తెల్లాపూర్ పురపాలకసంఘం
తెల్లాపూర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] తెల్లాపూర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
తెల్లాపూర్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండలం | రామచంద్రాపురం |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | మల్లేపల్లి లలిత |
- వైస్ చైర్‌పర్సన్ | బలాగౌని రాములు |
జనాభా (2011) | |
- మొత్తం | 24,193 |
- పురుషుల సంఖ్య | 12,400 |
- స్త్రీల సంఖ్య | 11,793 |
- గృహాల సంఖ్య | 6,570 |
పిన్ కోడ్ - 502032 | |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న తెల్లాపూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
మార్చుతెల్లాపూర్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°02′38″N 78°16′01″E / 18.044°N 78.267°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 27 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సంగారెడ్డి నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 24193 మంది కాగా, అందులో 12400 మంది పురుషులు, 11793 మంది మహిళలు ఉన్నారు. 6570 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 17 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం మల్లేపల్లి లలిత చైర్‌పర్సన్‌గా, బలాగౌని రాములు వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
మార్చు- పావని ప్రసన్న
- మల్లెపల్లి లలిత
- రెడ్డి సరిత రెడ్డి
- నాగవీర బాలాజీ
- లచ్చిరామ్
- కమ్మెత జ్యోతి
- నాగరాజు
- భరత్ కుమార్
- భానురి మంజుల
- కంజార్ల శ్రీషైలం
- అంతగిరిపల్లి చిట్టి
- వర్దయరామ్ సింగ్
- మయూరి
- శంషాబాద్ రాజు
- రాములు గౌడ్
- ఒగ్గు సుచరిత
- రవీందర్ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ "Tellapur Municipality". tellapurmunicipality.telangana.gov.in. Archived from the original on 9 ఆగస్టు 2020. Retrieved 18 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 18 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 18 April 2021.
- ↑ "Basic Information of Municipality, Tellapur Municipality". tellapurmunicipality.telangana.gov.in. Archived from the original on 9 అక్టోబరు 2020. Retrieved 18 April 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 18 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 18 April 2021.
వెలుపలి లంకెలు
మార్చు- తెల్లాపూర్ పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2020-08-09 at the Wayback Machine