థేని

తమిళనాడు లోని జిల్లా

థేని లేదా తేని తమిళనాడులో ఉన్న ఒక నగరం.

Theni district

தேனி மாவட்டம்
District
View of Theni and Periyakulam from the hills of Kodaikanal
View of Theni and Periyakulam from the hills of Kodaikanal
Location of Theni district
Country India
రాష్ట్రంతమిళనాడు
జిల్లాTheni
EstablishedJuly 07, 1996
ప్రధాన కార్యాలయంTheni
BoroughsPeriyakulam, Theni, Andipatti, Uthamapalayam, Bodinayakanur
ప్రభుత్వం
 • Collector & District MagistrateDr K.S Palanisami IAS
విస్తీర్ణం
 • District2,889 కి.మీ2 (1,115 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • District12,43,684
 • సాంద్రత430/కి.మీ2 (1,100/చ. మై.)
 • మెట్రో ప్రాంతం
5,91,841
భాషలు
 • అధికారTamil
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
625531
టెలిఫోన్ కోడ్04546
ISO 3166 కోడ్[[ISO 3166-2:IN|]]
వాహన నమోదు కోడ్TN-60
Coastline0 కిలోమీటర్లు (0 మై.)
Largest cityTheni
లింగ నిష్పత్తిM-50.5%/F-49.5% /
అక్షరాస్యత71.58%%
Legislature typeelected
Legislature Strength5
Precipitation833.5 milliమీటర్లు (32.81 అం.)
Avg. summer temperature40.5 °C (104.9 °F)
Avg. winter temperature15 °C (59 °F)
జాలస్థలిwww.theni.nic.in

చరిత్రసవరించు

తేనిజిల్లా 1996 జూలై 7 న మదురై జిల్లా ఉత్తమపాళయం రెవెన్యూ డివిషన్‌ను జిల్లాగా రూపొందించబడింది. అలాగే తేనీ, బోడినాయకనూరు తాలూకాలుగా చేయబడ్డాయి. 1996 డిసెంబరు 31 వరకూ టౌన్ తేనీ తాత్కాలిక జిల్లాకాత్యాలయంగా ఉన్నప్పటికీ 1997 జనవరి 1 న తేనీకు తాలూకా అంతస్తు ఇచ్చి జిల్లా కేంద్రంగా మారింది. [2] తేనీ జిల్లాలో 1900 వరకూ మనుష్య సంచారం అరుదుగా ఉంటూ వచ్చింది. 1886లో నిర్మించబడిన ముల్లై పెరియార్ ఆనకట్ట జిల్లకు అవసరమైన జలాలను అందించింది. పెరియార్ నది కంబం లోయ నుండి భూభాగంలో ప్రవేశించి ముల్లై నదిలో సంగమిస్తుంది. ఆనకట్ట నిర్మాణం అధికసంఖ్యలో ప్రజలు కంబం లోయలో స్థిరపడడానికి దోహదం అయింది. 1900 వరకూ తేనీ గురించి మిగిలిన ప్రపంచానికి తెలియనప్పటికీ ముల్లై పెరియారు కలయికతో సమీపంలో ఉన్న శివకాశి, కోవిల్పట్టి, విరుదునగర్, సాత్తూరు, సమీప టౌన్లలోని మెట్టభూములు సారవంతమైన పంటభూములుగా మారాయి. భూములు సారనతం కావడంతో ప్రజలు స్థిరపడం అధికమైంది. అలా జాసందోహం అధికమైన భూభాగంలో కంబం ప్రాంతం ఒకటి. అందువలన 1880 నుండి 1990 వరకు ప్రస్తుత తేనీ ప్రాంతంలో కూడా ప్రజల సంఖ్య అధికమైంది. ఆ సమయంలో బోడినాయకనూరు, పెరియకుళం ప్రసిద్ధిచెందిన ప్రాంతాలుగా ఉండేవి. తరువాత పలువిధములైన వాణిజ్య కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తేనీ ప్రాంతం శరవేగంతో అభివృద్ధి చెందింది.

భౌగోళికంసవరించు

 
Manjalaru Dam.
 
Cumbum Valley.

తేనీ జిల్లా పడమటి కనుమల పాదప్రదేశంలో ఉంది. 9'38, 10' 39 అక్షాంశం ఉంది. 77'00, 78'30 రేఖాంశంలో ఉపస్థితమై ఉంది. తేనీ ఉత్తర సరిహద్దులలో దిండిగల్, తూర్పు సరిహద్దులో మదురై, ఆగ్నేయ సరిహద్దులో విరుదునగర్, పడమటి సరిహద్దులో కేరళ రాష్ట్రానికి చెందిన ఇడుక్కి జిల్లలు ఉన్నాయి. జిల్లాలో పెరియకుళం (తేనీ), బోడినాయకనూరు, కంబం, ఉత్తమపాళయం, కొంబై, గూడలూర్, చిన్నమనూరు, ఆండిపట్టి దేవారం, పొట్టిపురం, రామకృష్ణపురం, లక్ష్మీపురం, భద్రకాళీపురం, సుక్కంగ పట్టి, సదైయల్ పట్టి, మీనాక్షీపురం, మేలసిండలైచేరి, కొత్తూరు, పల్లవరాయన్ పట్టి వంటి గ్రామాలు తమిళనాడుకే ప్రత్యేకమైన జల్లికట్టుకు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. జిల్లలో పలు పర్వతశ్రేణులు ఉన్నాయి. జిల్లాలో పడమటి కనులకు సమాంతరంగా పొరుగున ఉన్న కేరళ రాష్ట్రాన్ని విడదీస్తూ ఉత్తర దక్షిణాలుగా ఒక పర్వతశ్రేణి ఉంది. 2,889 కి.మీ2 (1,115 చ. మై.) .[3]

వాతావరణంసవరించు

మైదానాలలో ఉష్ణోగ్రత 13 °-39 ° సెంటీగ్రేడ్లు, కొండ ప్రాంతాలలో 4-5°-25 ° ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనానికి జిల్లా అత్యంత ప్రసిద్ధిచెందింది.

నదులు ఆనకట్టలుసవరించు

జిల్లాలో వైగై నది, కొత్తగుడి నది, సురులియార్ నది, వరంగానది, మంజలారు నది, వరత్తారు నది ప్రవహిస్తున్నాయి. అంతే కాక వైగై ఆనకట్ట, సోత్తుపారై ఆనకట్ట, మనలారు ఆనకట్ట, మేల్ మనలారు ఆనకట్ట జిల్లాలోని వ్యవసాయ భూములకు అవసరమైన నీటిని సరఫరా చేస్తున్నాయి.

ఆర్ధికంసవరించు

 
Paddy fields across the backdrop of the Western Ghats

తేనీ జిల్లా అత్యధికంగా వ్యవసాయ ఆధారిత ఆదాయం కలిగి ఉంది. జిల్లాలో పంటభూమిగా ఉపయోగపడుతున్న 40.33%. [4][5] 2005-2006 ముఖ్యమైన పంటలు చెరుకు 12,01,221, పత్తి 95,360 బేళ్ళు, వడ్లు 66.043 టన్నులు, చిరుధాన్యాలు 57,081 టన్నులు, పప్పుధాన్యాలు 6,677, వేరుచనగ 4,021, నువ్వులు 325 టన్నులు పండినబడుతున్నాయి.

[6]పట్టు, అరటి, కొబ్బరి,తేయాకు, కాఫీ, యాలకులు,ద్రాక్ష, మొక్కజొన్న మొదలైనవి జిల్లాలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తిగా ఉన్నాయి. [7] కంబంలోయలో ద్రాక్షతోటలు అధికంగా ఉన్నాయి. దాదాపు 4.000 మంది సన్నకారు రైతులు 90,000 టన్నుల మస్కట్ ద్రాక్ష (పనీర్ ద్రాక్ష), 10,000 టన్నుల సుల్తానా ద్రాక్ష (తాంసన్ సీడ్‌లెస్ ద్రాక్ష), ఉత్పత్తి చేస్తున్నారు. సామాన్యంగా వేసవిలో మాత్రమే పండించడుతున్న ద్రాక్ష ఇక్కడ సంవత్సరమంతా ద్రాక్ష పండించడం విశేషం.

 
Grapes Cultivation.

జిల్లాలో కాటన్ మిల్లులు, షుగర్ మిల్లులు ప్రధాన పరిశ్రాలుగా ఉన్నాయి. అందిపట్టి తాలుకాలో చేనేత, పవర్‌లూంలు అత్యధికంగా ఉన్నాయి. ఉత్తమపాళయం తాలూకాలో హైవేవిస్ ఎస్టేట్ గుర్తించతగినంతగా టీపొడి ఉత్పత్తి చేస్తుంది. బోడినాయకనూరు యాలుకలు, కాఫీ గింజలు, టీ, మిరియాల వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. బోడినాయకనూరులో అత్యధికంగా యాలుకల విక్రయం జరుగుతున్నందున ఈ ఊరు యాలుకల నగరంగా పిలువబడుతూ ఉంది. యాలుకలు ఇక్కడ వేలం పద్ధతిలో విక్రయించబడుతుంటాయి. [3] ది పెరియార్ అండ్ హైడ్రో పవర్ స్టేషన్లు, వైగై మైక్రో హైడ్రో పవర్ స్టేషన్‌ల నుండి స్థాపన విద్యుత్తు ఉత్పత్తి శక్తి 181 మెగావాట్లు కాగా వాస్తవానికి 1996 నుండి 494 మెగావాట్లు ఉత్పత్తి చేయబడుతుంది.[4][8] తమిళనాడు పడమటి ప్రాంతంలో ఉన్న వాణిజ్యకేంద్రాలలో ప్రముఖమైనది తేనీ ప్రధానమైనది. తేనీ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ ఈ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా రావడానికి కృషిచేస్తుంది. జిల్లాలో 41.09 కిలోమీటర్ల పొడవైన మీటర్‌గేజ్ రైలుమార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో మదురైను కలుపుతూ 3 రైలు స్టేషన్లు ఉన్నాయి. [4][5]

అరణ్య వనరులుసవరించు

 
Meghamalai Falls.

తేనీ జిల్లాలో అరణ్యల శాతం 33%. తేనీ జిల్లాలో 27 అరణ్యప్రాంతాలు ఉన్నాయి. అరణ్యభూభాగం వైశాల్యం 795.81 చదరపుమైళ్ళు. వీటిలో 19 ప్రాంతాలు అభయారణ్యాలు. వీటి వైశాల్యం 225.44 చదరపు మైళ్ళు. 8 ప్రాంతాలు మైదానప్రాంత అభయారణ్యాలు. వీటి వైశాల్యం 540.37 చదరపు మైళ్ళు. జిల్లా మొత్తం పచ్చదనం నిండిన భూమిగా భావించబడుతుంది. వర్గీకరించని అరణ్యాలు తేనీ జిల్లాలో లేవు. అయినప్పటికీ మానవనిర్మిత వనాలు 44.65 చదరపు మైళ్ళలో విస్తరించి ఉన్నాయి.జిల్లలోని అరణ్యల నుండి నిప్పుకోడి, సాఫ్ట్‌వుడ్, వంటచెరకు, జీడి, నిమ్మ, చింతపండు మొదలైనవి అరణ్యాల నుండి లభిస్తున్న వనసనాదలు. అరణ్యప్రాంతంలో వీటీని నాటి పంటను అభివృద్ధిచేస్తున్నారు.[4] జిల్లాలో బయోలాజికల్ వనరులను సంరక్షించే పథకాలు అమలు చేయబడలేదు. వన్యమృగాల సమాచారం అందుబాటులో ఉండడం ప్రత్యేకత..[4]

గణాంకాలుసవరించు

2011లో గణాంకాలను అనుసరించి తేనీ జిల్లా జనసంఖ్య 1,245,899. స్త్రీ పురుష నిష్పత్తి 991:1000.[9] ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలబాలికల సంఖ్య 61,873 ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలుర సంఖ్య 119,661, ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలికల సంఖ్య 57,788. వెనుకబడిన తరగతి ప్రజల శాతం 20.72%, వెనుకబడిన జాతుల ప్రజల సంఖ్య 15% . అలాగే సరాసరి అక్షరాస్యత శాతం 69.84%, జాతియ సరాసరి (72%) కంటే ఇది తక్కువ.[9] జిల్లాలో నివసిస్తున్న మొత్తం కుటుంబాలు 338,112. జిల్లాలో మొత్తం శ్రామికుల సంఖ్య 591,642. వీరిలో రైతుల సంఖ్య 36,371, ప్రధాన వ్యవసాయ కూలీలు 275,585, కుటీర పరిశ్రమలలో పనిచేసేవారు 12,714, ఇతర శ్రామికులు 205,921, సమాయనుకూలంగా పనిచేసేవారి సంఖ్య61,051, సన్నకారు రైతుల సంఖ్య 1,996,సమయానుకూలంగా వ్యవసాయపనులు చేసే వారు 39,576, సమయానుకూలంగా కుటీర పరిశ్రనులలో పనిచేసేవారు 2,225, సమయానుకూలంగా ఇతరపనులు చేసేవారు 17,254. [10]

పర్యాటకసవరించు

బోడినాయకనూరు, పెరయారు, కంబం, ఉత్తమతాళయం, థేని జిల్లాలో అందమైన ఊర్లు. అద్భుతమైన సెలయేళ్ళు, ఒక టాప్ బిలియర్డ్స్ ఆకుపచ్చ కొండలపై, పరిపూర్ణ రాక్ ముఖాలు, పురాతన దేవాలయాలు విశ్రాంతి వెండి చెట్లతో మేఘాలు ఈ స్థలాలు వేరు .

పట్టించుకోని ప్రదేశాలు '

 
Vaigai Dam
  1. [ [ వైగై డ్యామ్ ] ] ( ~ తేని నుండి 20 కిమీ )
  2. [ [ సురుళి వస్తుంది ] ] ( ~ తేని నుండి 50 కిమీ)
  3. [ [ మంజలారు ఆనకట్ట ] ] ( ~ తేని నుండి 35 కిమీ )
  4. [ [ మేఘమలై ] ] హిల్ ( ~ తేని నుండి 67 కిమీ)
  5. బోడీ మెట్టు హిల్ ( ~ తేని నుండి 45 కిమీ )
  6. కుంబకరై జలపాతం ( ~ తేని నుండి 24 కిమీ)
  7. సోత్తుపారై ఆనకట్ట ( ~ తేని నుండి 24 కిమీ )
  8. షన్ముగనాథన్ ఆనకట్ట ( ~ తేని నుండి 50 కిమీ )
  9. ( ~ తేని నుండి 15 కిలోమీటర్లు ) చిన్న సురుళి వస్తుంది
  10. రామక్కల్ మెట్టు ( ~ తేని నుండి 30 కిమీ )
  11. కురంగని ( ~ తేని నుండి 20 కిమీ )
  12. హైవీవ్స్ ( ~ తేని నుండి 80 కిమీ )
 
Shanmuganathi Dam

కేరళలో సమీప స్థలాలుసవరించు

  1. తేక్కడి ( ~ తేని నుండి 80 కిమీ)
  2. మున్నార్ ( ~ తేని నుండి 95 కిమీ )
  3. కుములి ( ~ తేని నుండి 70 కిమీ)

ఉతవాలుసవరించు

 
Bullock cart race held in Theni district
  • తేనీలోని ఉత్తమపాళయం వద్ద జరుగుతున్న రంజాన్ పెరునాళ్.
  • మేమాసంలో వీరపాండి, కంబం లలో కోలాహలంగా జరిగే గౌరియమ్మన్ ఆలయ ఉత్సావాలు.
  • భద్రకాళీపురంలో శ్రీభద్రకాళీయమ్మన్‌కు జరిగే చిత్తిరై ఉత్సవాలు.
  • తేనీ అల్లినగరంలో చిత్తిరై తిరునాళ్ సమయంలో శ్రీ వీరప్ప అయ్యనార్ ఉత్సవాలు చాల ప్రసిద్ధిచెందినవి.
  • దేవధానపట్టిలో నిర్వహించబడే కామాక్షి అమ్మన్ ఉత్సవాలు, కుచనూరులో జరిగే శనీశ్వరన్ ఉత్సవాలు జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
  • తేనీ జిల్లాలో సంక్రాంతి వైభవంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఈ ఉత్సవాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా పల్లవరాయన్ పట్టి, అయ్యంపట్టి, పుదుపట్టిలలో జల్లికట్టు అనే ఎద్దుక పందాలు నిర్వహిస్తారు. బూదిపురం - వాల్కనో స్పోర్ట్ క్లబ్ నిర్వహించే కబడీ, క్రికెట్ పందాలు కూడా ప్రాముఖ్యత సంతరుంచుకున్న విషయాలలో ఒకటి.
  • మరిక ముఖ్యమైన ఉత్సవాలలో గూడలూరులో శ్రీమంగళదేవి కణ్ణగికి చేసే చిత్రాపూర్ణిమ ఒక్కటి. ఇది మే మాసంలో నిర్వహించబడుతుంది.
  • ఈ ప్రాంతంలో నిర్వహించబడే ప్రాముఖ్యత సంతరించుకున్న ఉత్సవాలలో కామాక్షి అమ్మన్ ఆలయంలో మాసిమహం, శివరాత్రి ముఖ్యమైనవి. ఇవి ఫిబ్రవరి- మార్చి మాసాలలో నిర్వహించబడుతుంది. అలాగే కొత్తూరులో ఏకాదశి కూడా కోలాహలంగా నిర్వహించబఆడుతుంది.
  • అనియమలయాంపట్టిలో క్రిస్మస్, న్యూ ఇయర్ కోలాహాంగా నిర్వహించబడుతుంది.
  • అళగర్ చిత్రాపౌర్ణమి నాడు గోవిందనగరం వద్ద ఫంగుణి తిరువిళా ఘనంగా నిర్వహించబడుతుంది.
  • గండమనూరు ఫంగుణి తిరువిళా కూడా ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగలో ఒకటి.
  • అరుళ్‌మిగు పాట్టలమ్మన్, కాళియమ్మన్, కరుప్పస్వామి ఆలయం ఉత్సవాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

మూలాలుసవరించు

  1. "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
  2. M.Subramani. "History of Theni District". thenitimes.sitesled.com. pp. history p1/2. Archived from the original on 2008-05-10. Retrieved 2008-09-14.
  3. 3.0 3.1 M.Subramani. "History of Theni District". thenitimes.sitesled.com. pp. history p2/2. Archived from the original on 2009-07-15. Retrieved 2008-09-14.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; envis అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. 5.0 5.1 p.29
  6. Collectorate staff (2006–2007). "District Profile Theni District" (PDF). District Collectorate, Theni. pp. 1–15. Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2008-09-15.{{cite web}}: CS1 maint: date format (link)
  7. Collectorate staff (2006–2007). "District Statistical Handbook 2006-2007 Theni District" (PDF). District Collectorate, Theni. pp. 1–47. Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2008-09-15.{{cite web}}: CS1 maint: date format (link)
  8. పి.15
  9. 9.0 9.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  10. "Census Info 2011 Final population totals - Theni district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=థేని&oldid=3718750" నుండి వెలికితీశారు