మోనాలీసా, లియోనార్డో డావిన్సీ, సుమారుగా1503-06

తైలవర్ణ చిత్రలేఖనం (ఆయిల్ పెయింటింగ్) అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమఅవిసె నూనె (లిన్సీడ్ ఆయిల్)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమఅవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్) లేదా ఫ్రాంకిన్‌సెన్స్ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధభరితమైన జిగురు రెసిన్) వంటి ఒక రెసిన్‌తో వేడిచేస్తారు; వీటిని 'వార్నిషులు' అని పిలుస్తారు, ఇవి వాటి ఆకృతిని నిలిపివుంచే గుణం మరియు తళుకు వంటి లక్షణాలకు కీర్తించబడుతున్నాయి. గసగసాల నూనె (పాపీసీడ్ ఆయిల్), అక్రోటుకాయ నూనె (వాల్‌నట్ ఆయిల్) మరియు కుసుంభ నూనె (సాఫ్లవర్ ఆయిల్) వంటి ఇతర తైలాలను కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటారు. తైల వర్ణచిత్రానికి ఈ తైలాలు తక్కువగా పసుపు రంగులోకి మారడం లేదా వివిధ ఆరిపోయే సమయాలు వంటి వివిధ గుణాలను అందిస్తాయి. తైలం ఆధారంగా వర్ణచిత్రాల జిలుగులో కొన్ని వ్యత్యాసాలు కూడా కనిపిస్తాయి. చిత్రకారులు తరచుగా ఒకే వర్ణచిత్రంలో ప్రత్యేక వర్ణద్రవ్యాలు మరియు వాంఛిత ప్రభావాలు ఆధారంగా వివిధ తైలాలను ఉపయోగిస్తారు. మాధ్యమం ఆధారంగా వర్ణచిత్రాలు వాటంతటవే ఒక నిర్దిష్ట అనుగుణతను అభివృద్ధి చేస్తాయి.

ఐదు మరియు తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లో మొదటిసారి తైల వర్ణద్రవ్యాన్ని ఉపయోగించినప్పటికీ, 15వ శతాబ్దం వరకు దీనికి ప్రాచుర్యం లభించలేదు. మధ్యయుగంలో దీని వినియోగం పశ్చిమ దేశాలకు విస్తరించినట్లు భావనలు ఉన్నాయి. తైల వర్ణద్రవ్యం యొక్క ప్రయోజనాలకు విస్తృత గుర్తింపు లభించడంతో, చివరకు ఇది కళాఖండాలు సృష్టించేందుకు ఉపయోగించే ప్రధాన మాధ్యమంగా మారింది. ఈ సంప్రదాయం ఉత్తర ఐరోపాలో ప్రారంభ నెదర్లాండ్ చిత్రలేఖనంతో మొదలైంది, పునరుజ్జీవనోద్యమ ఉన్నతి సమయానికి తైలవర్ణ చిత్రలేఖన పద్ధతులు ఐరోపాలోని అనేక దేశాల్లో టెంపెరా వర్ణద్రవ్యాల స్థానాన్ని పూర్తిగా ఆక్రమించాయి.

పద్ధతులుసవరించు

 
ఆండెర్స్ జోర్న్, స్వీయ చిత్రణ 1897

సాంప్రదాయిక తైలవర్ణ చిత్రలేఖన పద్ధతులు తరచుగా కళాకారుడు కాన్వాస్‌పై బొగ్గు లేదా పలచని వర్ణద్రవ్యంతో వస్తువు యొక్క స్థూల రూపం గీయడంతోపాటు ప్రారంభమవతాయి. పలచని, వేగంగా లేదా నెమ్మదిగా ఆరిపోయే వర్ణాన్ని సృష్టించేందుకు కర్పూర తైలం (టర్పెంటైన్), సీమఅవిసె నూనె, కళా తరగతికి చెందిన ఖనిజ ద్రావకాలను లేదా ఇతర ద్రావకాలను తైల వర్ణద్రవ్యానికి కలుపుతారు. 'ఫ్యాట్ ఓవర్ లీన్' అంటే తైల వర్ణద్రవ్యం యొక్క ఒక ప్రాథమిక సూత్రం, (అంటే తైలవర్ణ చిత్రలేఖనంలో స్థిరమైన వర్ణ పొరను సృష్టించేందుకు తక్కువ తైల-వర్ణ నిష్పత్తి (లీన్-పలచని) గల వర్ణంపై అధిక తైలం-వర్ణ నిష్పత్తి (ఫ్యాట్-మందమైన) గల వర్ణాన్ని అద్దే పద్ధతి). సరిగా ఆరిపోయేందుకు వర్ణద్రవ్యం యొక్క ప్రతి అదనపు వర్ణ పొర దాని కింది పొర కంటే ఎక్కువ తైల పరిమాణం కలిగివుంటుంది. ప్రతి అదనపు పొర తక్కువ తైల పరిమాణాన్ని కలిగివున్నట్లయితే, తుది వర్ణచిత్రంలో పగులు ఏర్పడటం మరియు పొర ఊడిపోవడం జరుగుతుంది. తైలవర్ణ చిత్రలేఖనంలో ఉపయోగించేందుకు చల్లని మైనం, రెసిన్‌లు మరియు వార్నిష్‌ల వంటి అనేక ఇతర మాధ్యమాలు కూడా ఉన్నాయి. కాంతి సారకత, వర్ణం యొక్క మెరుపు, వర్ణం యొక్క సాంద్రత లేదా నిలిపివుంచే గుణాన్ని మరియు కుంచె గీతలను నిలిపివుంచే లేదా దాచే సామర్థ్యాన్ని సర్దుబాటు చేయడంలో ఈ అదనపు మాధ్యమాలు చిత్రకారుడికి సాయపడతాయి. ఈ చరరాశులు తైల వర్ణద్రవ్యం యొక్క వ్యక్తీకరణ సామర్థ్యంతో దగ్గరి సంబంధం కలిగివుంటాయి.

సాంప్రదాయికంగా, వర్ణద్రవ్యాన్ని వర్ణాన్ని అద్దే ఉపరితలానికి పేయింట్ బ్రష్‌లతో (కుంచెలతో) పూస్తారు, అయితే పాలెట్ నైవ్స్ (చిత్రకారులు ఉపయోగించే కత్తులు) మరియు వస్త్రాల పేలికలు ఉపయోగించే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. కళాకారులు ఉపయోగించే అనేక ఇతర పదార్థాల కంటే తైలవర్ణ చిత్రాలు ఎక్కువకాలం తడిగా ఉంటాయి, తద్వారా కళాకారుడికి వర్ణం, ఆకృతి లేదా బొమ్మ ఆకారాన్ని మార్చేందుకు వీలు ఉంటుంది. కొన్నిసార్లు, కళకారుడు మొత్తం వర్ణపు పొరను తొలగించి, కొత్తదానిని ప్రారంభించవచ్చు. వర్ణద్రవ్యం తడిగా ఉన్నప్పుడు కొంత సమయంపాటు వస్త్రపేలిక మరియు కర్పూర తైలంతో పొరను తొలగించే వీలుంటుంది, అయితే గట్టిపడిన పొరను చెక్కి తొలగించాల్సి ఉంటుంది. తైల వర్ణద్రవ్యం ఆవిరికావడం వలన కాకుండా, ఆక్సీకరణ ద్వారా ఆరిపోతుంది, ఇది సాధారణంగా ఒక రోజు నుంచి రెండు వారాల్లో గట్టిపడుతుంది. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో వార్నిష్ పూసేందుకు వీలైన పొడిబారిన స్థితికి చేరుకుంటుంది. కళా పరిరక్షకులు 60 నుంచి 80 ఏళ్ల తరువాత తైల వర్ణచిత్రం పూర్తిగా ఆరిపోయినట్లు పరిగణిస్తారు.[ఆధారం చూపాలి]

చరిత్రసవరించు

తైలవర్ణ చిత్రలేఖనం ఆఫ్ఘనిస్థాన్ నుంచి పశ్చిమ దేశాలకు విస్తరించాయనే వాదనకు ఇటీవలి పరిశోధనలు మద్దతు ఇస్తున్నాయి.[1][2][3][4]బామ్యాన్ బౌద్ధ విగ్రహాలు#బయటపడిన తైల వర్ణచిత్రాల ఉపరితలాలు కవచాలు మాదిరిగా ఉన్నాయి - పోటీలకు మరియు అలంకరణలు రెండింటికీ వీటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది - సాంప్రదాయిక టెంపెరా వర్ణాల కంటే తైల-ఆధారిత మాధ్యమంలో చిత్రాలు గీసినప్పుడు అవి మరింత మన్నిక పొందుతాయి.

అనేక పునరుజ్జీవనోద్యమ మూలాలు, ముఖ్యంగా వాసారీ గ్రంథాలు, 15వ శతాబ్దపు ఉత్తర ఐరోపా చిత్రకారులు మరియు ప్రధానంగా జాన్ వాన్ ఐక్ చెక్క పలకపై తైల మాధ్యమాలతో చిత్రలేఖన ప్రక్రియను కనిపెట్టినట్లు సూచిస్తున్నాయి, అయితే థియోఫిలస్ (రోజెర్ ఆఫ్ హెల్మార్‌షౌసెన్?) వివిధ కళలపై 1125లో రాసిన తన గ్రంథంలో తైలవర్ణ ఆధారిత చిత్రలేఖనానికి స్పష్టమైన నిర్దేశాలను ఇచ్చారు. ఈ కాలంలో దీనిని బహుశా బాహ్య వినియోగం కోసం వివిధ రకాల శిల్పాలు మరియు చెక్క అమర్పులకు రంగులు వేసేందుకు ఉపయోగించివుండవచ్చు. అయితే 15వ శతాబ్దంలో ప్రారంభ నెదర్లాండ్స్ చిత్రలేఖనం తైలాన్ని సాధారణ చిత్రలేఖన మాధ్యమంగా మొదటిసారి ఉపయోగించింది, పొరలు మరియు తళుకుల వినియోగాన్ని అన్వేషించడం జరిగింది, దీని తరువాత మిగిలిన ఉత్తర ఐరోపా, ఆపై ఇటలీ ఈ చిత్రలేఖన పద్ధతిని స్వీకరించాయి. ప్రారంభ చిత్రాలు చెక్కపై పలక వర్ణచిత్రాలుగా ఉన్నాయి, అయితే 15వ శతాబ్దం ముగిసే సమయానికి కాన్వాస్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఇది తక్కువ ఖర్చుతో కూడుకొని ఉండటంతోపాటు, సులభంగా రవాణా చేసే వెసులుబాటు, పెద్ద కళాఖండాల సృష్టికి అవకాశం కల్పించింది. తెరచాప-కాన్వాస్ సులభంగా దొరికే వెనిస్ నగరం దీనిని నేతృత్వం వహించింది. ఉత్తర ప్రాంతం నుంచి ఇటలీకి వ్యాప్తి చెందిన తైలవర్ణాలు 15వ శతాబ్దంలో వెనిస్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1540నాటికి పలకపై చిత్రాలు గీసే పూర్వ పద్ధతి టెంపెరా దాదాపుగా కనుమరుగయింది, అయితే ఉత్తర వాతావరణాల్లో ఇది బాగా కష్టమైన పనిగా ఉన్న కుడ్య చిత్రాలకు మాత్రం ఇటాలియన్‌లు ఫ్రెస్కోను ఉపయోగించడం కొనసాగించారు.

సరంజామాసవరించు

 
రావిఅవిసె నూనెను తయారు చేసే అవిసె గింజలు.

సీమఅవిసె నూనెను కూడా సాధారణ పీచు పంట అయిన అవిసె చెట్టు విత్తనం నుంచి సేకరిస్తారు. తైలవర్ణ చిత్రాలకు (దిగువ వ్యాస భాగాలు చూడండి) మద్దతు ఇచ్చే ఒక ముఖ్యమైన వస్తువు అయిన పీచు కూడా అవిసె చెట్టు నుంచి వస్తుంది. కుసుంభ నూనెను కొన్నిసార్లు తెలుపు వంటి లేత వర్ణాలు సృష్టించేందుకు ఉపయోగించేవారు, ఎందుకంటే ఈ నూనె ఆరిపోయిన తరువాత సీమఅవిసె నూనె కంటే తక్కువగా పసుపు వర్ణంలోకి మారుతుంది, అయితే దీనికి సంబంధించిన ప్రతికూలత ఏమిటంటే, ఇది చాలా నెమ్మదిగా ఆరుతుంది.

రసాయన శాస్త్రంలో ఇటీవలి పురోగమనాలు ఆధునిక నీటి మిశ్రనీయ తైల వర్ణాలను సృష్టించాయి, ఈ వర్ణాలను నీటితో ఉపయోగించడం మరియు శుభ్రం చేయడం చేయవచ్చు. తైలం యొక్క బణు నిర్మాణంలో కొద్దిస్థాయి మార్పులతో ఈ నీటి మిశ్రణీయ లక్షణాన్ని సృష్టించవచ్చు.

మరింత కొత్తరకం వర్ణద్రవ్యాలు ఏమిటంటే ఉష్ణాన్ని-నిలిపే తైలాలు, ఇవి 265–280 °F (130–138 °C) వరకు వేడి చేసినప్పుడు కూడా 15 నిమిషాలపాటు ద్రవరూపంలోనే ఉంటాయి. వర్ణద్రవ్యం ఎన్నడూ పొడిబారదు కాబట్టి, శుభ్రపరచాల్సిన అవసరం ఉండదు (మరొక వర్ణాన్ని మరియు ఒకే కుంచెను ఉపయోగించాలని నిర్ణయించుకున్నప్పుడు మినహా). సాంకేతికంగా నిజమైన తైలాలు (మాధ్యమం అంతర్గత ఒక ఉష్ణ సూక్ష్మగ్రాహక ఘనీభవన కారకంతో ఉన్న ఒక గుర్తించని పొడిబారని కృత్రిమ తైల ద్రవం) కానివాటిని ఉపయోగించి గీసిన చిత్రాలు కూడా తైలవర్ణ చిత్రాలు మాదిరిగానే కనిపిస్తాయి, వీటిని సాధారణంగా తైలవర్ణ చిత్రాలుగా చూపిస్తారు.

తైలవర్ణ చిత్రలేఖనానికి ఆధారాలుసవరించు

 
చెక్క చట్రానికి అమర్చిన కాన్వాస్.
 
పాల్మాయిల్ గియోవన్ గీసిన ఫ్రాన్సెస్కో సెయింట్ జోరెమ్, సుమారుగా 1590.ఇది రాగిపై తైలవర్ణ చిత్రలేఖనానికి ఒక అరుదైన ఉదాహరణ.

సాంప్రదాయిక కళాకారుల యొక్క కాన్వాస్‌ను పీచు (లినెన్) నుంచి తయారు చేస్తారు, అయితే తక్కువ ఖర్చుతో కూడిన పత్తి వస్త్ర వినియోగానికి ప్రాచుర్యం ఏర్పడింది. "స్ట్రెచర్" లేదా "స్ట్రైనెర్"గాపిలిచే ఒక చెక్క పలకను మొదట కళాకారుడు సిద్ధం చేసుకుంటాడు. మొదటి మరియు రెండోదాని మధ్య వ్యత్యాసం ఏమిటంటే స్ట్రెచర్‌లను కొద్దిగా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది, ఇదిలా ఉంటే స్ట్రైనర్‌లు దృఢంగా మరియు సర్దుబాటు చేయగలిన మూలలు కలిగివుంటాయి. కాన్వాస్‌ను తరువాత చెక్క చట్రంపై పరుస్తారు, వెనుకవైపు దీనిని బలంగా కట్టివేస్తారు. తరువాత, కళాకారుడు వర్ణద్రవ్యం యొక్క ఆమ్ల లక్షణాల నుంచి కాన్వాస్‌ను వేరుచేసేందుకు ఒక "జిగురు" పదార్థాన్ని పూస్తారు. సాంప్రదాయికంగా, కాన్వాస్‌పై జంతువుల జిగురు (సైజ్) పొరతో, (ఆధునిక కళాకారులు కుందేలు చర్మ జిగురును ఉపయోగిస్తారు) మరియు ప్రధానంగా సీసపు తెలుపు వర్ణంతో, కొన్నిసార్లు అదనపు సున్నంతో పూత పూస్తారు. పలకలను జిగురు మరియు సున్నం మిశ్రమమైన గెస్సోతో తయారు చేస్తారు.

ఆధునిక అక్రిలిక్ గెస్సోను ఒక అక్రిలిక్ బైండర్‌తో టైటానియం డైయాక్సైడ్ నుంచి తయారు చేస్తారు. దీనిని తరచుగా కాన్వాస్‌పై ఉపయోగిస్తారు, ఇక్కడ నిజమైన గెస్సో వినియోగానికి అనుకూలంగా ఉండదు. కళాకారుడు వివిధ గెస్సో పొరలను పూయవచ్చు, ఒక పొర ఆరిపోయిన తరువాత మరోదానిని పూయడం జరుగుతుంది. అక్రిలిక్ గెస్సోను గరుకు కాగితంతో గీకడం కష్టంతో కూడుకొని ఉంటుంది. ఒక తయారీదారు దీనికి అనుగుణమైన అక్రిలిక్ గెస్సోను తయారు చేశారు, అయితే పలకలకు మాత్రమే ఉద్దేశించబడింది, కాన్వాస్‌లకు పనికిరాదు. ఒక నిర్దిష్ట వర్ణానికి గెస్సోను మార్చడం సాధ్యపడుతుంది, అయితే ఎక్కువగా దుకాణాల్లో దొరికే గెస్సో తెలుపు వర్ణంలో ఉంటుంది. గెస్సో పొర మందం ఆధారంగా, రంధ్రాలు ఉన్న ఉపరితలంలోకి గెస్సో పొర తైల వర్ణద్రవ్యాన్ని చేర్చే అవకాశం ఉంది. ప్రత్యేక లేదా అసాధారణ గెస్సో పొరలు కొన్నిసార్లు పూర్తిచేసిన చిత్రాల ఉపరితలంపై కనిపిస్తాయి, వర్ణద్రవ్యం నుంచి కాకుండా, పొరలో ఒక మార్పుగా ఇవి కనిపించడం జరుగుతుంది.

తైలవర్ణ చిత్రాలకు ప్రామాణిక పరిమాణాలను ఫ్రాన్స్‌లో 19వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. ప్రమాణాలను ఫ్రెంచ్‌వారు మాత్రమే కాకుండా, ఎక్కువ మంది కళాకారులు పాటిస్తారు, అంతేకాకుండా కళాకారుల పదార్థాల ప్రధాన సరఫరాదారులు ఇప్పటికీ ఈ ప్రమాణాలను పాటించడం జరుగుతుంది. 0 (టోయిల్ డి 0 ) నుంచి 120 (టోయిల్ డి 120 ) పరిమాణాల వరకు ప్రధాన విభజన ఏమిటంటే మూర్తులు (ఫిగర్ ), భూదృశ్యాలు (పేసేజ్ ) మరియు సాగర దృశ్యాలకు (మెరైన్ ) వివిధ భాగాలుగా విభజించబడి ఉంటాయి, ఇవి కొంతవరకు వికర్ణాన్ని కలిగివుంటాయి. అందువలన 0 ఫిగర్ ఒక పేసేజ్ 1 మరియు ఒక మెరైన్ 2 ఎత్తుకు అనుగుణంగా ఉంటుంది.[5]

లినోలియం, చెక్క పలక, కాగితం, పలక, అణచబడిన చెక్క మరియు కార్డుబోర్డు వంటి ఉపరితలాలు కూడా చిత్రలేఖనానికి ఉపయోగించారు, 16వ శతాబ్దం నుంచి అత్యంత ప్రధాన ఉపరితలంగా కాన్వాస్‌ను ఉపయోగిస్తున్నారు, అయితే అనేక మంది కళాకారులు 17వ శతాబ్దంలో మరియు ఆ తరువాత పలకను కూడా ఉపయోగించారు. పలక బాగా ఖర్చుతో కూడుకొని ఉండటం, దీని వినియోగంలో రవాణా ఇబ్బందులు మరియు ప్రతికూల పరిస్థితుల్లో పగిలిపోవడం లేదా విరిగిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. అనుకూలమైన విషయం ఏమిటంటే, చెక్క పలక సంపూర్ణ దృఢత్వాన్ని ఇస్తుంది.

ప్రక్రియసవరించు

 
ఎట్రెటాట్ పర్వతాలు, చిత్రకారుడు క్లాడే మోనెట్, 1885

ఉపరితలంపై వర్ణాన్ని పూయకముందు కళాకారుడు తన అంశానికి సంబంధించిన నమూనాను గీయవచ్చు. వర్ణద్రవ్యం రంగుతో ఉండే సహజ పదార్థాల మిశ్రమంగా ఉండవచ్చు, ఉదాహరణకు పసుపుకు సల్ఫర్ లేదా నీలి రంగుకు కోబాల్ట్. వర్ణద్రవ్యాన్ని తైలంతో కలుపుతారు, సాధారణంగా సీమఅవిసె నూనెతో కలుపుతారు, అయితే ఇతర తైలాలను కూడా ఇందుకోసం ఉపయోగిస్తారు. వివిధ తైలాలు ఆరిపోవడంలో వ్యత్యాసం ఉంటుంది, క్రమబద్ధమైన ప్రభావాలు సృష్టిస్తాయి.

సాంప్రదాయికంగా, కళాకారులు తమ సొంత వర్ణాలను ముడి వర్ణద్రవ్యాల నుంచి మిశ్రమం చేశారు, వారు తరచుగా వర్ణాలను మరియు మాధ్యమాన్ని మిశ్రమం చేసేవారు. ఇది వహనీయతను కష్టతరం చేసింది, దీంతో చిత్రలేఖన కార్యకలాపాలు ఎక్కువగా స్టూడియోకు పరిమితమయ్యేవి. 1800వ దశకంలో ఈ పరిస్థితిలో మార్పు కనిపించింది, ఈ సమయంలో గొట్టాల్లో తైల వర్ణద్రవ్యాలు అందుబాటులోకి వచ్చాయి. కళాకారులు వేగంగా మరియు సులభంగా వర్ణాలను కలిపేందుకు వీలు ఏర్పడింది, తద్వారా మొదటిసారి, ప్లెయిన్ ఎయిర్ (అవుట్‌డోర్) పెయింటింగ్ (ఫ్రెంచ్ అనుభూతి వాదంలో ఇది ఒక సాధారణ పద్ధతి)కు అనుకూలమైన పరిస్థితి ఏర్పడింది.

వర్ణాన్ని పూసేందుకు కళాకారుడు తరచుగా కుంచెను ఉపయోగిస్తాడు. వివిధ రకాల ప్రభావాల కోసం కుంచెలు వివిధ రకాల పోగుల నుంచి తయారు చేస్తారు. ఉదాహరణకు, పంది జుట్టుతో తయారు చేసిన కుంచెలను పెద్ద స్ట్రోక్‌లకు మరియు ఇంపాస్టో ఆకృతులకు ఉపయోగిస్తారు. విచ్ఛిక జట్టు మరియు ముంగిస జట్టు కుంచెలను సున్నితంగా మరియు మృదువుగా ఉంటాయి, అందువలన ఇవి చిత్రాలు మరియు నిశిత పనులకు బాగా ఉపయోగపడతాయి. ఎరుపు నాణ్యమైన ఉన్ని కుంచెలు (వీసెల్ (ఒకరకమైన ముంగిస) జుట్టు) వీటి కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటాయి. అత్యంత నాణ్యమైన కుంచెలుగా తయారు చేసేవాటిని కోలిన్‌స్కీ సాబుల్‌గా పిలుస్తారు; ఈ కుంచె పోగులను సైబీరియా ప్రాంతంలో కనిపించే మింక్ నుంచి సేకరిస్తారు. వీటి జుట్టు అత్యంత మృదుత్వాన్ని, మంచి స్మృతిని అందిస్తాయి (కాన్వాస్‌పై నుంచి తీసినప్పుడు అసలు ప్రదేశానికి తిరిగి వచ్చేందుకు అనుకూలంగా ఉంటాయి); దీనిని కళాకారుల యొక్క కుంచె స్నాప్‌గా గుర్తిస్తారు.

గత కొన్ని దశాబ్దాల్లో, అనేక కృత్రిమ కుంచెలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి మెరుగైన మన్నిక మరియు మంచి పనితీరు కనబర్చడంతోపాటు, తక్కువ ధర కలిగివున్నాయి. ఉడత జట్టు వంటి స్నాప్ లేని ఫ్లాపీ పోగులను సాధారణంగా తైలవర్ణ చిత్రకారులు ఉపయోగించరు. కుంచెల పరిమాణాల్లో కూడా ఎక్కువ వైవిధ్యం కనిపిస్తుంది, వీటిని వివిధ రకాల ప్రభావాలకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, రౌండ్ అనేది చిత్రకారులు ఉపయోగించే ఒక కుంచె, దీనిని నిశిత పనికి ఉపయోగిస్తారు. ఫ్లాట్ కుంచెలను వెడల్పుగా వర్ణాలు పూసేందుకు ఉపయోగిస్తారు. బ్రైట్ అనేది కురచ కుంచె జట్టు కలిగివున్న ఒక ఫ్లాట్. ఫిల్‌బెర్ట్ అనేది గుండ్రటి అంచులు కలిగివున్న ఒక ఫ్లాట్. ఎగ్‌బెర్ట్ అనేది బాగా పొడవైన ఫిల్‌బెర్ట్, ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక ఫ్లాట్‌గా పిలిచే లోహపు బ్లేడ్‌తో ఉండే పాలెట్ కత్తితో కూడా కళాకారుడు వర్ణద్రవ్యాన్ని పూయవచ్చు. అవసరమైనప్పుడు కాన్వాస్ నుంచి వర్ణాన్ని తొలగించేందుకు కూడా పాలెట్ కత్తిని ఉపయోగిస్తారు. వస్త్ర పేలికలు, స్పాంజ్‌లు మరియు దూది వంటి సంప్రదాయేతర సాధనాలు కూడా ఉపయోగించవచ్చు. కొందరు కళాకారులు చేతి వేళ్లతో కూడా చిత్రాలు గీస్తారు.

అనేక మంది కళాకారులు పొరలుగా చిత్రాలు గీస్తారు, దీనిని సాధారణంగా పరోక్ష చిత్రలేఖనం అని పిలుస్తారు. ఎగ్ టెంపెరా చిత్రలేఖన పద్ధతిని స్వీకరించడం ద్వారా ఈ పద్ధతి మొదట క్రమబద్ధం చేయబడింది, ఉత్తర ఐరోపాలోని ఫ్లెమిష్ చిత్రకారులచే రావిఅవిసె నూనెలో వర్ణాలను కలపడం ద్వారా ఇది అమలు చేయబడింది. ఇటీవల, ఈ పద్ధతిని "మిశ్రమ పద్ధతి" లేదా "మిశ్రమ విధానం"గా పిలుస్తున్నారు. తరచుగా గ్రుడ్డు టెంపెరా లేదా కర్పూరతైల-పలచని వర్ణంతో మొదటి పూత (దీనిని అండర్‌పెయింటింగ్ అని పిలుస్తారు) పూస్తారు. ఈ పొర కాన్వాస్‌లో బిగుతు తీసుకొచ్చేందుకు సాయపడుతుంది, గెస్సో యొక్క తెలుపు రంగును కప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. అనేక మంది కళాకారులు ఈ పొరను కూర్పును గీసేందుకు ఉపయోగిస్తారు. ముందుకు వెళ్లడానికి ముందు ఈ పొరను సర్దుబాటు చేయవచ్చు, ఫ్రెస్కో పద్ధతిలో ఉపయోగించే కార్టూనింగ్ విధానంతో పోలిస్తే దీనిలో ఈ వెసులుబాటు లభిస్తుంది. ఈ పొర ఆరిపోయిన తరువాత, కళాకారుడు వర్ణ వస్త్రపు మొసాయిక్‌కు రంగు వేస్తారు, ముదురు రంగు నుంచి లేత రంగుకు వచ్చే వరకు ఈ దశలో ప్రయత్నిస్తాడు. మొసాయిక్ పూర్తయ్యే సరికి వర్ణాల యొక్క అంచులు ఏకం చేయబడతాయి. తరువాతి దశను అమలు చేయక ముందు ఈ మొసాయిక్ పొరను ఆరబెడతారు.

తరువాత అనేక పొరలను ఏర్పాటు చేసే ముందు కళాకారుడు ఫ్యాట్ ఓవర్ లీన్ పద్ధతిని ఉపయోగిస్తాడు. దీనర్థం ఏమిటంటే సరిగా ఆరిపోవడానికి వీలు కల్పించడానికి దిగువన ఉండే పొర కంటే తరువాత వేసే పొరలో కొంచెం ఎక్కువ తైలాన్ని జోడిస్తారు. చిత్రంలోకి అదనపు పొరలు వచ్చే కొద్ది, చిత్రం కూడా మరింత తైల పక్వతను పొందుతుంది (పలచని దిగువ పొర నుంచి మందమైన ఎగువ పొరకు) అందువలన తుది వర్ణచిత్రంలో పగులు లేదా పొరలు ఉండటం జరగదు. ఆరిపోయిన తరువాత, కళాకారుడు వర్ణచిత్రానికి గ్లేజ్‌ను పూయవచ్చు, ఇది ఉపరితలాన్ని కల్పివుంచే పలచని, పారదర్శకంగా ఉండే పొర. వర్ణచిత్రానికి ఈ పొరను ఏర్పాటు చేసేందుకు ఒక సాంప్రదాయిక పద్ధతిలో వారాలు లేదా నెలల సమయం పడుతుంది, అయితే జాన్ వాన్ ఐక్ వంటి నిపుణులైన ప్రారంభ కళాకారులు కొన్నిసార్లు వెట్-ఆన్-వెట్ పద్ధతిని ఉపయోగించి త్వరగా ఈ దశను పూర్తి చేసేవారు.

అనుభూతివాద యుగంలో కళాకారుల వంటి తరువాతి కాలానికి చెందిన కళాకారులు తరచుగా వెట్-ఆన్-వెట్ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించారు, కాన్వాస్‌పై తడి వర్ణాన్ని పూయడం ద్వారా వీరు పునరుజ్జీవన కాలపు పొరలు ఏర్పాటు చేయడం మరియు గ్లేజింగ్ వంటి పద్ధతిని పాటించలేదు. ఈ పద్ధతి (వెట్-ఆన్-వెట్ పద్ధతి)ని అల్లా ప్రైమా అని కూడా పిలుస్తారు. స్టూడియోకు బదులుగా ఆరుబయట వర్ణచిత్రాల రూపకల్పనకు వీలు ఏర్పడటంతో ఈ పద్ధతి తెరపైకి వచ్చింది. ఆరుబయట, ఒక కళాకారుడికి ఒక కొత్త పొరను ఏర్పాటు చేయడానికి దానికి ముందు పొర ఆరిపోయేంత సమయం ఉండదు. అనేక మంది సమకాలీన కళాకారులు ఈ రెండు పద్ధతులను కలిపి ఒక కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నారు, ఈ కొత్త పద్ధతిలో గ్లేజింగ్ ద్వారా పొరల లోతుగా ముదురు రంగు (వెట్-ఆన్-వెట్)ను జోడించవచ్చు.

వర్ణచిత్రం రూపకల్పన పూర్తయి, దానిని ఏడాదిపాటు ఆరబెట్టిన తరువాత, కళాకారుడు ఈ చిత్రాన్ని వార్నిష్ పూస్తాడు, ఈ వార్నిష్‌ను కర్పూర తైలంలో కరిగిపోయే డామర్ జిగురుతో తయారు చేస్తారు. ఇటువంటి వార్నిష్‌లను తైల వర్ణచిత్రానికి ఎటువంటి నష్టం జరగకుండా తొలగించవచ్చు, ఇవి శుభ్రపరచడం మరియు పరిరక్షణకు వీలు కల్పిస్తాయి. కొందరు సమకాలీన కళాకారులు తమ చిత్రాలపై వార్నిష్ పూయరు, వీటి ఉపరితలాలను వార్నిష్ లేకుండా ఉంచేందుకు ఇష్టపడతారు.

ప్రసిద్ధ తైల వర్ణచిత్రాలకు ఉదాహరణలుసవరించు

వీటిని కూడా చూడండి.సవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 • చిత్రలేఖన చరిత్ర
 • తైల చిత్రణ
 • చిత్రకారుల జాబితాలు
 • ఫాక్స్ పెయింటింగ్
 • పేపర్ మార్బ్లింగ్
 • ఆయిల్ పెయింట్
 • గ్లేజ్ (చిత్రలేఖన పద్ధతి)
 • ది ఆర్టిస్ట్స్ హ్యాండ్‌బుక్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ టెక్నిక్స్ , తైవర్ణ చిత్రలేఖనం గురించి పూర్తి వివరాలు తెలియజేసే ఒక పుస్తకం

సూచనలుసవరించు

 1. "Rediscovering treasures of Bamiyan". BBC News. 17 July 2008. Retrieved 20 May 2010.
 2. ఆఫ్ఘన్ కేవ్స్ హోల్డ్ వరల్డ్స్ ఫస్ట్ ఆయిల్ పెయింటింగ్స్: ఎక్స్‌పర్ట్ - ABC న్యూస్ (ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్)
 3. ఎర్లియస్ట్ ఆయిల్ పెయింటింగ్స్ డిస్కవర్డ్
 4. [1] సైన్స్ మేగజైన్ మే 2, 2008
 5. Haaf, Beatrix (1987). "Industriell vorgrundierte Malleinen. Beiträge zur Entwicklungs-, Handels- und Materialgeschichte". Zeitschrift für Kunsttechnologie und Konservierung. 1: 7–71.