తెలుగులో అనువాద సాహిత్యం

అనువాదం అంటే సంస్కృత భాషలో పునఃకథనం అని అర్థం. ఒకరు చెప్పిన దానిని మరొకరు చెప్పడం అన్నమాట. ఆధునిక యుగంలో ఒక భాషలో చెప్పిన విషయాన్ని మరొక భాషలో చెప్పడం అనే ప్రక్రియకు "అనువాదం" అనే పేరు స్థిరపడిపోయింది. భారతీయ భాషలనుండి, విదేశీ భాషల విశ్వసాహిత్యం నుండి తెలుగులోనికి ఆదాన ప్రదానాలు జరిగాయి. అయితే తెలుగు భాషలోకి అనువాదం అయినట్లుగా, తెలుగు నుండి ఇతర భాషలలోని అనువదింపబడిన రచనలు తక్కువ అనే చెప్పాలి. అనువాదాలను మూలరచనను యథాతథంగా తెలుగులోనికి తర్జుమా చేయడం ఒక పద్ధతి కాగా ఆ మూల రచన సారం చెడకుండా స్వేచ్ఛానుసరణ చేయడం ఇంకొక పద్ధతి. తెలుగు అనువాద సాహిత్యాన్ని స్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. భారతీయ సాహిత్యం నుండి తెలుగుభాషలోనికి అనువాదాలు ఒక భాగంకాగా, విదేశీభాషా సాహిత్యం నుండి తెలుగులోనికి చేయబడిన అనువాదాలు మరొక భాగం.

భారతీయ సాహిత్య అనువాదాలు మార్చు

ఇతర భారతీయ భాషలనుండి తెలుగులోనికి అనువాదమైన కొన్ని గ్రంథాలు:

ప్రక్రియ మూల రచన వెలువడిన భాష మూల రచన పేరు మూల రచయిత పేరు తెలుగు అనువాదంపేరు తెలుగు అనువాదకుని పేరు ఇతర వివరాలు
నవల బెంగాలీ అసమయ్ బిమల్ కర్ సమయం కాని సమయం మద్దిపట్ల సూరి
నవల బెంగాలీ అరణ్యక్ బిభూతి భూషణ్ బెనర్జీ వనవాసి సూరంపూడి సీతారామ్
నవల బెంగాలీ ఆత్మజ మహాశ్వేతాదేవి సూరంపూడి సీతారామ్
కావ్యం తమిళం శిలప్పదికారం కళ్యాణ మంజీరాలు కౌముది అమృత్‌లాల్ నాగర్ చేసిన హిందీ అనువాదానికి తెలుగు అనుసృజన.
నవల ఉర్దూ ఆగ్ కా దరియా ఖుర్రతుల్ ఐన్ హైదర్ అగ్నిధార వేమూరి రాధాకృష్ణమూర్తి
నవల కన్నడ అనాది అనంత అద్య రంగాచార్య అనాది అనంతం కె.సుబ్బరామప్ప
నవల హిందీ ప్రేత్ బోల్తేహై / సారా ఆకాశ్ రాజేంద్ర యాదవ్ ఆకాశం సాంతం నిఖిలేశ్వర్
నవల తమిళం సిల నేరంగలిల్, సిల మణితర్గల్ జయకాంతన్ కొన్ని సమయాల్లో కొందరు మనుషులు మాలతీ చందూర్
నవల కన్నడ గృహభంగ ఎస్.ఎల్.భైరప్ప గృహభంగం సంపత్
నవల తమిళం పదునెట్టువదు లక్షతగళు అశోక మిత్రన్ జంట నగరాలు జి.సి.జీవి

విశ్వసాహిత్య అనువాదాలు మార్చు

విదేశీ సాహిత్యం నుండి తెలుగు లోనికి అనువాదమైన కొన్ని గ్రంథాలు:

ప్రక్రియ మూల రచన వెలువడిన భాష మూల రచన పేరు మూల రచయిత పేరు తెలుగు అనువాదంపేరు తెలుగు అనువాదకుని పేరు ఇతర వివరాలు
నవల రష్యన్ యామా ది పిట్ అలెగ్జాండర్ కుప్రిన్ యమకూపం రెంటాల గోపాలకృష్ణ
నవల రష్యన్ ది మదర్ మాక్సిం గోర్కీ అమ్మ క్రొవ్విడి లింగరాజు
నవల ఇంగ్లీషు ఎ టేల్ అఫ్ టు సిటీస్ చార్లెస్ డికెన్స్ రెండు మహానగరాలు తెన్నేటి సూరి
నవల రష్యన్ అన్నా కెరినినా టాల్‌స్టాయ్ రెంటాల గోపాలకృష్ణ
నవల ఇంగ్లీషు రూట్స్ - ద సాగా ఆఫ్ ఏన్ అమెరికన్ ఫ్యామిలీ అలెక్స్ హేలీ ఏడు తరాలు సహవాసి
నవల రష్యన్ ద ఇన్సల్టెడ్ అండ్ ద ఇన్జూర్డ్ దాస్తొయెవ్‌స్కీ తిరస్కృతులు సహవాసి
నవల జర్మన్ ద బ్రీడ్ ఆఫ్ దోజ్ ఎర్లీ ఇయర్స్ హెన్రీచ్ బోల్ ఆకలి చేసిన నేరం వేల్చేరు నారాయణరావు
నవల ఇంగ్లీషు స్పార్టకస్ హోవర్డ్ ఫాస్ట్ స్పార్టకస్ ఆకెళ్ళ కృష్ణమూర్తి
నవల రష్యన్ వార్ అండ్ పీస్ టాల్‌స్టాయ్ సమరము - శాంతి బెల్లంకొండ రామదాసు,
రెంటాల గోపాలకృష్ణ
నవల ఇంగ్లీషు గాన్ విత్ ద విండ్ మార్గరెట్ మిఛెల్ చివరకు మిగిలింది? యం.వి.రమణారెడ్డి
నాటకం రష్యన్ ది చెర్రీ ఆర్చర్డ్ అంటోన్ చెకోవ్ సంపెంగతోట అబ్బూరి వరదరాజేశ్వరరావు,
శ్రీశ్రీ
నాటకం ఇంగ్లీష్ ది ప్రిన్స్ హూవాజ్ ఎ పైపర్ హెరాల్డ్ బ్రిగ్‌హౌజ్ ప్రతిమాసుందరి అబ్బూరి వరదరాజేశ్వరరావు
జీవిత చరిత్ర ఇంగ్లీషు ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కం ఎక్స్ అలెక్స్ హేలీ అసుర సంధ్య - మాల్కం ఎక్స్‌ ఆత్మకథ యాజ్ఞి

ఇవీ చదవండి మార్చు

మూలాలు మార్చు