దస్త్రంపై చర్చ:COMMON MAN STATU WORLI FOR WIKIPEDIA VU3KTB.JPG

తాజా వ్యాఖ్య: బొమ్మ పేరులో సభ్యనామమా? టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
COMMON MAN STATU WORLI FOR WIKIPEDIA VU3KTB.JPG అనే పేరుగల ఈ బొమ్మను తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు బొమ్మ శీర్షికలో 2009 సంవత్సరం, 19 వ వారంలో ప్రదర్శించారు.
Wikipedia
Wikipedia


ఈ వారం బొమ్మ మార్చు

కామన్ మ్యాన్ బొమ్మను 14వ వారానికి మొదటి పేజీలో ఉంచడాన్ని నేను తొలిగించాను. బొమ్మలు అప్‌లోడ్ చేసిన వెంటనే ఈవాబొ కొరకు ప్రతిపాదన చేయడం, మొదటి పేజీలో ప్రదర్శనకై ఏదో ఒక వారంలో చేర్చడం తెవికీ సంప్రదాయం కాదు. ప్రతి దానికి కొంతకాలం వేచి చూడటం అవసరం. బొమ్మ అప్‌లోడ్ చేసిన తర్వాత కొంత కాలానికి ఈవాబొగా చర్చా పేజీలలో మూస చేర్చాలి. ఆ అనంతరం మరి కొంతకాలానికి ఈవాబొగా ప్రదర్శితున్నట్లు ప్రకటించాలి. ఇప్పటికే చాలా బొమ్మలు ఈవాబొ కొరకు వేచి చూస్తున్నాయి. వీటన్నిటినీ అధికమించి అప్‌లోడ్ చేసిన వెంటనే ఈవాబొగా ప్రదర్శించుటకు ఈ బొమ్మకు ఎలాంటి ప్రత్యేకత మరియు బలమైన కారణం లేదు. కాబట్టి కొంతకాలం తర్వాత మాత్రమే ఈ ప్రక్రియలు పూర్తి చేసిన పిదప ఈవాబొగా పరిగణించవలసి ఉంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 08:40, 27 మార్చి 2009 (UTC)Reply
(సభ్యుడు Vu3ktb చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యను ఇక్కడ అతికిస్తున్నాను. బొమ్మకు సంబంధించిన చర్చను బొమ్మ చర్చాపేజీలోనే చేయాలని నాకు తెలుసు. కాని ప్రస్తుతం చురుకుగా లేని సభ్యుల దృష్టికి తేవడానికి ఇంతకంటె సరైన మార్గం లేదని సభ్యుని చర్చాపేజీలో చేశాను. అయితే సదరు సభ్యునిచే ఈ చర్చను తొలిగించబడింది. భవిష్యత్తులో ఈ చర్చ మరెవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో మళ్ళీ ఇక్కడ అతికించాను.)


ఈ పుటలో చూస్తే ఈ బొమ్మ ఇప్పటికే ప్రదర్శించబడినట్లు వ్యాఖ్య కనబడుతున్నది. కాని, ఈ వారపు బొమ్మల జాబితాలో చూస్తే ఈ బొమ్మ కనబడటంలేదు.

ఈ వారపు బొమ్మ పుటలో అక్కడ బొమ్మ ఉంచటం గురించి ఈ వ్యాక్యం ఉన్నది ఇది నిర్వాహకులే చేయనక్కరలేదు. చొరవగా మొదటి పేజీ శీర్షికల నిర్వహణలో పాల్గొనండి అని ఉన్నది. అది చూసి నిజమే కాబోలని ఈ బొమ్మను ఈ వారపు బొమ్మగా ప్రతిపాదిస్తే,తొలగించారు.

ఈ బొమ్మ ప్రత్యేకత ఈ బొమ్మ ముంబాయిలో వర్లీ సముద్ర తీరంలో, ముంబాయి ప్రజలు ఉంచిన విగ్రహం. ఈ విగ్రహం ఏదో రాజకీయ నాయకునిది, చలన చిత్ర నటునిది లేదా స్వాతంత్ర పోరాట యోధునిదో కాదు. ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన ఒక కార్టూన్ పాత్ర 'సామాన్య వ్యక్తి'(Common Man). కొన్ని దశాబ్దాలుగా ఆర్కే లక్ష్మణ్ ప్రచురిస్తున్న కార్టూన్లలో దాదాపు అన్నిటిలోనూ (ముంబాయి నుండి వెలువడే Times of India అనే ఆంగ్ల దిన పత్రిక చదివే వారికి ఎక్కువ పరిచయం ఉండే అవకాశం ఉన్నది)దర్శనమిస్తుంది ఈ పాత్ర. ఒక కార్టూన్ పాత్రకు ఒక విగ్రహం ఉండటం, ఏర్పరచటం అనేది ఒక అరుదయిన సంఘటన. భారతదేశంలో మరే ఇతర కార్టూన్ పాత్రకు ఈ గౌరవం దక్కలేదు.ప్రపంచ వ్యాప్తంగా మరే ఇతర కార్టూన్ పాత్రకు ఒక విగ్రహం ఏర్పరచటం అన్న విషయం గురించి నేను చదవలేదు, వినలేదు, చూడలేదు. అందువలన, ఈ బొమ్మ ప్రాశస్త్యాన్నీ దృష్టిలో ఉంచుకొని, ఈ పాత్రను సృష్టించిన ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ కు నివాళిగా, ఈ బొమ్మను ఈ వారపు బొమ్మగా ఉంచాలని ప్రతిపాదిస్తున్నాను. దయచేసి నిర్వాహకులందరూ మరియు సోదర సభ్యులు పరిశీలించగలరు.--S I V A 07:59, 7 ఏప్రిల్ 2009 (UTC)Reply

శివ గారూ! తప్పకుండా నండీ! ఈ బొమ్మ ఖచ్చితంగా ఈ వారం బొమ్మగా ప్రదర్శింపదగ్గదే. అందులో సందేహం లేదు. కాకపోతే, దీనికంటే ముందు ప్రతిపాదించిన బొమ్మలను పక్కకు నెట్టి, ముందుగా దీనిని ప్రదర్శించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల సదరు సభ్యులు తొలగించిఉండవచ్చు. దీన్ని మీరు మనసులో పెట్టుకోకండి. -- రవిచంద్ర(చర్చ) 09:52, 7 ఏప్రిల్ 2009 (UTC)Reply
రవిచంద్రగారూ!ధన్యవాదములు. నేను ప్రతిపాదించి బొమ్మను అన్నిటి కంటే చివరగా ఉంచాను, ఇతర బొమ్మలకంటే ముందుగానే చూపించాలన్న ఊహ నాకు ఎంతమాత్రం లేదు. అయినా సరే తొలగించారు అందుకు బాధ కలిగింది. పైగా తొలగించిన కారణం నాకు ఏ మాత్రం సబబుగా అనిపించలేదు, ఆ సభ్యునికి మాత్రమే తెలిసిన లేదా అనుకున్న నియమేదో ఉదహరించి తీయటం జరిగింది. నియమేదైనా సరే నేను పాటించటానికి సిద్ధం, కాని ఎక్కడా కనబడని ఊహా జనిత నియమాలు మనకు తెలియవు కదా! ఏమైనా ఒక అరుదైన బొమ్మను సభ్యులందరి దృష్టికి తేవటం నా ఉద్దేశ్యం. మరొక్కసారి ధన్యవాదములు.--S I V A 12:15, 11 ఏప్రిల్ 2009 (UTC)Reply
బొమ్మ గురించి నేను అభ్యంతర పర్చలేదు, బొమ్మను వెంటనే మొదటిపేజీలో ప్రదర్శించడానికి అనుసరించిన పద్దతికే అభ్యంతరపర్చినాను. బొమ్మను చివరన ఉంచారని అంటున్నారు కాని 13వ వారంలో (24 మార్చి 2009, శుక్రవారం) అప్లోడ్ చేసిన బొమ్మను వెంటనే 14వ వారంలో ప్రదర్శించడానికి ప్రయత్నించినది నిజము కాదా? (అంతవరకు ఉన్న ఇతర బొమ్మల కంటె ముందు పెట్టడానికి అవకాశమే లేదు. ఎందుకంటె అవి ఇదివరకే మొదటిపేజీలో ప్రదర్శిమ్చబడ్డాయి). బొమ్మ చర్చాపేజీలో ఈవాబొ మూసను మాత్రమే పెట్టియుంటే సరిపోయేది. అలా కాకుండా సభ్యుల దృష్టికి రాకుండా ఏకంగా మొదటి పేజీ ప్రదర్శనకు పెట్టడము బాగుండదు. ఈవాబొ మూసలున్న బొమ్మలు ఇప్పటికే చాలా ఉన్నాయి. 14వ వారానికి ప్రదర్శించాలనుకున్న బొమ్మను నేను తొలిగించడం మాత్రం సబబే. ఎందుకంటె తెవికీలో ఏది చేయాలన్ననూ సభ్యుల దృష్టికి తేవాల్సి ఉంటుంది. వ్యాసం పేరు మార్చాలన్నా, వ్యాసాలు విలీనం చేయాలన్నా సభ్యుల దృష్టికి తెస్తున్నాం. మరి మొదటి పేజీలో ఒక బొమ్మను ఏకంగా అప్లోడ్ చేసిన వెంటనే ఎలా ప్రదర్శించగలుతాం? -- C.Chandra Kanth Rao-చర్చ 18:54, 11 ఏప్రిల్ 2009 (UTC)Reply

కామన్స్‌లో పెట్టండి మార్చు

శివా! ఈ బొమ్మ వికీ కామన్స్‌లోకి అప్‌లోడ్ చేసి ఆంగ్ల వ్యాసంలో కూడా ఉంచితే బాగుటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:15, 11 ఏప్రిల్ 2009 (UTC)Reply

బొమ్మ పేరులో సభ్యనామమా? మార్చు

బొమ్మ బాగుంది కాని బొమ్మ పేరే నాకు నచ్చలేదు. Common Man Statue అని మాత్రమే పెడితే సరిపోయేది. WORLI FOR WIKIPEDIA (only అనుకుంటా) అవసరం లేదు. (సభ్యుడు అప్లోడ్ చేసిన ఇతర బొమ్మలలో కూడా ఈ పదాలున్నట్లు గమనించాను). అంతేకాకుండా బొమ్మపేరులో VU3KTB సభ్యనామ ఎందుకు? వ్యాసాలకు, బొమ్మలకు పేర్లు పెట్టడంలో కూడా ఇది నా పద్దతి చెప్పడానికి వీలుండదు. బొమ్మలను కొత్తపేరుతో తరలించడానికి వీలుండదు కాబట్టి మళ్ళీ సాధారణ నామంతో బొమ్మను అప్లోడ్ చేయడం మంచిది. ఆ తర్వాత ఈ బొమ్మను తొలిగించవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:02, 11 ఏప్రిల్ 2009 (UTC)Reply

ఆర్కే లక్ష్మణ్ అంటే అందరికీ గౌరవమే, గౌరవించాల్సిందే, ఎవరూ కాదనలేరు. కాని జీవించియున్నప్పుడే నివాళి అర్పించడం బాధాకరం. -- C.Chandra Kanth Rao-చర్చ 19:06, 11 ఏప్రిల్ 2009 (UTC)Reply
ఎవరో ఒకరి ఊహజనితమైన సంప్రదాయాలు అనుసరించటం సభ్యులకు కష్టం. కాబట్టి,ఊహలలో ఉన్న "సంప్రదాయాలను" ఒక నియమంగా అందరికి కనబడేట్టుగా ఉంచితే, సభ్యులు పాటించవచ్చు, అనవసరమైన చర్చలు నివారించవచ్చు. ఇంతకంటే నేను చెప్పవలసినది లేదు.--S I V A 07:00, 14 ఏప్రిల్ 2009 (UTC)Reply
తెవికీలో ఊహాజనితమైన సంప్రదాయాలు అనే పదానికి అర్థమే లేదు. ఎప్పుడో పాతరాతియుగంలోనో మరెప్పుడో జరిగిన సంప్రదాయాలు అలా ఉండేవి, ఇలా ఉండేవి అంటే అవి ఊహాజనితం కావచ్చు కాని ప్రస్తుతం జరుగుతున్న సంప్రదాయాలను ఊహాజనితంగా కొట్టివేయడం ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడి సంప్రదాయాలు ఎవరో ఒకరు, ఎవరో ఒకరికొరకు ఏర్పర్చినవి కావు. ఇప్పటి చాలా సభ్యులు తెవికీలో చేరనప్పటినుంచే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక నియమాలా? ఉన్న నియమాలను ఎలా పాటిస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాంటప్పుడు కొత్తగా నియమాలు సృష్టించినా వాటిని ఎంత వరకు అమలుచేస్తారన్నది సందేహాస్పదమే! ప్రతివాటికి నియమం రాయడం అసాధ్యమే. ఎన్ని నియమాలు ఉన్ననూ తోటి సభ్యుల చర్చలకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం.తెవికీ ప్రాధాన్యత గురించి తెలియపర్చే సభ్యుల చర్చలను అనవసర చర్చలుగా పరిగణించే వారు ఇటీవల వరకు (ఒక అజ్ఞాత సభ్యుడు మినహా) తెవికీలో కనిపించలేరు కాబట్టి నియమాలపై అంతగా దృష్టిపెట్టలేరు. ఇప్పుడిప్పుడే దీని అవసరం ఉందని నేను గమనిస్తున్నాను, అందుకే రెండు రోజుల కిందట జరిగిన ఒక వర్గపు చర్చా పేజీలో ఇదే విషయాన్ని లేవనెత్తాను. తెవికీ ప్రయోజనాల దృష్ట్యా చేసిన చర్చను పాటించడం సభ్యత ఇంతకంటె ఎక్కువ ప్రస్తుతానికైతే చెప్పను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:25, 14 ఏప్రిల్ 2009 (UTC)Reply
Return to the file "COMMON MAN STATU WORLI FOR WIKIPEDIA VU3KTB.JPG".