దర్గా (కాజీపేట), హనుమకొండ మండలంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న గ్రామం దర్గా. ఇక్కడ ఉన్న దర్గా (ఒక ముస్లిము సమాధి) పేరు మీదుగానే దీనికా పేరు వచ్చింది. దర్గా అంటే ఔలియా (ముస్లిం సూఫీ సంతుడు) సమాధి. సంవత్సరానికి ఒకసారి ఈ దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవానికి దేశం నలుమూలలనుండి ముస్లిములతో పాటు హిందూ సోదరులు కూడా వచ్చి పాల్గొంటారు.