు గుర్తుగా బంగారు వలయాన్ని వేశారు. కాకతీయుల వైభవానికి చిహ్నంగా తోరణాన్ని వేసి పాడిపంటలు పండాలని అభిలషించారు. అలాగే హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది చనిపోయినప్పుడు జీవితాలను గుర్తుచేస్తూ నిర్మించిన చార్మినార్‌ను జోడించారు. ప్రతి మనిషి సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నదే తన అభిమతంగా వివరించారు. లోగోలో పచ్చని రంగు డామినేట్ చేస్తుంది. అది శాంతికి గుర్తుగా భావిస్తాం. తెలంగాణ కూడా ఎల్లప్పుడూ శాంతితో వర్ధిల్లాలి. రెండు రంగులతోనే రాజముద్రను పూర్తి చేశారాయన.[1]
మూలాలు
మార్చు- ↑ "నమస్తే తెలంగాణ పత్రికలో ఆయన వ్యాఖ్య". Archived from the original on 2014-05-30. Retrieved 2014-05-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)