తెలంగాణ వైద్య విధాన పరిషత్తు
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టిజివివిపి) తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగం.[1]
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు | |
---|---|
సంస్థ వివరాలు | |
స్థాపన | జూన్ 2, 2014 |
అధికార పరిధి | తెలంగాణ ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | డిఎం, హెచ్ఎస్ క్యాంపస్, సుల్తాన్ బజార్, హైదరాబాదు, తెలంగాణ |
సంబంధిత మంత్రి | ఈటెల రాజేందర్, (వైద్య ఆరోగ్య మంత్రివ్వ శాఖ) |
కార్యనిర్వాహకులు | డా. బి. శివ ప్రసాద్, (ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్) |
వెబ్‌సైటు | |
https://vvp.telangana.gov.in |
ఏర్పాటు
మార్చు1986 చట్టం ద్వారా స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 2014, జూన్ 2న వేరుచేయబడి ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఏర్పడింది.[2]
విధులు
మార్చు30 నుండి 350 వరకు మంచాలు గల మధ్యస్థాయి ఆసుపత్రుల బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఈ ఆసుపత్రులలోని వైద్యులు, ఇతర సిబ్బందిని తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఉద్యోగాల ద్వారా భర్తీ చేస్తుంది.[3]
కార్యకలాపాలు
మార్చుతెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఈ క్రింది అంశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది.[4]
- ఆసుపత్రి భవనాల నిర్వహణ, పారిశుధ్యం
- ప్రధాన, చిన్న పరికరాల సదుపాయం, నిర్వహణ, పర్యవేక్షణ
- మందులు, వినియోగ వస్తువుల సదుపాయం
- ప్రమోషన్లు, సీనియారిటీ, బదిలీలు, పోస్టింగ్‌లు, శిక్షణలు, క్రమశిక్షణ చర్యలు మొదలైన అన్ని ఉద్యోగుల సేవా అంశాలు
- ఆసుపత్రుల పనితీరు సమీక్ష
- ఆర్థిక కేటాయింపు
పరిధి
మార్చుతెలంగాణలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 103 ఏరియా ఆసుపత్రులు, 8 జిల్లాస్థాయి ఆసుపత్రులు, 233 ఆయుర్వేద, 260 యునాని ఆసుపత్రులు దీని పరిధిలో ఉన్నాయి.[5]
మూలాలు
మార్చు- ↑ "Welcome to Commissionerate of Health Family Welfare". Archived from the original on 2015-05-01. Retrieved 2020-08-23.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ ఆంధ్రజ్యోతి (13 March 2018). "వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విభజన". www.andhrajyothy.com. Archived from the original on 23 August 2020. Retrieved 23 August 2020.
- ↑ More doctors for Telangana hospitals
- ↑ "TVVP ACTIVITIES". vvp.telangana.gov.in. Archived from the original on 2018-07-27. Retrieved 2020-08-24.
- ↑ "TELANGANA VAIDYA VIDHANA PARISHAD". vvp.telangana.gov.in. Archived from the original on 2018-07-27. Retrieved 2020-08-23.
ఇతర లంకెలు
మార్చుతెలంగాణ వైద్య విధాన పరిషత్తు అధికారిక వెబ్సైటు Archived 2020-11-30 at the Wayback Machine