దండయాత్ర 1984, జూలై 12న విడుదలైన తెలుగు సినిమా. కె. బాపయ్య దర్శకత్వంలో శోభన్ బాబు,జయసుధ , జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

దండయాత్ర
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాపయ్య
తారాగణం శోభన్ బాబు ,
జయసుధ,
శివకృష్ణ
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ హిమా మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • శోభన్ బాబు - శ్రీహరి
  • గుమ్మడి
  • రావుగోపాలరావు
  • శివకృష్ణ
  • జయసుధ - దుర్గ
  • ప్రభాకర రెడ్డి
  • అల్లు రామలింగయ్య
  • కైకాల సత్యనారాయణ
  • నూతన్ ప్రసాద్
  • రమాప్రభ
  • సూర్యకాంతం
  • అన్నపూర్ణ
  • అనూరాధ

సాంకేతికవర్గం మార్చు

కథ మార్చు

బాపినీడు అనే కోటీశ్వరుడు ధర్మమూర్తి. అతని నాయకత్వంలో తాతారావు, తుకారాం, శేషాద్రి పెద్దమనుషులుగా చెలామణీ అవుతూ తమ స్వప్రయోజనాలకోసం అరాచకపు పనులు చేస్తూ ఉంటారు. ఆ జిల్లాకు ఉన్నతాధికారులుగా వచ్చిన వారెవ్వరూ ఎక్కువకాలం అక్కడ ఉండలేరు. శ్రీహరి అనే యువకుడు కలెక్టర్‌గా ఆ జిల్లాకు వస్తాడు. ఆ జిల్లాను బాగుచేయాలని, సంఘ విద్రోహుల ఆట కట్టించాలని అతడు నడుం బిగిస్తాడు. బాపినీడు ముఠా అక్రమాలను అడుగడుగునా ఎదుర్కొంటాడు. కానీ బాపినీడు మరణంతో అతడిపై నింద పడుతుంది. బాపినీడు కూతురు శ్రీహరి సహాధ్యాయి. తండ్రి మరణంతో, ఆస్తి పోవడంతో శ్రీహరి సహాయంతో ఉద్యోగం సంపాదించి అతడిని పెళ్ళాడుతుంది. ఐతే తన తండ్రి మరణానికి ప్రతీకారంగా పగ తీర్చుకోవడం కోసమే తాను పెళ్ళి చేసుకున్నట్టు శ్రీహరికి చెబుతుంది. శ్రీహరికి ఇంటా బయటా శత్రువులు ఎదురవుతారు. ఎస్.పి.గా వచ్చిన తన స్నేహితుడు అశోక్ సహాయంతో ముఠా దురాగతాలకు ఎలా చరమగీతం పాడాడో మిగిలిన కథ.[1]

పాటల జాబితా మార్చు

1: అమ్మా అంటుకోమాక అబ్బా, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి

2: ఇంతకు ముందు ఏ పిల్లైనా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

3: కోక చూస్తే కంగారు , రచన:వేటూరి, గానం.ఎస్ జానకి

4: పాతరా జెండా మోతగా, రచన: వేటూరి, గానం. ఎస్. జానకి

5: భరత ఖండం భగ్గుమంటోంది, రచన: వేటూరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6:వేసుకొందామా పందెం, రచన:వేటూరి, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .

మూలాలు మార్చు

  1. వి.ఆర్. (16 July 1984). "చిత్ర సమీక్ష: దండయాత్ర" (PDF). ఆంధ్రపత్రిక. Archived from the original (PDF) on 30 ఆగస్టు 2022. Retrieved 30 August 2022.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దండయాత్ర&oldid=4168218" నుండి వెలికితీశారు