దస్త్రంపై చర్చ:C. Narayana Reddy.png

తెలంగాణా నేపధ్యంతో కూడిన చిత్రాల నకలు హక్కుల సమస్య సందేహం మార్చు

వాడుకరి:C.Chandra Kanth Rao గారు తెలంగాణా నేపధ్యంతో ఛాయాచిత్రాలు చేర్చడం గమనించాను. అయితే వాటి నకలుహక్కులపై స్పష్టత లేదు. వారు వాటిని స్వయంగా తయారు చేసిన వైతే వాటిలో వాడిన అసలు ఛాయాచిత్రం చంద్రకాంతరావుగారిదో కాదో తెలియలేదు. ఆ ఛాయచిత్రం చంద్రకాంతరావుగారే తయారుచేసినదైతే దానిని కామన్స్లో చేర్చితే మరింతగా ఉపయోగపడుతుంది. --అర్జున (చర్చ) 07:16, 13 అక్టోబర్ 2013 (UTC)

ఈ చిత్రం హిందూ పత్రికలో గల మూడు చిత్రాలలో రెండవ చిత్రం ఒకేలా ఉన్నాయి. దీనిని ఉపయోగించి తయారుచేసినట్లుంది(?).----K.Venkataramana (talk) 07:40, 13 అక్టోబర్ 2013 (UTC)
ఆ చిత్రాన్ని నేనే తయారుచేశాను. కాకుంటే అందులో ఉన్న సినారె బొమ్మ మాత్రం కామన్స్ బొమ్మ బదులు నా గ్యాలరీనుంచి వేరే బొమ్మ వచ్చి చేరింది. అలా అయిననూ ఫెయిర్ యూజ్ కిందికి తీసుకొని లైసెన్స్ మార్పు చేసే అవకాశమున్ననూ నేను దానికి వ్యతిరేకినే. కామన్స్‌లో లేదా సార్వజీనీనంగా ఉన్న బొమ్మలనే తెవికీలో ఉపయోగించడం బాగుంటుంది. ఇప్పుడు బొమ్మను మార్పు చేశాను. ఇంకనూ ఈ బొమ్మపై ఏవైనా సందేహాలుంటే తప్పకుండా తెలియజేయవచ్చు. సురవరం బొమ్మ కూడా కామన్స్ బొమ్మ కాదని ఇప్పుడే పరిశీలించాను. అయితే అది పుస్తక ముఖచిత్రం బొమ్మ మరియు యధాతధంగానూ లేదు. దానిపైనా అభ్యంతరముంటే దాన్నీ మార్చుతాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:44, 13 అక్టోబర్ 2013 (UTC)
K.Venkataramana, సభ్యుడు:C.Chandra Kanth Rao స్పందనలకు ధన్యవాదాలు. చంద్రకాంతరావుగారు మార్పు చేసినందులకు సంతోషం. అయితే చిత్రం ఎక్కింపు సమాచారంలో మూలాలను గుర్తించలేదు. ఫెయిర్ యూస్ కైనా సరే లేక ఎక్కడనుండి తీసుకున్నా ఆయా మూలాలను పేర్కొనాలి. అప్పుడే ముందు ముందు వివాదాలు రాకుండా చూసుకోవటానికి లేక వచ్చినా తేలికగా పరిష్కరించుకోవటానికి వీలుంటుంది. --అర్జున (చర్చ) 03:52, 14 అక్టోబర్ 2013 (UTC)
ఆ విషయం నాకు తెలుసు, ఫెయిర్ యూజ్ బొమ్మలు తెవికీలో వాడటానికి కూడా నేను వ్యతిరేకినే. అలాంటప్పుడు మూలాలు ఇచ్చే సమస్యే లేదు. నా బ్లాగు కొరకు మాత్రం వివిధ వనరుల నుంచి బొమ్మలను సేకరించి మార్పులు చేర్పులు చేసివాడుకుంటాను. ఇక్కడ రెండూ కలిసిపోయాయి. ఒక బొమ్మ చేర్చబోయి తెవికీలో మరో బొమ్మ పొరపాటున అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విషయంలో నాకెవరూ చెప్పకున్ననూ గమనించిన వెంటనే నేనే తొలిగించేవాడిని. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:53, 14 అక్టోబర్ 2013 (UTC)
మీకు నకలుహక్కులంటే మంచి అవగాహన వున్నదనటంలో సందేహంలేదు. అప్పుడప్పుడు పొరపాట్లు ఎవరికైనా సహజం. నేను చెప్తున్నది ఉదాహరణతో వివరిస్తాను. నారాయణరెడ్డిగారి బొమ్మ ఎక్కింపు సందర్భంగా మీరు కామన్స్ లో బొమ్మ వాడినట్లైతే మూలాలు అనగా Yugeshp, మరియు యూఆర్ఎల్ https://commons.wikimedia.org/wiki/File:CNREDDY.JPG పేర్కొనలేదని. అలాగే ఈ విధంగా తయారుచేసిన ఇతర బొమ్మలకు కూడా యిలా వ్యాఖ్యలు చేర్చమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 00:32, 15 అక్టోబర్ 2013 (UTC)
నేను ఈ బొమ్మలో కామన్స్ బొమ్మ వాడితే మరో బొమ్మలో ఫెయిర్ యూజ్ బొమ్మను కూడా వాడాను. బొమ్మ వాడే సందర్భంలో ప్రతీసారి అది ఎక్కడిది అని మనం సాధారణంగా చూడము. మనమే ఇలా చేస్తే ఇక బయటివారి సంగతి చెప్పేదేముంది? అందుకే ఫెయిర్ యూజ్ బొమ్మలకు నేను వ్యతిరేకిని. ఫెయిర్‌యూజ్ ట్యాగ్ అతికించినంత మాత్రానా మన బాధ్యత తీరిపోదు. మరికొన్ని బొమ్మలలో ఎలాంటి చిత్రాలను తీసుకోకున్ననూ ఉన్న చిత్రాలను చూసి కాపి చేశాను. ఉదా:కు తెలంగాణలో క్రీ.శ.1150 నాటి రాజ్యాలకు సంబంధించి సరిహద్దులను ఊహాజనితంగా చేయలేముకదా! దాని అసలు చిత్రం "తెలంగాణ చరిత్ర" పుస్తకం లోనిది. మరి ఆ పుస్తకంలో రచయిత స్వయంగా ఆ పటాన్ని వేశారా అంటే అదీ కాదు, ఆయన ఎక్కడి నుంచో కాపీ చేశారు. ఇలా ఎంతో వెనక్కి వెళితేకాని దాని అసలు కర్త తెలియదు. నదులకు సంబంధించి కూడా ఇంతే. అసలు తెలంగాణ ఔట్‌లైన్ యే నా స్వంతం (ఊహాజనితం) కాదు. అసలుకర్త తెలియక ఎవరిపేరు ఇవ్వాలి? (ఇదే పద్దతి వ్యాసాలకు వర్తింపజేస్తామా? ఒక వ్యాసాన్ని చదివి అర్థంచేసుకొని దాదాపు అవే పాయింట్లతో వ్యాసం రచించిన తప్పేకదా!) ఫెయిర్‌యూజ్ లైసెన్స్‌తో ఉన్న చాలా చిత్రాలకు వెబ్‌సైట్ అడ్రస్ ఇచ్చారు. అసలు ఆ వెబ్‌సైట్ వారే ఆ బొమ్మలను తీశారా? కనీసం అసలు కర్త నుంచి డబ్బులిచ్చి కొనుగోలుచేశారా? అంటే సమాధానం ఉండదు. అలాంటప్పుడు ఆ వెబ్‌సైట్ వారికి ప్రచారం చేయడం ఎందుకనేది ఆలోచించాల్సిన విషయం. వెబ్‌సైట్ వారు అలాంటి బొమ్మలను కొనుగోలు చేసిననూ ఫోటోగ్రాఫర్ ఆ వ్యక్తులను అనుమతితోనే ఫోటోతీశారా? అనేది సందేహాస్పదమే. "ఎంచబోతే మంచమంతా కంతలే" అన్నట్లు కాపీ హక్కులకు సంబంధించి అడుగడుగునా తప్పులే కనిపిస్తాయి. కాపీహక్కుల గురించి చెప్పాలంటే అదో సుధీర్ఘ చర్చ అవుతుంది. దీని గురించి వివరించడం కంటే "గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం" నయమనిపిస్తుంది. ఒక పుస్తకం ముఖచిత్రం బొమ్మను వెబ్‌సైట్ నుంచి మనం కాపీచేస్తే సైట్ అడ్రస్ ఇస్తాం. కాని ఆ పుస్తకం ముఖచిత్రం కాపీరైట్ హక్కులు సాధారణంగా పుస్తకం ప్రచురణ దారులకే ఉంటాయి. ఆ బొమ్మ ఎక్కడిది అని ఆలోచిస్తే మళ్ళీ పై వాదనలు షరామామూలే. విగ్రహాల బొమ్మలను తీసి మనం సార్వజనీనం లైసెన్స్‌తో విడుదల చేస్తాం. అలా చేయడానికి అధికారం మనకుందా? రోడ్డుప్రక్కన అతికించిన సినిమాపోస్టర్ ను కెమెరాతో ఫోటోతీసిననూ దాన్ని సార్వజనీనం చేయలేము (కాపీరైట్ హక్కులు నిర్మాతలకే ఉంటాయి) అలాంటప్పుడు ఎంతో వ్యయప్రయాసాలతో తయారుచేసిన విగ్రహంపై హక్కులు అసలు వారికి ఆపాదించలేమా! మరి ఎవరి పేరు ఇవ్వాలి? ఒక అందమైన చిత్రానికి ఫోటోతీసిననూ దాన్ని చిత్రించిన చిత్రకారుడి పేరు ఇవ్వాలి కాని అప్లోడ్ చేసిన సభ్యుడి పేరు ఇవ్వలేము కదా! అలా అనుకుంటే ప్రకృతి దృశ్యాలు తప్ప వేటినీ సార్వజనీనం కిందకు విడుదల చేయలేము (స్వయంగా తీసినా సరే). ప్రకృతి దృశ్యాలకూ పరిమితులుంటాయి. ఉదా:కు ప్రకృతిపరంగా పెరిగే మొక్కలైనా సరే రామోజీఫిలింసిటి లాంటి బొమ్మలు సార్వజనీనంగా విడుదల చేయడం ఒక రకంగా ఆలోచిస్తేతప్పే. ఎందుకంటే వ్యయప్రయాసాలతో పెంచిన మొక్కలను ఫోటో రూపంలో కాపీ చేయజాలము. కాపీహక్కులు తొలిగిపోయిన పాత పుస్తకంలోని బొమ్మలను ఫోటోతీస్తే ఆ గుర్తింపు ఎవరకివ్వాలి అనేది సమస్యే. పాత పుస్తకాలకు ఒక ఫోటో తీసినంతమాత్రాన గుర్తింపు వస్తుందని చెప్పలేము. అసలుకర్త తెలియనప్పుడు, కాపీహక్కుల కాలంతీరిన బొమ్మలను ఉపయోగించినప్పుడు కేవలం అప్లోడ్ చేసిన వాడుకరి పేరు ఇవ్వడం కంటే ఆ చిత్రాలనే సమూలంగా మార్చుటకు ప్రయత్నిస్తాను. కాపీహక్కుల నియమాలు స్పష్టంగా లేనప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకొనే అవకాశముంది కూడా. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:41, 15 అక్టోబర్ 2013 (UTC)
నేను ఇటీవల వికీమేనియాలో కాపీరైట్ల గురించి [http://www.wikimedia.de/images/1/15/CC-NC_Leitfaden_2013_engl.pdf వికీమీడియా జర్మనీ ప్రచురించిన పుస్తకం (ఆంగ్ల రూపం) చూడడం జరిగింది. కాపీరైట్ల చట్టం క్లిష్టమైనదైనా మనము సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుంటే వివాదాలను చాలావరకు సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీ స్పందనలో సమస్యని విశాలదృక్పధంతో చర్చించారు. ప్రస్తుత బొమ్మ చర్చను సందర్భంగా తీసుకుంటే నా దృష్టిలో మీ కృతి ఒక మాష్అప్ (మిశ్రితమైనది). దీనిలో అనుమానం వున్నది సినారాయణరెడ్డి గారి ఛాయాచిత్రం. అది కామన్స్ లోనిదయితే దానిని వాడుకోవటానికి నిర్దిష్టమైన నిబంధనలున్నాయి.(Commons:Reusing_content_outside_Wikimedia, Commons:Credit_line, Commons:DW#What_is_a_derivative_work.3F మరియు పైన పేర్కొన్న పుస్తకంలో పేజీ 17 (15. How does NC affect mashups?) మరియు మీరు తయారు చేసిన బొమ్మ లైసెన్స్ CC-BY-SA కాబట్టి, ఒక గుర్తింపు విషయంలోనే సమస్య వుంది. అది మీరు ఆ బొమ్మ పేజీలో మూలాన్ని, మూలం సంపాదకుడు(Author)నే పేర్కొంటే సరిపోతుంది. మీరు పేర్కొన్న ఇతర సందర్భాలలో నాదృష్టిలో నిబంధనలు పాటించిడానికి ఈ విధంగా చేస్తే (అ) సార్వజనీయత (CC-0, Public domain) లైసెన్స్ గల వాటిని వాడినపుడు ఏ గుర్తింపు అవసరంలేదు. (ఆ) కాపీరైట్ కాలం తీరిన కృతులు వాడేటప్పుడు చట్టపరంగా ఏ గుర్తింపు అవసరంలేకపోయినా, గుర్తింపు ఇవ్వటము మంచిది ఎందుకంటే కొత్త కృతి విశ్వసనీయతని పెంచుతుంది. వేరే వాళ్లు దానిని మెరుగుపరచాలనుకున్నపుడు వీలవుతుంది.(ఇ) బహిరంగ ప్రదేశాలలోని కళాకృతులు ఫోటో తీసినపుడు, మీరు ఎక్కడ తీశారో పేర్కొంటారు కాబట్టి గుర్తింపు ఇచ్చినట్లే. (కొన్ని దేశాలలో బహిరంగ ప్రదేశాలలోని కట్టడాలను ఫోటో తీయడమే నేరం, దానికి వ్యతిరేఖంగా ఉద్యమాలు జరుగుతున్నవి) (ఈ) రామోజీ ఫిల్మ్ సిటీ లేక ప్రజాఉద్యానవనాలు లో ఫోటోలు తీస్తే తీసినవారికే ఆహక్కులుంటాయి. అవసరమైతే ఆయా సంస్థలు ఫోటోలు తీసుకోవటానికి కొంత రుసుముని వసూలుచేస్తాయి. అందువలన మనం కాపీరైట్ సమస్యలని వ్యక్తిగత అభిరుచులని బట్టికాక, ప్రాజెక్టుకు సంబంధించిన నిబంధనలు పాటించితే సులభంగా పరిష్కరించుకోవచ్చు. --అర్జున (చర్చ) 04:10, 16 అక్టోబర్ 2013 (UTC)
అమలులో ఉన్న నిబంధనలు పాటించరాదనేది, వ్యక్తిగత అభిరుచులకనుగుణంగా చేయడమనేది నా ఉద్దేశ్యం కాదు కాని నిబంధనలలో స్పష్టత లేనప్పుడు దాన్ని సరిచేయడానికి లేదా కనీసం సభ్యుల దృష్టికి తీసుకురావడంలో ఈ చర్చ కొంతైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అయిననూ ఇదేమీ పెద్ద సమస్య కాదు, వాడుకరి పేరిస్తే లేదా మూలం చేరిస్తే సరిపోతుంది. మరి ఈ చిత్రాన్ని ఆ సభ్యుడే తయారు చేశాడా అనేది సందేహంగానే ఉంది. అంత తక్కువ రెజ్యులేషన్‌తో అప్లోడ్ చేశారంటే అది ఖచ్చితంగా ఏదో పాత పత్రికలోనిదో, పాత పుస్తకం లోనిదో అయి ఉంటుంది. దానికి కాపీరైట్ కాలం కూడా ముగిసి ఉండవచ్చు కూడా. అదే బొమ్మ నేనే అప్లోడ్ చేసి ఉంటే దాన్ని మార్పులు చేర్పులు చేసి నా పేరు పెట్టుకోవడం సమంజసం కాదు కదా! అంతేకాకూండా ఒకే రకమైన బొమ్మలు అంతర్జాలంలో అనేక సైట్లలో ఉన్నప్పుడు మనం ఏదో ఒక సైట్ నుంచి కాపీచేసి ఆ సైట్ పేరు ఇవ్వడంతో అసలు బొమ్మ సృష్టికర్తకు అన్యాయం జరిగే అవకాశమూ ఉంటుంది,అదే సమయంలో కాపీ చేసే వాళ్ళకు ప్రచారం చేసినట్టూ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటికిప్పుడే బొమ్మలో కాని వివరణలో కాని మార్పులు చేయక అవసరమైతే నేనే మరో బొమ్మను తీసుకొని అసలు కర్తకు న్యాయం జరిగేటట్లు చేస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:06, 16 అక్టోబర్ 2013 (UTC)
మనకు తెలిసినంతవరకు మనం నియమాలను పాటించగలం అంతేగాని మనకు తెలియని వాటికొరకు వెతుక్కుంటే వెళ్లలేంకదా. మీరన్నట్లు ఈ చర్చవలన అందరి సభ్యులకు కొంత అవగాహన మెరుగైనదని తలుస్తాను. మీరు మార్చేటంతవరకు కామన్స్లో నియమాలకు అనుసరించి గుర్తింపునిస్తే మంచిది.ఒక అనుభవమున్న వికీపీడియన్ గా మీ చర్య ఇతరుకు ఆదర్శప్రాయమవుతుంది. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 14:42, 16 అక్టోబర్ 2013 (UTC)
నా అభిప్రాయాన్ని అర్థం చేసుకొనక అనవసరంగా చర్చను సాగదీస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడం నా తప్పు కాదు, ఆ చిత్రం ఆ సభ్యుడి స్వంతకృతి కానప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలియజేయలేడు. నిబంధనల ప్రకారం మూలాన్ని తెలియజేయాలి. అక్కడ పాటించని నిబంధనను నాపై రుద్దుతున్నారు. నేను చిత్రాన్నే మారుస్తానని చెబుతున్ననూ ఇంతగా పట్టుపట్టడం అర్థం కావడం లేదు. బొమ్మ స్వంతకృతిదార్లకు తప్పకుండా న్యాయం జరగాలి (ఇది కాకుంటే మరో బొమ్మ అయినా సరే). ఈ బొమ్మపై మీకు ఇష్టం లేకుంటే మొత్తం తొలిగించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:44, 16 అక్టోబర్ 2013 (UTC)
నిన్ననే ఈ చర్చకి ముగింపు వాక్యం రాశాననుకున్నాను. మీరు మరల నాపై అక్షేపణ చేయడంతో ఈ వ్యాఖ్య రాయక తప్పటంలేదు. చర్చని సూటిగా సాగటానికి నావంతు కృషి చేశాను. అయితే మీ చర్చముగింపు ప్రతిపాదన నాకు ఎలా నచ్చలేదో నా ప్రతిపాదన మీకు నచ్చలేదని పై వ్యాఖ్య తెలుపుతున్నది. కామన్స్ లోని బొమ్మల గురించి అనుమానాలుంటే కామన్స్ లో చర్చించవచ్చు. ఆ కృతి కర్త ఇంకా[క్రియాశీలంగానే] వున్నట్లు తెలిసింది. మీరు వారినే నేరుగా సంప్రదించి తదుపరి చర్య తీసుకొనమని కోరుతున్నాను. నేను ప్రతిపాదించిన లేక పాల్గొన్న చర్చలలో పూర్తి ఏకాభిప్రాయం ఏర్పడకపోతే నేను తదుపరి చర్యలు చేపట్టదలుచుకోలేదు. చర్చలో పాల్గొనని ఇతర సహనిర్వాహకులు తగు చర్యలు చేపడతారని ఆశిస్తాను. ఈ చర్చకు ఇక సెలవు--అర్జున (చర్చ) 00:21, 17 అక్టోబర్ 2013 (UTC)
మీరు ముగించుమన్నప్పుడే చర్చను ముగించాలా? మీరు అనుకున్నట్లు జరిగితేనే ఏకాభిప్రాయం ఏర్పడినట్లా? మీరు కోరినంతమాత్రాన వికీ సోదర ప్రాజెక్టులను సంప్రదించాలా? మీరు ఏది చెప్పిననూ ఆక్షేపణ చేయకుండా ఉండాలా? నేను చెప్పదలుచుకున్నది చాలా స్పష్టంగానే చెప్పాను, తెలంగాణ పటాలు ఇష్టం లేకపోతే తొలిగించమన్నాను కూడా, ఇంతకు మించి మరేం చెప్పను? ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాను. అంతా మీ ఇష్టప్రకారమే చేయాలని సభ్యులపై ఎందుకు బలవంతం చేస్తున్నారు? తెవికీ నిర్వహణ మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది, దాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:01, 17 అక్టోబర్ 2013 (UTC)
Return to the file "C. Narayana Reddy.png".