థామస్ బాబింగ్టన్ మెకాలే
థామస్ బాబింగ్టన్ మెకాలే (1800 అక్టోబరు 25 – 1859 డిసెంబరు 28) భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) సృష్టికర్త. మొదటి లా కమిషన్ ఛైర్మన్. అంతేకాకుండా భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసాడు. ఆయన లార్డ్ మెకాలేగా పిలువబడేవాడు.
జీవిత చరిత్ర
మార్చుథామస్ బాబింగ్టన్ మెకాలే, 1వ బారన్ మెకాలే, PC, FRS, FRSE బ్రిటీష్ చరిత్రకారుడు. విగ్ రాజకీయవేత్త, 1834లో సుప్రీం కౌన్సిల్ మెంబర్ గా అతను భారతదేశానికి వచ్చాడు. అక్కడి పరిస్థితులను గమనించి ఫిబ్రవరి 1835 నాటి తన మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ద్వారా భారతదేశానికి పాశ్చాత్య సంస్థాగత విద్యను పరిచయం చేసారు. తద్వారా ప్రజలు ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకుంటారని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని లార్డ్ మెకాలే భావించాడు.
లార్డ్ మెకాలే భారతదేశంలో కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉన్నా విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేసాడు. అదే సమయంలో అతను మొదటి లా కమిషన్ ఛైర్మన్ గా ఉన్నాడు. అపుడే నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా వంటి ప్రామాణిక గ్రంథాలను అధ్యయనం చేసాడు. అలాగే భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిని కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. జైలు శిక్షల విషయంలో కూడా తన అభిప్రాయాలకంటే, నాటి దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్సు తో ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతిని తయారు చేశాడు. 1835లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ ప్రతిని సమర్పించాడు. అతను చేసిన కృషి ఫలితంగానే ఇండియన్ పీనల్ కోడ్ 1860 అక్టోబరు 6 నాడు చట్టసభలో ఆమోదం పొందింది. 1862 సంవత్సరంలో ఐపిసి అమలులోకి వచ్చింది. లార్డ్ మెకాలే యుద్ద కార్యదర్శిగా 1839 - 1841 మధ్య పనిచేశాడు. పేమాస్టర్-జనరల్ గా 1846 - 1848 మధ్య లార్డ్ మెకాలే విధులు నిర్వర్తించాడు.
భారతదేశంలో మెకాలేయిజం ద్వారా దేశీయ విద్యా , వృత్తిపరమైన ఆచారాలు అణచివేయబడ్డాయి.[1] అన్ని పాఠశాలల్లో ఆంగ్ల భాషను అధికారిక బోధనా భాషగా మార్చడం జరిగింది. ఆంగ్లం మాట్లాడే భారతీయులకు మాత్రమే ఉపాధ్యాయులుగా శిక్షణ ఇవ్వడం వంటివి చేసారు.[2] అతని మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక మంచి యూరోపియన్ లైబ్రరీలోని షెల్ఫ్ భారతదేశం, అరేబియా మొత్తం స్థానిక సాహిత్యం కలిగి ఉంటుందని తెలియచేసారు.[3] అతని ది హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ లో పాశ్చాత్య యూరోపియన్ సంస్కృతి ఆధిక్యత, దాని సామాజిక రాజకీయ పురోగతి.. వాటి అనివార్యత గురించి తన వాదనను వ్యక్తం చేసారు. ఇది విగ్ చరిత్రకు ఒక ప్రధాన ఉదాహరణ.[2]
మూలాలు
మార్చు- ↑ Kampfner, John (22 July 2013). "Macaulay by Zareer Masani – review". The Guardian. Retrieved 30 August 2019.
- ↑ 2.0 2.1 MacKenzie, John (January 2013), "A family empire", BBC History Magazine
- ↑ For full text of Macaulay's minute see "Minute by the Hon'ble T. B. Macaulay, dated the 2nd February 1835"
బాహ్య లంకెలు
మార్చుగురించి/చే రచింపబడిన మూల కృతులున్నాయి.
- Thomas Babington Macaulay (1800–1859), Fran Pritchett, Columbia University
- Works by Thomas Babington Macaulay at Project Gutenberg
- Works by or about Thomas Babington Macaulay at Internet Archive
- books by Macauly at Readanybook.com
- Lord Macaulay's Habit of Exaggeration, JamesBoswell.info
- Macaulay's Minute revisited, Ramachandra Guha, The Hindu, 4 February 2007
- థామస్ బాబింగ్టన్ మెకాలే at Find a Grave – burial at Westminster Abbey, London
- థామస్ బాబింగ్టన్ మెకాలే at Find a Grave – memorial statue, antechapel, Trinity College, Cambridge