దాదారావు యాదవరావుజీ కెచే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

దాదారావు యాదవరావుజీ కెచే
దాదారావు కేచే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019- 2024 నవంబర్ 23
ముందు అమర్ శరద్రరావు కాలే
తరువాత సుమిత్ వాంఖడే
నియోజకవర్గం ఆర్వీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
ముందు అమర్ శరద్రరావు కాలే
తరువాత అమర్ శరద్రరావు కాలే
నియోజకవర్గం ఆర్వీ

వ్యక్తిగత వివరాలు

జననం 1953
మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

దాదారావు కేచే 1983లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2009 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమర్ శరద్రరావు కాలేపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

దాదారావు కేచే 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమర్ శరద్రరావు కాలేపై 12467 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయనకు 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ కేటాయించలేదు,[3] ఆయన ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. The Times of India (28 November 2024). "BJP Strategy To Drop 7 Sitting MLAs Pays Off In Vidarbha". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  4. The Times of India (23 November 2024). "Keche quits politics, rues not contesting polls as Independent". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.