ప్రధాన మెనూను తెరువు

దంతేవాడ జిల్లా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దక్షిణాత్య జిల్లా. ఇది బస్తర్ విభాగంలో భాగం. జిల్లాను దక్షిణ బస్తర్ జిల్లా అని కూడా వ్యవహరిస్తారు. దంతేవాడ పట్టణం జిల్లా కేంద్రం. 1998 వరకు దంతేవాడ జిల్లా, బస్తరు జిల్లాలో ఒక తాలూకాగా ఉండేది.

దంతేవాడ జిల్లా

दन्तेवाड़ा जिला
ఛత్తీస్‌ఘడ్ లో దంతేవాడ జిల్లా స్థానము
ఛత్తీస్‌ఘడ్ లో దంతేవాడ జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌ఘడ్
పరిపాలన విభాగముబస్తర్
ముఖ్య పట్టణందంతేవాడ
మండలాలు4
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు1
విస్తీర్ణం
 • మొత్తం3.50 కి.మీ2 (1,316.80 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం2,47,029
 • సాంద్రత72/కి.మీ2 (190/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత33%
జాలస్థలిఅధికారిక జాలస్థలి

2011 జనగణన ప్రకారం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని 18 జిల్లాలో కెల్లా, నారాయణపూర్ మరియు బీజాపూర్ జిల్లాల తర్వాత దంతేవాడ మూడవ అత్యల్ప జనాభా కలిగిన జిల్లా.[1]

విషయ సూచిక

చరిత్రసవరించు

శ్రీనాధుడి కాశీఖండంలో వేమారెడ్డి జైత్రయాత్రను వర్ణించే పద్యంలో దంతెవాడ ప్రస్తావనలు ఉన్నాయి. బారహ దొంతి మన్నెం రాజులు, కోయరాజులతో పాటుగా వేమారెడ్డికి మోకరిల్లుతూంటారని రాసివుంది. అందులోని దొంతి దంతెవాడ పట్టణమేనని పరిశోధకులు పేర్కొన్నారు. రెడ్డిరాజుల కాలంలో దంతెవాడలోని రాజ్యం వేమారెడ్డికి సామంతరాజ్యంగా ఉండేదని తెలుస్తోంది.[2] స్వాతంత్ర్యానికి పూర్వం ఈ జిల్లా బస్తర్ సంస్థానంలో భాగంగా ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బస్తర్ పాలకులు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. సంస్థానం అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో భాగమైంది. 1999లో బస్తర్ జిల్లాను మూడుగా విడదీసి బస్తర్, దంతేవాడ మరియు కంకేర్ జిల్లాలను ఏర్పరచారు. 2000 సంవత్సరంలో దంతేవాడతో పాటు మధ్యప్రదేశ్ లోని పదహారు జిల్లాలతో ఛత్తీస్‌ఘడ్ అనే కొత్త రాష్ట్రం ఏర్పడింది. 2007లో దంతేవాడలోని నాలుగు తాలూకాలు (బీజాపూర్, బైరాంఘర్, ఉసూర్ మరియు భోపాలపట్నం) విడదీసి బీజాపూర్ జిల్లాను ఏర్పరచారు. 2012లో దంతేవాడ జిల్లాలోని మరో మూడు తాలూకాలు (ఛింద్‌ఘర్, సుక్మా మరియు కొంతా) తాలూకాలతో మరో కొత్త జిల్లా సుక్మా జిల్లాను ఏర్పరచారు.

భౌగోళిక అంశాలుసవరించు

దంతేవాడ జిల్లా మొత్తం విస్తీర్ణం 3,410.50 చ.కి.మీ. జిల్లాకు ఉత్తరాన మరియు ఈశాన్యాన బస్తర్ జిల్లా, తూర్పున ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కనగిరి జిల్లా, దక్షిణా మరియు నైఋతిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమ సరిహద్దుగా ఇంద్రావతి నది ఉంది. ఇంద్రావతి నదికి అవతరి ఒడ్డున ఆంధ్రప్రదేశ్ కు చెందిన కరీంనగర్ జిల్లా మరియు మహారాష్ట్రకు చెందిన గఢచిరోలి జిల్లాలు ఉన్నాయి.

పాలనా విభాగాలుసవరించు

దంతేవాడ జిల్లా నాలుగు తాలుకాలు విభజించబడి ఉంది. ఒక్కొక్క తాలూకా ఒక డెవలప్మెంట్ బ్లాక్ (అభివృద్ధి ?) గా కూడా పరిగణింపబడుతున్నవి. దంతేవాడ జిల్లాలో మొత్తం 114 గ్రామపంచాయితీలు ఉన్నవి[3] జిల్లాలోని నాలుగు తాలూకాలు:[4]

  • దంతేవాడు తాలూకా - 31 గ్రామ పంచాయితీలు, [5]
  • గీదం తాలూకా - 34 గ్రామ పంచాయితీలు,
  • కాటేకళ్యాణ్ తాలూకా - 23 గ్రామ పంచాయితీలు మరియు
  • కువకొండ తాలూకా - 26 గ్రామ పంచాయితీలు.

మూలాలుసవరించు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. వల్లూరి, విజయ హనుమంతరావు (జనవరి 2015). "మన చరిత్రరచన". సుపథ. 15 (2): 11–20. Check date values in: |date= (help)
  3. "Reports of National Panchayat Directory: Districts of Chhattisgarh". Ministry of Panchayati Raj, Government of India.
  4. "Reports of National Panchayat Directory: Blocks of Chhattisgarh". Ministry of Panchayati Raj, Government of India.
  5. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Dantewada, Dantewada, Chhattisgarh". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దంతేవాడ&oldid=2097842" నుండి వెలికితీశారు