దక్షిణోత్తర గోగ్రహణములు

దక్షిణోత్తర గోగ్రహణములు ఒక తెలుగు నాటకం. దీనిని గూడూరు వెంకట శివకవి రచించారు.

మహాభారతంలోని 'విరాట పర్వం'లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాథ ఈ నాటకానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది. శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని కౌరవులు చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు.పాండవులు ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ మహా బలవంతుడు అయిన కీచకుని కన్ను ద్రౌపదిపై పడుతుంది. కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి భీముడు, అతడిని హతం చేస్తాడు. కీచకుని మరణంతో అక్కడ పాండవులుండవచ్చునని అనుమానించిన కౌరవులు, వారి ఉనికిని బయట పెట్టేందుకు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. కౌరవులు, భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు. కౌరవ సేనను వీరోచితంగా జయిస్తానని పలికి విరాటుని కొడుకు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. అతనికి సారథిగా బృహన్నల వెళతాడు. కాని కౌరవసేనను చూచి ఉత్తరునికి వణుకు మొదలై పారిపోజూస్తాడు. బృహన్నల అతనికి నచ్చచెప్పి, తన నిజ రూపం తెలిపి అర్జునుడుగా యుద్ధానికి వెళ్ళి, కౌరవసేనను సమ్మోహనాస్త్రంతో జయించి, గోవులను మళ్ళించుకు వస్తాడు. శుభప్రదంగా పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. ఇది ఇతివృత్తం.

నాందిసవరించు

ఉ. శ్రీకరకంజమున్‌ దనవ-శ్రీకరమంతలో జేయజాలు శో
భాకరమైన చక్షుల ని-శాకరకాంతి జెలంగుదృష్టి ర
త్నాకర రాజపుత్రిని ప్ర-భాకరవక్షతలంబు నందు ధ
ర్మాకరుడై ధరించిన ద-యాకరుడెప్డు శుభం బొసంగుతన్‌.

మూలాలుసవరించు