తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం.[1] భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]

ప్రతిభా పురస్కారాలు
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2019
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

పురస్కారాలు

మార్చు
  1. 2012 ప్రతిభా పురస్కారాలు: 2012 సంవత్సర ప్రతిభా పురస్కార గ్రహీతలు జాబితా (12మంది)ను 2013, డిసెంబరు 17న తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించింది. వీరికి 2013లో పురస్కారం అందజేశారు.[3]
  2. 2013 ప్రతిభా పురస్కారాలు: 2013 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2014లో పురస్కారం అందజేశారు.
  3. 2014 ప్రతిభా పురస్కారాలు: 2014 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు.[4] వీరికి 2016, జూలై 14న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు.[5]
  4. 2015 ప్రతిభా పురస్కారాలు: 2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016, డిసెంబరు 20న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలు అందజేశారు.[6][7]
  5. 2017 ప్రతిభా పురస్కారాలు: 2017 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[8]
  6. 2018 ప్రతిభా పురస్కారాలు: 2018 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[9]
  7. 2019 ప్రతిభా పురస్కారాలు: 2019 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[10][11]
  8. 2021 ప్రతిభా పురస్కారాలు: 2021 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[12]

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి (15 November 2018). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 15 November 2018. Retrieved 2022-07-07.
  2. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 2017-09-09. Retrieved 2022-07-07.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-16. Retrieved 2022-07-07.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (29 June 2016). "తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు". www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 2022-07-07.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (29 June 2016). "తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు". www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 2022-07-07.
  6. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 2022-07-07.
  7. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 2022-07-07.
  8. ఆంధ్రజ్యోతి (15 November 2018). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 15 November 2018. Retrieved 2022-07-07.
  9. "12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు". Sakshi. 2021-12-08. Archived from the original on 2021-12-08. Retrieved 2023-01-28.
  10. "12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు". EENADU. 2022-08-30. Archived from the original on 2022-09-08. Retrieved 2022-09-08.
  11. "PSTU: 2019 తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రకటన". Sakshi Education. 2022-08-30. Archived from the original on 2022-09-08. Retrieved 2022-09-08.
  12. "తెలుగువర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రకటన". EENADU. 2023-08-19. Archived from the original on 2023-08-19. Retrieved 2023-09-13.

ఇతర లంకెలు

మార్చు
  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine